చిన్నారి తల్లి – షేక్ కాశింబి

రామయ్య ఒక రైతు. జానకమ్మ అతని భార్య. వాళ్లకి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి. రామయ్యకి కొడుకులంటే వల్లమాలిన ప్రేమ. వారిని తలచుకుని మురిసిపోతూ ఎన్నో కలలు కనేవాడు.

కూతురు పరాయింటి ధనమనేది అతని తిరుగులేని నమ్మకం. ఎవరో ఒక అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరిపోతుందనుకునేవాడు. పాతతరం ఆలోచనలు ఉన్నా అతనికి తెలిసిందంతే.
రామయ్యకి ఏడెకరాల పొలం ఉంది. ఎంతో కష్టించి పని చేసేవాడు. ఇతరుల కన్నా ఎక్కువ పండించి లోలోన గర్వపడేవాడు. జానకమ్మ అతనికి తగిన భార్య. ప్రతి పనిలో చేయందిస్తూ భర్త వెన్నంటి ఉండేది. మగపిల్లల్ని ఎంత ప్రేమించేదో… అంతకు పదింతలు ఆడపిల్లను ముద్దు చేసేది. నిజానికి ఆడపిల్ల కోసమే ఆమె ముగ్గురు మగపిల్లలకి జన్మనిచ్చింది. పిల్లని కూడా బాగా చదివించాలని ఆశపడేది. సిదు,్ద గోపి, రమణలు మగ పిల్లలు. లక్ష్మి ఆడపిల్ల. లక్ష్మీ గురించిన భర్త ఆలోచనలు గ్రహించిన ఆమె అభిప్రాయం మార్చుకోమని పోరేది. అలాంటప్పుడు రామయ్య నవ్వుతూ, “వెర్రిదానా! నేను ముగ్గురు మగపిల్లల తండ్రిని. నా సేవకి ముగ్గురు కోడళ్ళు హాజరవుతారు. లక్ష్మీదేముంది? పెళ్లవగానే అత్తవారింటికి వెళ్తుంది. ఏ పండక్కో, పబ్బానికో వస్తుంది. ఆడపిల్లని నెత్తికెక్కించుకోకూడదు గుర్తుంచుకో! అని విసుక్కునేవాడు.
అతను ఎప్పుడు కూతురిని కొడుకుల్లాగా దగ్గరికి తీసేవాడు కాదు. వొల్లో కూర్చుని కబుర్లు చెప్పేవాడు కాదు. లక్ష్మీ నవ్వు ముఖంలో ఉండేది. వినయ విధేయతలు ఆమె సొంతం. చిన్న వయసులోనే తండ్రికి ఆడపిల్లలు ఎక్కువగా నవ్వడం, ఆడడం, గట్టిగా మాట్లాడడం, బయట తిరగడం నచ్చదని అర్థం చేసుకుంది. వంట పనిలో అమ్మకి, ఇంటి పనిలో నాన్న, అన్నలకి సహాయపడడమే కాక, తాను శ్రద్ధగా చదువుకొని, మంచి మార్కులు తెచ్చుకునేది. అయినా రామయ్య ఆమెని పొరపాటున కూడా మెచ్చుకునేవాడు కాదు.
