16 రోజుల కార్యాచరణ – భూమిక టీం

స్త్రీలు బాలికలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా 16 రోజుల కార్యాచరణను భూమిక సంస్థ పనిచేస్తున్న అన్ని బస్తీలలో నిర్వహించాము. గత రెండు సంవత్సరములుగా రకరకాల అంశాలపై అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్స్ నిర్వహించడం, హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వివిధ సంస్థల యొక్క సమాచారాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది.

2026వ సంవత్సరం16 రోజుల కార్యాచరణ యొక్క ముఖ్య ఉద్దేశం – నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 తేదీ వరకు ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఈ 16 రోజుల కార్యాచరణను నిర్వహించడం జరుగుతుంది. ఒక్కోచోట ఒక్కో రకమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్త్రీలపై జరుగుతున్న రకరకాల హింసలు అనగా ఆడపిల్ల పుట్టకముందే కడుపులోనే చంపేసే దగ్గర నుండి సరైన పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యము వంటి కనీస అవసరాలు కూడా అందకుండా చేయటం, యుక్తవయసు బాలికలపై జరుగుతున్న రకరకాల హింసలు, పెళ్లిలోనూ కట్న కానుకలు ఇవ్వడం దగ్గర నుండి కుటుంబంలో జరిగే హింస, పనిచేసే చోట, బహిరంగ ప్రదేశాల్లోనూ జరుగుతున్న రకరకాల హింసల గురించి, మహిళలపై జరుగుతున్న అనేక రకాలైన వివక్షతల గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, వాటిని అరికట్టడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలాగా కార్యక్రమాలు నిర్వహించడం ప్రభుత్వ, ప్రభుత్వేతర సహకార సంస్థల యొక్క సమాచారాన్ని అందరికీ అందించడం వంటి కార్యక్రమాలను ఈ 16 రోజుల కార్యాచరణలో నిర్వహిస్తారు. ఈ సంవత్సరము ఆన్లైన్ ద్వారా జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నా డిజిటల్ ప్రదేశం నా హక్కు అనే నినాదంతో 16 రోజుల కార్యాచరణని నిర్వహించారు. పది బస్తీలలోనూ మహిళలతో 16 రోజుల కార్యాచరణను వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా చేశాము. బస్తీలోని మహిళలతో ఆన్లైన్లో జరిగే హింస, మద్యపానం మరియు ఆర్థిక హింస సంబంధించిన రోల్ ప్లేస్ చేయించడం.
హింసకు వ్యతిరేకంగా సందేశాత్మకమైన పాటలు పాడటం.
స్లొగన్స్ చెబుతూ బస్తీ మొత్తం తిరుగుతూ ర్యాలీ నిర్వహించడం.
చేతి గుర్తులు వేయడం.
హింస తీవ్రతను బట్టి ఎరుపు, ఆరెంజ్, నలుపు రంగులతో కూడిన చేతి గుర్తులను తెల్లని వస్త్రంపై వేయటం. అనగా ఒక మహిళ తనపైన లేదా సమాజంలో మహిళలపై హింస తీవ్రస్థాయిలో ఉంది అనుకున్నప్పుడు ఎరుపు రంగుతో చేతి గుర్తు వేయడం, హింస స్థాయి అంత ఎక్కువగా లేదు అనుకున్నవారు ఆరెంజ్ రంగులో వేయడం, హింస జరిగినప్పుడు స్పందించగలగడం, సహకార సంస్థల సమాచారాన్ని ఇవ్వగలము అనుకున్న వారు నలుపు రంగు చేతి గుర్తులను వేశారు. ఇలా హింస తీవ్రత స్థాయికి వారికీ తెలియచేయడం మరియు వారిలో ఒక సంఘటితత్వం తీసుకురావడం దీని యొక్క ఉద్ద్యేశ్యం. వారి వారి బస్తీలలో ఎవరికైనా సమస్య వచ్చినపుడు వెంటనే స్పందించాలి అనే ఆలోచించకుండా ఏర్పడే లాగే ఆక్టివిటీ ఉంటుంది.
