ఎపుడో – డా.సి. భవానీదేవి

ఆ అమ్మ కడుపులో ఊపిరికోసం
పోరాడిన కాలం ఎంతో!
ఆ పసికన్నుల పసిడి కలల్లో
వసివాడని వెలుగులు ఎన్నో!

ఆ బంగరుతల్లి మనసులో
సుడులు తిరిగిన కన్నీరెంతో!
ఆ ఆడపుటక అడుగడుగుల్లో
గుచ్చుకున్న మగ ముళ్ళెన్నో!
ఆ వివక్షతా వైకల్యాలకు
ఎదురొడ్డిన ధైర్యం ఎంతో!
ఆ చదువుల సంపాదనకై
పరిగెత్తిన ధీరత ఎంతో!
ఆ ప్రేమోన్మాద పిశాచాలను
ఎదిరించిన ధీరత ఎంతో!
ఆ పెళ్ళి తంతుల సంతలకోసం
బేరసార విలువలు ఎంతో!
ఆ గడపను దాటించిన
మగవాడి హింసది ఎంతో!
ఆ కోడరికం తలుపుల మాటున
కాల్చేసిన క్రూరత ఎంతో!
ఆ జన్మంతా ఋణపడటానికి
కాపాడిన ఆప్యాయత ఎంతో!
ఆ అమ్మాయీ మనిషేనని
గుర్తించే కాలం ఎపుడో!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.