మనస్సు కాగితం పైన ప్రేమ పేరు రాసుకొన్న
నీటి అలలపైన దాని రూపాన్ని చూసుకొన్న
ఎన్ని మజిలీలు దాటినా ప్రేమ కోసం
దారినంతా తడుముతూనే వచ్చా.
ఎన్ని కలల అలల చప్పుళ్ళు…
నిదురలేని రాత్రుళ్ళో వింటూ గడిపానో
స్పందించలేని క్షణాల్ని చూస్తూ నడిచానో
కాకి… ఇప్పుడు…
నేను మరిచిపోయిన…
నన్ను నేను వెతుక్కుంటూవున్నా
నన్ను నేను చూసుకొంటూ వున్నా.
నన్ను నేను ప్రేమించుకొంటూ వున్నా.
నన్ను నేను ఓదార్చుకొంటూ వున్నా.
నన్ను నేను ఆవిష్కరించుకొంటూ వున్నా.
నన్ను నేను సృష్టించుకొంటూ వున్నా.
నా కోసం నేను నవ్వుతున్నా
నేను బావున్నా.