వారణాసి నాగలక్ష్మి
‘ప్రభంజనం’ చిన్నబోయింది…
ప్రవాహం ఆగిపోయింది భార్గవి అస్తమయంతో.
అయోమయమైన ఆకాశం
తొలకరించడం మానేసింది
ఆ నవ్వులిక పూయవని తెలిసి
పువ్వులు మొగ్గలై ముడుచుకున్నాయి
ఆ నడకలిక సాగవని తెలిసి
‘ప్రణవగంగ’ ఆమె నెత్తుకుని కదిలిపోయింది
అగ్నికీలల్లో రూపాన్ని వదిలేసి
ఆ సుందరాత్మ పైకెగసింది
ఇంకెన్నో మిత్ర సమూహాలపై స్నేహ వర్షమై కురిసిపోవాలని
మరెన్నో అక్షరాలుగా మళ్ళీ మొలకెత్తాలని!
(ప్రభంజనరావుగారికి సహానుభూతితో)