‘నో’ చెప్పడం తప్పు కాదు – అపర్ణ తోట

ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం ముగించాక, ఒక అమ్మాయి నన్ను దొరకబుచ్చుకుని “పెళ్లి తరవాత కుటుంబంలో మగస్వామ్య బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?” అని అడిగింది ఒక అమ్మాయి. ఒక పాతికేళ్ళు ఉండవచ్చు. ఇంకా పెళ్ళికాలేదన్నది. సూటిగా అడిగిన ఈ ప్రశ్న నాకు కాస్త ఆశ్చర్యాన్ని ఆలోచనను ఇచ్చింది. ఇంత మౌలికమైన, బలమైన ప్రశ్న ఎవరు అడగలేదు నన్ను.

అదికూడా ట్రైనింగ్‌లో. సమస్యను విడమరిచి చెప్పడం మీదున్న శ్రద్ధ సమాధానం వెతకడం మీద ఉండదెందుకు అని కూడా నన్ను నేను విసుక్కున్నాను. కానీ సమస్య తీవ్రత ఇంతగా ఉన్నప్పుడు, సమస్యను వివిధ రకాలుగా గుర్తించడంలోనే పడిపోయాం. కానీ ఇటువంటి ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి కదా. అప్పటికప్పుడు కొన్ని సమాధానాలు చెప్పాను. ఆ తరవాత కొన్ని తట్టాయి. అవన్నీ ఇక్కడ ఇస్తున్నాను చూడండి.
మీ బ్యాంకు అకౌంట్ జాగ్రత్త. అది మీ ప్రైవేట్ ప్రాపర్టీ. దాని పాస్‌వర్డులు అందులో ఎంత ఉంది అనే విషయాలు మీ భర్తకి పిల్లలకి అనవసరం. దాని యాక్సెస్‌ని మరెవరితోను పంచుకోకండి. మరెవరు మీ ఎటిఎం కార్డులు వారి చేతిలో పెట్టకండి. ఇంటి ఖర్చులకు జాయింట్ అకౌంట్ మొదలు పెట్టండి. భార్య, భర్త ఇద్దరి ఇంటి ఖర్చులు, పొదుపులు, సేవింగ్స్, ఇన్సూరెన్స్‌లు, పిల్లల స్కూల్ ఫీజులు ఇందులో నుండే వెళ్లేట్టు చూసుకోండి. మీ జీవిత భాగస్వామి ఎంపికను ఎంతవరకు కుదిరితే మీ చేతులలోనే పెట్టుకోండి.
అ. మీరు పెళ్లికానివారైతే, కుదిరినంత వరకు ముందే పరిచయం చేసుకుని, నాలుగైదు సార్లు రకరకాల సందర్భాలలో వారి ప్రవర్తన మీకు సరిపడేలా ఉందో లేదో తేల్చుకోండి. ఇది ఆరంజ్డ్ మేరేజ్ తప్ప మరో దారి లేదు అనుకున్నవారికి ఇచ్చే సలహా.
ఆ. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇష్టపడే వ్యక్తి
ఉంటే-ప్రేమించడంలో వ్యక్తపరచడంలో మాత్రమే కాక, జీవితాన్ని నిర్దేశించే సందర్భాల లో వారి ప్రవర్తన మీ ఎదుగుదలకు, శాంతికి అనుకూలంగా ఉందో లేదో చూసుకోండి. మీరనుకునే ప్రేమ మిమ్మల్ని లాంగ్‌టర్మ్‌లో సంతోషంగా ఉంచగలదో లేదో, ఒకవేళ ఈ ప్రేమ లేదు అనుకుంటే ఎలా బ్రతకగలరో ఒక ప్లాన్ బి ఎల్లప్పుడూ ఉంచుకోండి. ఇష్టంగా ప్రేమలోకి ఎలా వెళ్లారో అలానే ఇష్టం లేకపోతే బయటకు రాగలిగే మార్గాన్ని స్వేచ్ఛగా తెరిచి ఉంచుకునే ఉండండి. దీనివలన ప్రేమ, దానిని నిలుపుకునే బాధ్యత మాత్రమే ఈ బంధాన్ని
ఉంచగలదు. మరేదైనా కారణంతో ఉండవలసి వచ్చినా అది శిక్షలాగా కాక ఛాయస్ గానే చూడండి. కానీ ఛాయిస్ లేక ఆ బంధంలో బంధింపడడం, అన్నిటికన్నా పెద్ద శిక్ష. స్వాలం బనకు అవకాశాలు పెంచుకోండి.
ఉద్యోగం లేదా వ్యాపారం ఏదోకటి తప్పకుండా చేయండి. వాహనం నడపడం నేర్చుకోండి. మీకంటూ ఒక స్వంత వాహనం ఉంచుకోండి.
మీ ప్రాపెర్టీలు ఏమిటో తెలుసుకోండి. అది ఎంత చిన్నదైనా సరే-ఒక ముక్కుపుడక, చేతి గాజు లేదా ఒక పెద్ద విల్లా వరకు – అది మీదే అనే విషయం మీద అపోహలు పెట్టుకోకండి. మీ అనుమతి లేదా సంతకం లేనిదే అది మీ చేయి దాటి వెళ్ళకూడదు.