16 రోజుల కార్యాచరణబస్తీల్లోనూ రోజూ ఈ కార్యక్రమాలను నిర్వహించాము. పిల్లలు పురుషులు కూడా చాలా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. మొదటగా ప్రతి బస్తీలోను 16 రోజుల కార్యాచరణను ఉద్దేశించి ఈ అవగాహన కార్యక్రమాలు ఎందుకు జరుపుకుంటారు అన్నది వివరించాము. దానికి సంబంధించిన పాటలను స్కిట్స్‌ను బస్తీలలో ఉన్న యాక్టివ్ వుమెన్‌కి నేర్పించడం వారందరికీ అనుకూలమైన ఒక రోజు నిర్ణయించి ఆరోజు సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించడం చేసాము. ముందుగా ఒక పాట పాడడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి తర్వాత కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని వివరించాము. ఇంతకుముందు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న అనుభవంతో వారు ఆర్థిక హింస, మద్యపానం వలన కుటుంబాలలో జరిగే హింస లాంటివి ఉదాహరణగా తీసుకొని స్కిట్స్ వేశారు. అలాగే భూమిక టీం నుండి సైబర్ క్రైమ్ మరియు మొబైల్ ఫోన్స్‌ని ఈ కాలంలో యువత ఎలా దుర్వినియోగం చేస్తున్నారు వాటి వలన కలిగే నష్టాలను అర్థమయ్యే విధంగా రోల్‌ప్లేలు వేశారు. వివిధ రకాల హింసలకు హింసలను ఎలా గుర్తించాలి? ఎలాంటి సహకార సంస్థలు ఉన్నాయి అన్న సమాచారం కూడా స్కిట్స్ వేయడం ద్వారా తెలియజేశారు. వారి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. తర్వాత 16 రోజుల కార్యాచరణకు సంబంధించిన నినాదాలు మరియు మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్తీ మొత్తం ర్యాలీలు నిర్వహించాము. ఇందులో మహిళలతో పాటు పురుషులు, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
హింస తీవ్రతను వారు ఎలా అర్థం చేసుకున్నారో దానిని ఆధారంగా వారికి మూడు రంగులను ఇచ్చి వారు అర్థం చేసుకున్న విధంగా చేతి ముద్రలను తెల్లని క్లాత్‌పై వేయించాము. ఎక్కువమంది హింస రూపాలు మారినప్పటికీ హింస జరుగుతుంది అనుకున్నవారు ఎరుపు రంగు చేతి గుర్తులను వేశారు. కొంతవరకు తగ్గింది అనుకున్న వారు ఆరెంజ్ రంగుతో చేతి గుర్తులను వేశారు. హింస బాధితులకు మేము సహాయం చేస్తాము. సహకార సంస్థలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తామనుకున్నవారు నలుపు రంగు చేతి గుర్తులను వేశారు. ఈ విధంగా చేతి గుర్తులను వేయడం వలన బస్తీవాసులు ఈ పద్ధతి చాలా కొత్తగా ఉంది అని చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్ని బస్తీల నుండి 100 మంది మహిళలతో కలిపి కార్యక్రమం నిర్వహించాము. అందులో వారి బస్తీలలో వేసిన బ్యానర్స్‌ను డిస్‌ప్లే చేసాము. వాటిని చూసుకొని మహిళలు వారి బస్తీలలోనూ, వారికీ సంబందించిన వారికీ మన సమాజంలో హింస రూపాలు మారుతూ మహిళలపై, బాలికలపై ఏదో ఒకచోట జరుగుతూనే ఉంది అని మాట్లాడారు. మాకు వీటి గురించి అవగాహనా కానీ, ఆలోచించడం తెలియదు. ఆడవాళ్ళ జీవితాలలో ఇటువంటి హింసలు అనేవి ఉండటం చాల సహజం, వాటిని ప్రతి ఒక్కరు అనుభవించవలసిందే అనే అభిప్రాయంలో ఉన్నాము. కానీ భూమిక మా బస్తీలకు వచ్చినప్పటి నుండి చాలా విషయాలు నేర్చుకున్నాము. భూమిక రెండు సంవత్సరాలుగా మా బస్తీల్లో పనిచేయటం వలన మాకు గృహహింస అంటే ఏమిటి? దానిని ఎలా గుర్తించాలి. వివిధ సహకార సంస్థల వివరాలు తెలుసుకోగలిగాము. అలాగే మాకు తెలిసిన వారిలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మా బస్తీలో ఉన్న సెంటర్‌కి కానీ, భూమిక హెల్ప్ లైన్‌కి కానీ, ఫోన్ చేసి మాట్లాడించగలుగుతున్నాము అని చాలా మంది మహిళలు, పురుషులు వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.