అమ్మలా ప్రేమని ఇస్తుంది
మహిళలా బాధ్యతను వహిస్తుంది ఎంతటి బాధనైనా భరిస్తుంది
ఎంతటి కష్టాలు ఉన్నా సహిస్తుంది తన లక్ష్యానికి చేరే దాకా కష్టపడుతుంది
తన జీవితం కోసం తను పోరాడుతుంది
భూమి అంత ఓర్పు కలది సముద్రమంత విశాలం కలది
ఎవరికీ సాటి కానిది
ఎవరితో పోల్చలేనిది
కోకిల గానం లాంటి తీయని ప్రేమనిస్తుంది
తేనె లాంటి కమ్మని పలుకులు పలుకుతుంది
అన్నిటిలోకి ఉత్తమమైనది స్త్రీ