ఏ బంధానికైనా ఒక మంచి సరిహద్దు ఉండాలి. అది ఎంత దగ్గర వారైనా. ఖలీల్ గిబ్రాన్ అన్నట్లు- రెండు స్థంభాల మధ్య దూరం ఉంటేనే ఆలయం నిలుస్తుంది. ఆ సరిహద్దులను జాగ్రత్తగా నిలుపుకొండి. పిల్లలను ఎప్పుడు కనాలో – అది మీ నిర్ణయమే అనే విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ అసలు పిల్లలను కనాలని లేకపోతే కూడా ఆ విషయం స్ఫష్టంగా చెప్పండి. దానికి తగిన ఏర్పాట్లు, చర్చలు తరవాత. కానీ మీ అభిప్రాయం పట్ల మాత్రం స్పష్టంగా, ఎటువంటి అపరాధ భావన లేకుండా ఉండండి. పిల్లలను కనే నిర్ణయం తీసుకునే ముందు, మీ భాగస్వామి ఆ విషయానికి ఎంత సంసిద్ధంగా ఉన్నారో చర్చించి తెలుసుకోండి. బాధ్యతను సమానంగా పంచుకుంటారు అనే నమ్మకం వచ్చే వరకు, పిల్లలను ప్లాన్ చేయకండి. చాలా సందర్భాలలో ఆడవారు పిల్లల కోసం భర్తను భరిస్తారు. మీ అలవాట్లు, నమ్మకాలు, ఆర్ధిక లెక్కలు, వెసులుబాట్లు, అప్పులు, ఆస్తులు, బాధ్యతలు అన్ని ముందే చెప్పుకోండి. మీ దగ్గర ఉన్న ప్రతి పైసా అత్తగారింటి బాధ్యతల మీద పెట్టనవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలనే సందర్భం వచ్చినా ఆ విషయాన్నీ గురించి ఒక అవగాహనతో నిర్ణయానికి రండి. దీని వలన చాలా గొడవలు తగ్గుతాయి. చుట్టాలు, స్నేహితులు వచ్చినప్పుడు పడీపడీ చాకిరీ చేయనక్కర్లేదు. ముందే చెప్పి రావాలని ఖచ్చితంగా ఉండండి. చుట్టాలను ఆదరించే పని ఆడవారిపైనే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ ఓపిక, తీరిక లేకపోతే మీరు తప్పుగా ప్రవర్తించి నట్లనిపిస్తుంది. కాబట్టి వచ్చే విషయం ముందే అడిగి తెలుసుకోండి. మీకు చెప్పకపోతే, మీకు ఇక ఏ బాధ్యత లేదని అర్థం చేసుకోండి. అదే విషయం అర్థమయ్యేలా మర్యాదపూర్వకంగా చెప్పండి.
మీ ఆహార వ్యవహారాల్లో మరొకరి ప్రభావం లేకుండా చూడండి. ఆడవారు పెళ్లయ్యాక భర్తను, భర్త తరఫు వారిని సంతోషపెట్టాలని తాపత్రయ పడతారు. చుట్టూ ఉన్న అందరు కూడా అదే సరైన విషయం అన్నట్టుగా వ్యవహరిస్తారు. కానీ పాతికేళ్ళు ఇంకో ఇంట్లో వేరే రకమైన తిండి తినే మనిషి ఇక్కడికి రాగానే ఎందుకు రాజీపడాలో అర్థంచేసుకోండి. ఒకవేళ అలవాటు పడాలి అనుకుంటే అది తప్పనిసరి అని కాక ఇష్టపూర్వకంగా మాత్రమే జరగాలని గుర్తుంచుకోండి.
మీ పుట్టింటి వారిని, స్నేహాలను వదిలేయ వలసిన అవసరం లేదు. మీకోసం మీరు సమయాన్ని ఎప్పుడూ ఉంచుకోండి. అది కబ్జా చేయాలనీ చాలా ప్రయత్నాలు జరుగుతాయి. గట్టిగా నిలబడండి. ఈ వ్యవస్థలో పెళ్లి తరవాత మీ ఎదుగుదలను ఆపే ప్రయత్నాలు చాలా జరుగుతాయి. అస్సలు అస్సలంటే అస్సలు వాటిని ఒప్పుకోకండి. ఉద్యోగం, చదువు, ప్రయాణాలు, పరిచయాలు, సంభాషణలు, హాబీలు-ఏవి వదలకండి. అది మీ జన్మ హక్కు. నాకు తెలుసు ఇవన్నీ కడుపు నిండిన వారు జీవితాలకే చెల్లుతుందని. పర్లేదు, ఈ సారి పోస్ట్ కొందరు ఆడవారికే పరిమితం. ఇంకా ఎందరో కోకోల్లలుగా ఈ విషయం ఆలోచించదానికి కూడా అవకాశంలేని వారున్నారు.
పైన నేను చెప్పినవన్నీ కాపురాన్ని చెడగొట్టు కునే పద్ధతులుగా చాలా మందికి అనిపించ వచ్చు. కానీ మగవారికి ఇవన్నీ ఎంత సులభం గా అడగకుండానే దొరుకుతాయో ఆలోచిం చండి! Assవతీtఱశీఅ అనేది సాధన ద్వారానే వస్తుంది. ‘నో’ చెప్పడం తప్పు కాదు. అది హింసను ఆపడానికి వాడే మొదటి పదం.

Share
This entry was posted in బోగన్ విల్లా. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.