దమ్మున్న సినిమా ‘దండోరా’ – పసునూరి రవీందర్

పరువు హత్యల మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మాత్రం అమ్మాయి తండ్రి కంటే, వారి కులం పెద్దమనుషుల పట్టింపులు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు డైరెక్టర్. “రాత్రి తాగితే పొద్దటి వరకు దిగిపోవడానికి ఇది కల్లు మత్తు కాదు, క్యాస్ట్ మత్తు” అంటాడు ఈ సినిమాలో ప్రతినాయకుడు.

భారతదేశ సామాజిక వాస్తవికతను ప్రతిబింబించిన సినిమా దండోరా. ఇలాంటి సినిమాలు తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ అరుదే. మత విద్వేషాలు రెచ్చగొట్టే కథాంశంతో, వేలకోట్లు సొమ్ము చేసుకునే సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. ఈ ట్రెండును కాదని సామాజిక బాధ్యతతో చక్కని సందేశాత్మక ఇతివృత్తాన్ని కళాత్మకంగా తెరకెక్కించాడు ఈ చిత్ర దర్శకుడు మురళీకాంత్ దేవసోత్. అదే దండోరా మÖవీ. ఇలాంటి కథ విని, ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు రవీంద్ర బెనర్జీ, అనీషలకు జేజేలు చెప్పాలి.
మొబైల్ నెట్వర్క్ అయినా అప్పుడప్పుడు మనల్ని వీడవచ్చు. కులం నెట్వర్క్ మాత్రం పుట్టుక దగ్గరి నుండి చావు దాకా వీడిపోదు. అలాంటి కులపిచ్చిని, పరువు హత్యల దుర్మార్గాన్ని సజీవంగా చూపించాడు దర్శకుడు. బతికున్నంత కాలం వెంటాడే కులం, స్మశానానికి చేరినా వదలదు. ఈ సమస్య దళితులకైతే మరింత తీవ్రం. దళితులకు ప్రత్యేక స్మశాన వాటికలు లేవు. ఉండవు. మరి అలాంటి దళితులు చనిపోయినప్పుడు తమ వీధుల మీదుగా, తమ పొలాల నుండి తీసుకుపోకూడదనే కాదు, తమ స్మశానాల్లో పెట్టకూడదనే అగ్రకుల ఆంక్షలు ఇప్పటికీ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఇప్పటికీ దళితుల శవాలను ఖననం చేసే వీలులేక, వాగులో వదిలేసే దురాచారం సజీవంగా ఉంది. నిజానికి ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదు. ఇలాంటి దుర్మార్గాన్ని ఇతివృత్తంగా తీసుకుని, చావు చుట్టూ ఈ దర్శకుడు కథ అల్లుకున్నాడు.
కథకు తగ్గ స్క్రీన్ ప్లే, స్క్రీన్ ప్లేకు తగిన డైలాగ్‌లకు తోడు, క్యారెక్టర్లను సైతం చక్కగా ఒదిగించాడు. ప్రతీ నటుడు తమ తమ పాత్రలకు న్యాయం చేసేలా నటనలో జీవించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. మెదక్ జిల్లా తుళ్లూరులో కథను ఓపెన్ చేసి, కారంచేడు మృత వీరులకు నివాళులు అర్పించేదాకా సినిమాను నడిపించడం ఒక అద్భుతం. ఈ దేశంలో కింది కులాల విముక్తి చదువు, లేదా రాజ్యాధికారం ద్వారా మాత్రమే సాధ్యం అనేది ఈ సినిమాలోని డైలాగ్. ఇది దర్శకునికి కులవ్యవస్థ పట్ల, కులవ్యతిరేక పోరాటాల పట్ల ఉన్న లోతైన అవగాహనను తెలియజేస్తుంది. అందుకే ఇది యాంటి క్యాస్ట్ ఫిలాసఫికల్ అంబేద్కరైట్ మÖవీ!
పరువు హత్యల మీద ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మాత్రం అమ్మాయి తండ్రి కంటే, వారి కులం పెద్దమనుషుల పట్టింపులు ఎంత దారుణంగా ఉంటాయో చూపించాడు డైరెక్టర్. పైకులం అమ్మాయిని ప్రేమించినందుకు, అర్ధాంతరంగా నేల రాలుతున్న కింది కులాల యువకుల దైన్య స్థితిని చర్చకు పెట్టాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాటును కాదని, చక్కని సందేశంతో ఆకట్టుకునే కథనం, సమగ్రమైన నిర్మాణ విలువలతో నిర్మించిన చిత్రమిది. పూలే, అంబేద్కర్లు ప్రవచించిన కులనిర్మూలన ఉద్యమ స్ఫూర్తికి ఈ సినిమా ఒక నిదర్శనం. సినిమా క్లైమాక్స్‌లో కులాన్ని కాదనుకునే వారికి తమ ఎకరం జాగాను అంకితం చేయడం గొప్ప ముగింపు. “ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్లినా ఎదురొచ్చి నిలబడేది కులమే, దానిని ధ్వంసం చేయకుండా నువ్వు ఏమీ చేయలేవు” అన్న అంబేద్కర్ మాటలు గుర్తుకు వస్తాయి. కంగ్రాట్స్ టూ టీమ్ దండోరా!
(ఉత్తమ ద్వితీయ చిత్రంగా ‘దండోరా’… తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సందర్భంగా)
(సారంగ వెబ్ మ్యాగజైన్ సౌజన్యంతో….)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.