ఏమైందీ ఈ ప్రపంచానీకీ
కన్నీటి మడుగులో ఓ యువతి మనసు,
స్పందన లేని హృదయాలు,
దయ లేని బుద్ధి హీనులు.
ఆడపిల్లే అంత అలుసా?
గురు మాటే వేదమా?
కన్నీటీకి కూడ కరగని చిత్తాలు, మానవ మృగాలు
ఇంత సాహసం చేసాయి.
ఇదా మన సభ్య సమాజం?
లేత హృదయానికి గాయం చేసిన
ఆ మూర్ఖులు, జీవించేందుకు
అర్హులు కారు, కాకూడదు.
ప్రపంచ జ్ఞానం లేని ఆ కళ్ళకు,
నవ్వే లోకమని భావించిన మనసు,
ఆశించిన న్యాయాన్ని ఇవ్వాలి!
కూతురు లేని లోకాన్ని చూడలేకపోతున్న,
తల్లితండ్రులని
తొక్కేస్తున్న పశువులను శిక్షిద్దాం!
బరువెక్కిన గుండెలతో
నింగికేగిన ఆ యువతి
ఆత్మకు శాంతి కల్పిద్దాం!
Do not support Ragging!