యస్.వివేకానంద
అమ్మంటే రెండు అక్షరాలే!
అయినా దాగిన మాతృత్వం
ఆకట్టుకునే వాత్సల్యం…
అగుపించని త్యాగం
కొట్టవచ్చేటట్టువుపించే ఔదార్యం!
అమ్మంటే టోటల్‌గా
ఒక పవిత్ర దేవాలయం!
అమ్మంటే విద్యాలయం!
అమ్మంటే… ఓర్పు!నేర్పు!
అమ్మంటే ఆలంబన!
అమ్మంటే అనురాగం
అమ్మంటే ఔన్నత్యం
అమ్మే సృష్టికి మూలం!
అమ్మే జాగతికి వెలుగు!
అమ్మంటే .. ఆలన!పాలన!
అమ్మలేని జగమే శూన్యం!
ఎన్ని జన్మలెత్తినా
తీర్చుకోలేనిది అమ్మ ఋణం!
కన్నతల్లిని గౌరవిస్తే
ఈ సృష్టిలో సకల
చరాచరాలను గౌరవించినట్టే!
ప్రాణాధికంగా మాతృత్వాన్ని
గౌరవించు! తరించు!!
మీరు అమ్మ పైన రాసిన కవిత చాల బాగుఉంది.
మీరు అమ్మ పైన రాసిన కవిత చాల బాగుఉంది.