సుబ్బారావు: అప్పారావు! నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి మర్చిపోయావా
అప్పారావు: లేదు. ఇంకా చాలా టైం పడుతుంది.
సుబ్బారావు : దేనికి?
అప్పారావు : మర్చిపోవడానికి.
***
సోమయ్య : ఇక్కడ చేత్త వేస్తే పోలిసులు పట్టుకుపోతారు.
వెంగళప్ప: పోతే పోని చెత్తేగా!
***
రామారావు: ఎందుకయ్యా ఏడుస్తున్నావు?
కృష్ణారావు : రక్త పరీక్ష అని చెప్పి వేలు తీసేశారు.
(కృష్ణారావు : చెప్పిందివిని రామారావు వణక సాగాడు.)
కృష్ణారావు: ఎందుకలా వణుకుతున్నావు?
రామారావు: నాకిప్పుడు మూత్రపరీక్ష ఉందయ్యా బాబు.
***
సోము : ఇప్పుడే అన్నం తిని అలా పైకి కిందికి ఎగురుతావెందుకు?
రాము : అన్నం తిన్నాక ఒక మందు తాగాను.
సోము : అయితే ఎగరటం దేనికి?
***
రాము : మందు తాగేటప్పుడు బాటిల్‌ను షేక్ చేయటం మర్చిపోయాను.
బయాలజీ టీచర్ పాఠం చెబుతూ ఒక స్టూడెంట్‌ని ఉభయ చరాలకు ఒక ఉదాహరణ చెప్పుమని అడుగుతాడు.
స్టూడెంట్: సార్ ఒక కప్ప.
టీచర్ : ఇంకోకరిని లేపి ఇంకో ఉదాహరణ చప్పమంటాడు.
స్టూడెంట్: సార్ ఇంకోకప్ప.
***
వేగంగా పరిగెత్తుతున్న ఒక చీమను మరోక చీమ ఇలా పలకరించింది. ఏమిటి హడావిడిగా వెళుతున్నావు?
రెండో చీమ: యాక్సిడెంట్‌లో ఏనుగు గాయపడిందట రక్తదానం చేయడానికి వెళుతున్నాను.
***
మేనేజరు: ఎందుకమ్మ ఈ రోజు ఆఫీస్‌కు ఇంత లేటుగా వచ్చావు
అమ్మాయి: బస్టాండ్ నుంచి ఆఫీస్ వరకు వారిలో ఒక వెధవ నా వెంటపడ్డాడు.
మేనేజర్: అతనితో నీకేంటి ప్రాబ్లమ్ నీవు వేగంగా రావచ్చుగా
అమ్మాయి: మరేమో….! అతడు మరీ మెల్లగా నడుస్తున్నాడు.
***