కాకినాడ, కరీంనగర్
గుడివాడ, విజయవాడ…
ఊరేదైనా వాడేదైనా
ఇంటి సేవా రూపం ఒకటే!!ఏ పనికీ ”నో” చెప్పని
సింగిల్ విండో కౌంటర్ ఆమె,
ఎంత చేసినా ఎన్ని చేసినా
ఇంకా ఏదో చేయలేదని…
తనకి తాను పెట్టుకున్న ”టార్గెట్స్”
చేరుకోలేని పనిమని”షీ” ఆమె!!
పగలంతా ఆఫీసులో పని
కత్తి మీద సాము అయినా
బ్యాగుతో పాటు నీరసాన్నీ
అల్మరాలో దాచేసి…
కొంత చిరునవ్వునీ
మరి కొంత ఓపికనీ అద్దుకునే
డైనమిక్ విధేయురాలామె!!
దేనికైనా రాజీ పడాలి,
స్ధిత ప్రజ్ఞతను ప్రదర్శించాలి..