జానకమ్మ క్రమక్రమంగా బలహీన పడసాగింది. మధ్య మధ్యలో ఆసుపత్రి కెళ్ళి మందులు తెచ్చుకొని వాడేది. రామయ్య ఈ జబ్బు కూడా లక్ష్మి కారణంగా వచ్చిందనే భావించేవాడు. ఎందుకంటే ఆమె లక్ష్మీ పురిటి సమయంలోనే మొదటిసారి తీవ్రంగా అనారోగ్యం పాలైంది. పిల్ల పెద్దయ్యే కొద్దీ జబ్బు కూడా పెరుగుతూ వచ్చింది. ఈ పిల్లే పుట్టకుంటే భార్య జబ్బు పడేది కాదని అతని భావన. దీంతో లక్ష్మీ పట్ల మరింత కోపం వచ్చేది. ఆయనకి పిల్ల ముందే ఈ విషయం ప్రస్తావిస్తూ విసుక్కునేవాడు. పాపం! చిన్నారి లక్ష్మి కళ్లనీళ్ళతో లోపలికి వెళ్ళిపోయేది. నిజానికి వెంటవెంటనే కాన్పులతోనూ స్వీయ సంరక్షణ లేకపోవడంతోనే పిల్లల పెంపకంలో విశ్రాంతి లేకపోవడంలోను ఆమె 48 ఏళ్లు దాటేసరికి వృద్ధాప్య ఛాయాల్లోకి అడుగు పెట్టింది. ముసలి అత్త మగ పిల్లల్ని వంటింటి వైపే రాణించేది కాదు. భోజనానికి తప్ప. ఆడవాళ్లే వంట పనులు చేస్తారనుకునే వాళ్ళు. లక్ష్మీ పుట్టిన ఆరేళ్లకే అత్త కాలం చేసింది.
అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో జానకమ్మ ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే తుది శ్వాస విడిచింది. పిల్లలు నిరుత్తరులయ్యారు. రామయ్యకి భవిష్యత్తు అంధకారమయిందపించింది. మగ పిల్లలు కాలేజీల్లోనూ లక్ష్మీ 9వ తరగతిలో చదువుతున్నారు. పిల్లల గురించిన బెంగ రామయ్యకి ఉక్కిరి బిక్కిరి చెయ్యసాగింది. ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. వెళ్లే ముందు మళ్ళీ పెళ్లి చేసుకోమని రామయ్యకి సలహా ఇచ్చి సెలవు తీసుకున్నారు. అయితే రామయ్య¿Šది ఏమాత్రం రుచించలేదు.
జానకమ్మ లేని ఇల్లు శూన్యంగా అనిపించింది రామయ్యకి. కళ్ళ నీళ్లు పెట్టుకుంటూనే పొలం వైపు వెళ్ళాడు. ఇంటి దైన్యాన్ని భరించే శక్తి లేక అక్కడ పని మీద దృష్టి పెట్టలేకపోయాడు, “జానకమ్మ ఉండుంటే…’ తనలో తనే గొణుకున్నాడు. కళ్ళు చలమలయ్యాయి. దుఃఖంతో శరీరం కంపించింది. ఇంటి అస్తవ్యస్త పరిస్థితులు, పిల్లల బిక్క మొఖాలు గుర్తుకి రాగానే బేలతనం కమ్ముకుంది. అప్పటికే ఎండెక్కింది. కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా ఇంటిదారి పట్టాడు. ఏం చూడాల్సి వస్తుందోనని భయపడుతూనే. అయితే ముంగిట్లో కాలు పెట్టినా అతను ఆశ్చర్యపోయాడు. జానకమ్మ ఉన్నప్పుడు ఎంత శుభ్రంగా అందంగా ఉండేదో అచ్చం అలాగే ఉంది ముంగిలి. మగపిల్లల జాడలేదు.
