ఈదుటపల్లి గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆతడికి నలుగురు కొడుకులు ఉండేవారు. పెద్దవాడు సునీల్, రెండోవాడు అనిల్, మÖడోవాడు సుదీర్, నాలుగోవాడు బాలు. కాలక్రమంలో అందరూ పెద్దవాళ్లయినారు. రామయ్యకు వృద్ధాప్యం సమీపించింది. అతనికి తన కొడుకుల గురించి ఒక్కటే దిగులు పట్టుకుంది.
ఎందుకంటే వాళ్లు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతుండేవారు. తను మరణించాక వాళ్లందర్నీ కలిసి ఉండేలా చేయడం ఎలాగన్న దిగులు రామయ్యకు పట్టుకుంది. ఆలోచించగా, రామయ్యకు ఒక ఉపాయం తట్టింది. ఒకరోజు తన నలుగురు కొడుకుల్ని తన దగ్గరకు పిలిచాడు. అందరికీ ఒక్కొక చిన్న పెట్టే ఇచ్చాడు. తను మరణించిన తర్వాత ఆ పెట్టె తెల్చి చూడమని కొడుకులు అందరికీ చెప్పాడు. కొన్నాళ్ళకు రామయ్య మరణించాడు. నలుగురు కొడుకులు తమకి ఇవ్వబడ్డ పెట్టెలు తెరిచి చూశారు. పెద్దవానికి బంగారం వచ్చింది. రెండో వానికి పశువుల పేడ వచ్చింది. మూడవ వానికి ఇటుక వచ్చింది. నాలుగో వానికి మట్టి వచ్చింది. వారికి తమ తండ్రి తమ అలా ఇవ్వడంలో మరణం ఏమిటి అని ఎంత ఆలోచించి అర్థం కాలేదు. అప్పుడు ఆ నలుగురు గ్రామ పెద్దది దగ్గరకు వెళ్లారు.
ఆ గ్రామపంచాయతీ ఇలా చెప్పాడు. పెద్దవాడికి మొత్తం బంగారం చెందుతుందన్నాడు. రెండోవానికి మొత్తం పశుసంపద చెందుతుంది అన్నాడు. మూడో వానికి ఇల్లు స్వంతం అవుతుందన్నాడు. నాలుగో వానికి పొలం చెందుతుంది అన్నాడు. వారు సరేనన్నారు కానీ వారికి ఇలా ఉండడం చాలా ఇబ్బందిగా తోచింది. పెద్దవాని బంగారంతో ఇల్లు కట్టలేడు. రెండో వాణి పశువులను ఎక్కడ ఉంచాలో అర్థం కాలేదు. మూడో వాని ఇల్లు తప్ప మరేమీ లేదు. నాలుగో వానికి పొలం తప్పించే మరేమీ లేదు. అందువల్ల వారందరూ కలిసి ఆలోచించుకొని ఒక నిర్ణయాన్ని కొచ్చారు. నలుగురు కలిసి ఒకే ఇంట్లో ఉండి అందరికీ వచ్చినవి అందరూ అనుభవించాలని, అనంతరం నలుగురు ఒకే ఇంట్లో కలిసిమెలిసి సంతోషంగా జీవించారు, అలా రామయ్య కన్న కళలు నిజమయ్యాయి.
