బాలలారా! బాలికలారా!
విద్యాబుద్ధులు నేర్పినా!
పాఠశాల సిబ్బంది బృందమా!
హైస్కూల్ విద్య నభ్యసించి
కళాశాల విద్యా నేర్వడానికి
కళాశాలలోకి అడుగిడే విద్యార్థులారా!
మీ జీవిత జీవన భవిత మహోత్సవం
ఆనందోత్సవానికి ఇది తొలిమెట్టు
మీరు కోరుకున్న విధంబుగా
ఎంచుకొన్న చదువును చక్కగా పూర్తిచేసి
మీ జీవిత నవలోకానికి
మీ తల్లిదండ్రుల దీవెనలతో
పై చదువులు చక్కబెట్టి
జీవిత గమ్యమును చేరుకొని
సుఖ సంతోషాలతో కలకాలం గడపాలని
శ్రీ లక్ష్మి సరస్వతి మాతలనే వేడుచున్నా
నోట్ : స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా రాసినటువంటి కవిత.