ఇంట్లో అడుగుపెట్టగానే పుస్తకాల ముందు కూర్చుని చదువుకుంటున్న లక్ష్మి కనిపించింది. పుస్తకాలు మÖసేసి, గబుక్కున లేచి “నాన్న! రండి! ఇలా కూర్చోండి! అన్నం వడ్డిస్తా!” అంది పీట వాలుస్తూ. రామయ్య అవాక్కయ్యాడు. అతని గుండె చప్పుడు పెరిగింది. తన చిన్నారి కూతురు ఇంటి పనితో పాటు వంట కూడా చేసిందా అనుకున్నాడు. అతని ఊహకందని విషయం ఇది. చిన్న బోయిన మనసుతో కూతురి వంక చూశాడు. మాటలు పెగలడం లేదు. లక్ష్మీ అప్పటికే లోపల నుంచి వేడివేడి అన్నం పప్పు వడ్డించిన పళ్ళెం తెచ్చి తండ్రి ముందు ఉంచింది. పులుసు, పెరుగు వేరువేరు గిన్నెల్లో నింపి తెచ్చింది. వణుకుతున్న చేతుల్ని కూతురి తలపై పెట్టి ఆమెని దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి కళ్ళల్లో ఉబికిన నీరు చూసి ఆయన భావోద్వేగాలను కనిపెట్టిన లక్ష్మీ ఇలా అంది. “దిగులు పడకండి నాన్నా! నేను ఇవాల్టి నుంచి స్కూల్‌కి వెళ్ళను. ఇంటి పని చూసుకుంటాను. అన్నయ్య వాళ్ళ పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. వాళ్ల చదువుకి ఇబ్బంది లేకుండా ముగ్గురిని కాలేజీకి వెళ్ళమన్నాను. మీరు కూడా ఆటంకం లేకుండా పొలం పనులు చూసుకోండి. కుమార్తె పరిణిత మనసు ముందు మరుగుజ్జు అయ్యాడు రామయ్య.
రుద్దమవుతున్న కంఠ స్వరంతో ‘తల్లీ! నన్ను మన్నించు! ఇప్పటిదాకా నిన్ను చాలా చిన్న బుచ్చాను. ఏనాడు దగ్గరికి తీయలేదు. అవును… వంట పని ఎప్పుడు నేర్చుకున్నావమ్మా!” అమ్మ తండ్రి వాత్సల్యానికి లక్ష్మి మనసు తరళమయ్యింది. “నాన్నా! అమ్మ వెనకాలే ఉండి అన్నీ నేర్చుకున్నాను. మిమ్మల్ని, అందరిని నేను చూసుకుంటాను, మీరు నిశ్చింతగా ఉండండి. రామయ్యకి మాటలు కొండంత ఊరటనిచ్చాయి. లేదమ్మా నువ్వు కూడా చదువుకో. వంటకి నేను ఏదో ఏర్పాటు చేస్తా అన్నాడు. వెంటనే లక్ష్మి “నేను చదువుకుంటా నాన్నా! పనంతా అయిపోయాక మిగిలిన టైంలో నేను ఇంట్లోనే సొంతంగా చదువుకుంటాను. మా సైన్స్, లెక్కల టీచర్లు అర్థం అవ్వని విషయాలు చెప్పడానికి ఒప్పుకున్నారు. నేను వచ్చే సంవత్సరం ప్రైవేట్‌గా పదవ తరగతి పరీక్ష రాస్తాను. నేను చదివి ఉద్యోగం చేయాలని అమ్మ కోరిక తీరుస్తాను అంది స్థిరంగా.
లక్ష్మీ చేసుకున్న ఈ ప్రణాళికకు ముగ్దుడయ్యాడు రామయ్య. ఈ మాటలతో అతని మనస్సు స్థిమిత పడింది. సంతోషంగా అనిపించింది. గుండె బరువు తగ్గింది. తనలో తాను కూతురు ఇంటికి “చిన్నారి తల్లి” అవుతుంది. ఇంట్లోని ఎన్నో సమస్యలకు సమాధానం అవుతుంది అనుకున్నాడు. కుమార్తెలు అతనికి కాలం చేసిన తల్లి కనిపించింది. ఆమెకేసి మురిపంగా చూస్తూ… అంతులేని త్రుప్తిని పొందాడు. అతని సమస్యలన్నిటికీ ఉపశమనం అయింది. ఆ 14ఏళ్ళ అమ్మాయి. అప్పటి నుంచి కొడుకుల కన్నా ఆమెకి ప్రాధాన్యత నివ్వసాగాడు. ఇల్లు చక్కబెట్టుకుంటూనే లక్ష్మీ పదవ తరగతి పూర్తి చేసి కాలేజీలో చేరింది. పెద్దవాడైన సిద్దు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడంతో అందరూ సంతోషించారు. లక్ష్మీ కుటుంబానికి మూల బిందువుగా కొనసాగుతూనే తన లక్ష్యాన్ని చేరుకుంది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.