ప్లాస్టిక్ ప్రభావం
మనల్ని నాశనం చేస్తున్న ప్లాస్టిక్ తనలో తను ఎలా సంతోషిస్తుందో ఈ కవిత తెలుపుతుంది.
నీటిని కాలుష్యం చేస్తాను
వాయువుని కాలుష్యం చేస్తాను
భూమిని కాలుష్యం చేస్తాను
ప్రకృతిని ధ్వంసం చేస్తాను
అదే నా లక్ష్యంగా కొనసాగిస్తాను
అమాయకమైన జంతువులను అనారోగ్య పరుస్తాను
రసాయనాలలో జన్మిస్తాను
లోకం మొత్తం నా వశపరచుకుంటాను
నా అవసరం ఉంది ప్రతి జీవికి
నా వల్ల హాని ఉంది ప్రతి ప్రాణికి
వివిధ రూపాల్లో నన్ను మానవులు ఉపయోగిస్తారు
తరం పెరిగేకొద్దీ తెలుసుకున్నారు నా నిజ స్వరూపం
వర్షం తరిగేకొద్దీ తగ్గించారు నా వాడకం
నేను చూడాలనుకున్నాను మనిషి పతనం
చూద్దాం ఈ యుద్ధంలో ఎవరిదో విజయం
` కె.లహరి, 9వ తరగతి
బాలలం మేము బాలలం
బాలలము మేము బాలలము
తొలి ఉషస్సు ముంగిలిలో
మెరిసే బంగారు కిరణాలం
బాలలము మేము బాలలము
అవనీ తోటలో వెలసిన చిరు మొగ్గలం
చిరుజల్లుల సవ్వడితో పరవశించు పాపలం
బాలలము మేము బాలలము
స్వచ్ఛమైన మనసుకు సాక్షులం
చిరునవ్వుల మోములకు చిరునామాలం
బాలలము మేము బాలలము
భరత జాతి గర్వించే భావి భారత పౌరులం
బంగారు భవితకు పునాదులం.
` టి. భార్గవి, 8వ తరగతి
బాల్యం
అందమైన బాల్యం
అది అందరికీ అమూల్యం
మధురమైన బాల్యం
అది తిరిగి రాని కాలం
మరువలేని బాల్యం
ఒక అందమైన తీపి జ్ఞాపకం
అందమైన బాల్యం
అది ఆపలేని జలపాతం
నేటి బాలలు రేపటి పౌరులు.
` ఎం.లిఖిత, 8వ తరగతి
కాలుష్య నివారణ
కాలుష్యం తగ్గిద్దాం
చెట్లను పెంచుదాం
మంచి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
మంచి వాయువులను ఆశిద్దాం
ప్లాస్టిక్ బదులు గుడ్డ సంచులు వాడదాం
అందరూ వాటిని వినియోగించేటట్లు చేద్దాం
కాలుష్యంతో పోరాడదాం
దేశాన్ని అభివృద్ధి చేద్దాం
చెట్లను పెంచుదాం
కాలుష్యం నుండి కాపాడుకుందాం
` ఎన్. శివ నాగలక్ష్మి, 9వ తరగతి