చాంగ్లేర్ అనే గ్రామంలో రాము అనే రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్క పేరు టామి. రాము ప్రతిరోజు ఆవులకు మేతవేయడం. పొలానికి పోయి పంటలను పండించడం చేసేవాడు.
ఆతని కుక్క టామి అతనితో పాటు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేదాకా రాముకి సహాయం చేసేది. టామి తనకు చేతనైన చిన్న చిన్న సహాయాలు చేసేది.
ఉదాహరణకు వేరే ఎవరినైనా పొలానికి రానిచ్చేది కాదు. ఇలా టామి రాముకు సహాయం చేసేది. ఒకరోజు రాము పగలు రాత్రి విశ్రాంతి లేకుండా పని చేసి నీరసంతో కింద పడిపోయాడు. అప్పుడు టామి రాముని చూసి చాలా కంగారుపడింది. భయంతో చాలా అరుస్తుంది. కానీ సహాయం చేసేందుకు అప్పుడు పొలంలో ఎవరూ ఉండరు.
టామి ఊర్లోకి వెళ్ళి ప్రతిఒక్కరిని సహాయం కోరుతుంది. కుక్క ఊరికే అరుస్తుంది అని దానిని రాళ్ళతో కొట్టి తరిమారు. అయినప్పటికీ టామి ఎంతో మందిని అందరినీ సహయం కోరుతుంది.
అప్పుడు రాము స్నేహితుడు బంటి ఇలా అనుకుంటాడు. ఈ కుక్క రాముది కదా. నా దగ్గరికి వచ్చి ఎందుకు అరుస్తుంది? రాముకి ఏదైనా అయి ఉంటుందేమో అనుకుంటూ టామి వెనుక వెళ్తాతు.
అప్పుడు టామి రాము దగ్గరకు బంటిని తీసుకొని వెళ్ళాడు. రాము క్రిందపడి ఉండటం చూసిన బంటి రాము చికిత్స కేంద్రానికి తీసుకొని వెళ్ళాడు.
డాక్టర్లు రాముని చూసి అతనికి వైద్యం చేసి ఆరోగ్యం బాగు చేసి కొన్ని మందులు ఇచ్చారు. రాము బంటిని చూసి నీవు ఇక్కడికి ఎలా వచ్చావు. నిన్ను ఎవరు పిలుచుకొని వచ్చారు అని అడిగాడు. అప్పుడు బంటి నన్ను నీ టామి తీసుకుని వచ్చింది అని చెప్పాడు.
అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నీ టామి చాలా తెలివైనది. విశ్వాసమైనదిరా అని బంటి రాముతో అంటాడు. అప్పుడు రాము టామి వైపు చూసి దానిని అప్యాయంగా హత్తుకుంటాడు. అప్పటి నుంచి రాము మరిము టామి మరింత సంతోషంగా జీవించారు.
-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
