అందమైన పూలు
అందమైన పూలు
అపురూపమైన పుష్పాలు
కనకము వంటి కనకాంబరాలు జాలువారే జాజులు
సొగసైన సంపెంగలు
ముద్దొచ్చే ముద్దమందారాలు మనసును దోచే మల్లెలు
కవ్వించే కమలములు
పరిమళించే పసుపు పువ్వులు, పచ్చని చేమంతులు
గుండె దోచే గులాబీలు
బంగారు బంతి పువ్వులు, పరిమళాలు వెదజల్లే పూలు
ఈ భూమికి అలంకారాలు
– ఎ. వైష్ణవి, 9 వ తరగతి
