ద్రావిడ రాష్ట్రాల ఐక్యతకు చిహ్నంగా మారాలి – బాలసుధాకర్‌

ఏటా దక్షిణ భారతదేశానికి చెందిన కొంతమంది సృజనకారులు ఒక దగ్గర కూడుకోవడం, ఆలోచనలను కలబోసుకోవడం మంచి ప్రయత్నమే. ఈ కలయిక ద్రావిడ ప్రాంతాల, ద్రావిడ భాషల ఐక్యతకు ఎంతోకొంత మేర చిహ్నంగానే పనిచేస్తుంది.

ఈ ఏడాది ఈ లిటరరీ ఫెస్ట్‌లో ప్రగతిశీల వ్యక్తుల ప్రెసెన్స్‌ అనేది చైతన్యాన్ని ప్రోది చేసే పనికి దోహదపడినట్టుగానే వుంది. ప్రత్యామ్నాయ సినిమా దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్‌, ఆధిపత్య భావజాల మనుషులు ప్రకటించిన నిషేధంపై కలం రaులిపించిన పెరుమాళ్‌ మురుగన్‌, రీషేపింగ్‌ ఆర్ట్‌, ది స్పిరిట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ వంటి పుస్తకాల రచయిత, కర్ణాటక సంగీతకారుడు, సామాజిక చైతన్యశీలి అయిన టి.ఎం.కృష్ణ, కథానవలా రచయిత వసుదేంధ్ర, తమిళ్‌ ఫెమినిస్ట్‌ కవి సల్మా, ‘హర్ట్‌ లాంప్‌’ కథల సంపుటి రచయిత భాను ముష్తాక్‌, ‘సనాతనం’ నవలా రచయిత శరణ్‌ కుమార్‌ లింబాలే, ‘ఉచల్యా’ ఆత్మకథతో ప్రసిద్ధుడైన లక్ష్మణ్‌ గైక్వాడ్‌ వంటి కళాకారులు పాల్గొనడం, ప్రగతిశీల చర్చలు చేయడం ప్రొగ్రెసివ్‌ ఐడియాలజిని ప్రచారం చేయడంగానే భావిస్తున్నాను.
ఈ మూడు రోజుల లిటరరీ ఫెస్ట్‌లో విలువైన సెషన్స్‌ జరిగాయి. అయినా మరికొన్ని సెషన్స్‌ని పెంచాల్సి వుంది. అంతే కాకుండా ద్రావిడ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల ప్రాతినిధ్యం మరింతగా పెరగాల్సి వుంది. ఇంకా చేరాల్సిన నిబద్ధత గల సృజనశీలురూ వున్నారు. వివిధ అస్తిత్వ సమూహాల గొంతులకు వేదికగా ఫెస్ట్‌ మరింత ముందుకెళ్లాలి. భావజాల ఘర్షణ బలంగా జరగే పనికి పూనుకోవాల్సి వుంది. ఇలాంటి భారీ లిటరరీ ఫెస్ట్‌లకు డబ్బులు చాలా ముఖ్యం. ఈ డబ్బుల కోసం కాపిటలిస్ట్‌లపై ఆధారపడటం కంటే ప్రజాసమూహాల నుంచి, ప్రగతిశీల సంఘాల నుంచి ఆర్థిక వనరులను కూర్చుకునే ప్రయత్నంలాంటిదేదైనా చేస్తే మంచిదే.
ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో ఈ రకమైన లిటరరీ ఫెస్ట్‌లకు పైన నేనన్న ప్రయత్నమేమన్నా చేయొచ్చేమో గట్టిగానే ఆలోచించాలి.

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.