“ఏంటి ఇంకా బాలాకుమారి అనుకుంటున్నావా!?”
“అమ్మమ్మ/ నానమ్మ అయ్యే వయసులో….!?”
ముసుళోల్లకి ఈ దసరా పండుగలేంటో!?”
తరచూ ఇలాంటి మాటలు, చూపులు చవిచూస్తున్నా
మరి నాకేంటి నేను అంత పెద్దదాన్ని అయ్యానని ఎప్పుడూ అనిపించదు!!
Age is just a number అంటుంది నా మనసు ఎల్లప్పుడూ!
“గలగల పారే సెలయేరు పడుచు పిల్లలా తుళ్ళి పడుతోంది
నిండుగా పారే నది గంభీరంగా ప్రౌఢ లా ఉంది”
ఏ వయసు స్త్రీ ఎలా ఉండాలో ఏ రాజ్యాంగంలో రాసారు??
గంగ వెల్లువ కమండలంలో ఇమడనట్టు
తుళ్ళిపడే నా మనసుని( నాలా మరెందరో!)
వయసు సంకెళ్ళు ఆపలేకున్నాయి.
శీతాకాలంలో కొండ ప్రాంతాలకి వెళ్ళాలని ఉంటుంది-
ఆ తెల్లటి, స్వచ్భమైన మంచులో కరిగి కలిసిపోవడానికి.
వర్షంలో తడుస్తూ షూట్ రోడ్లో తనతో బైక్ రైడ్ చెయ్యాలని ఉంటుంది- హోరుగా వీచే
ఆ చల్లగాలితో మమేకమవ్వడానికి.
చల్లటి వెన్నెల రాత్రి సముద్రం ఒడ్డున కూర్చోవాలని ఉంటుంది- ఎగిసే ఆ అలలతో కలిసి ఆడుకోవటానికి.
ఓ trekking trip, z long drive , ,
ఒక లాంచీ జర్నీ, ఒక beach view hotel stay
Photography, horse riding
ఇలా ఎన్నో ఎన్నెన్నో కోరికలు…!
ఈ ఆనందాలకి వయసుతో ఏంటి సంబంధం?
ఆస్వాదించి, అనుభూతించే హృదయం,
సహకరించే శరీర ఆరోగ్యం ఉంటే చాలదూ!!
Its my own choice, isnot it?
