భూమిక ప్రతి సంవత్సరం కథ, కవిత, వ్యాసరచనల పోటీని నిర్వహిస్తున్న విషయం మీకు తెలుసు. కథ, కవితకు సంబంధించిన అంశం ఎంపిక రచయితల అభీష్టానికే వదిలేస్తున్నాం. రచనలు తప్పనిసరిగా స్త్రీల అంశాలమీదే వుండాలి.
* రచనలు సరళంగా, సూటిగా వుండాలి.
* పేపర్‌కు ఒకవైపు మాత్రమే స్పష్టంగా రాయాలి. డి.టి.పి. చేయించి పంపితే మరీ మంచిది.
* కవరు మీద కథ, వ్యాసం, కవితల పోటీ కోసమని రాయాలి.
* పోటీకి పంపిన రచనలు ఎట్టి పరిస్థితిలోను తిరిగి పంపబడవు కాబట్టి కాపీలను మీ వద్ద ఉంచుకోగలరు.
* న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
* కథల విభాగంలో రెండు, వ్యాసం విభాగంలో రెండు, కవితల విభాగంలో రెండు బహుమతులుంటాయి.
* బహుమతి గెల్చుకున్న రచనలతో పాటు, ఎంపిక చేయబడిన వాటిని వీలు వెంబడి భూమికలో ప్రచురిస్తాం.
* కథ నిడివి అచ్చులో (ఎ4సైజ్) ఆరు పేజీలు, వ్యాసం అచ్చులో (ఎ4సైజ్) పది పేజీలుండాలి.
* ‘మనదేశంలో స్త్రీలపై కుటుంబ హింస పెరగడానికి కారణాలు – నివారణ మార్గాలు.’ అనే అంశంపై వ్యాసం రాయాలి.
ఈ పోటీలో అందరూ పాల్గొనవచ్చు.
రచనలు భూమిక కార్యాలయానికి అందవలసిన చివరి తేది: డిసెంబర్ 31, 2016
రచనలు పంపవలసిన చిరునామా :
స్త్రీవాద పత్రిక భూమిక
హెచ్ఐజి-2, బ్లాక్-8, ఫ్లాట్-1, బాగ్‌లింగంపల్లి, వాటర్‌టాంక్ వెనుక, హైద్రాబాద్ – 500 044.
ఫోన్ నెం. 040-2766 0173, ఫ్యాక్స్ 040-2760 5316
Email: bhumikahyd@gmail.com / bhumikahyd@yahoo.com