స్నేహబంధం
అరవిందా స్కూల్ పిల్లలు స్నేహితుల రోజు సందర్భంగా స్నేహం యొక్క విలువను, స్నేహబంధం యొక్క ప్రాముఖ్యతను, తెలియజేస్తూ వ్రాసిన కవితలు.
నిత్యంగా వుండే స్నేహం
గౌరవం ఇచ్చే చిన్ననాటి స్నేహం
సుఖంగా ఉండే బంధం స్నేహం
అందంగా వుండే అనుబంధం స్నేహం
సంగీతంలో వున్న రాగంలాంటి స్నేహం
ఏ సమస్య వచ్చినా అభయంగా ఎదుర్కొనేది స్నేహం
చిరకాలం వుండే బంధం స్నేహం
స్వర్గంలో వున్న ఆనందంగా ఉండేదే స్నేహం
స్నేహం
– ఐశ్వర్య, 5వ తరగతి.
చుక్కలు ఆకాశంలో వుంటాయి
చేపలు నీటిలో వుంటాయి
పక్షులు చెట్లమీద వుంటాయి
బల్లులు గోడమీద వుంటాయి
పాములు పుట్టలో వుంటాయి
కాని స్నేహితులు గుండెల్లో వుంటారు
హ్యాపీ ఫ్రెండ్షిప్ డే