నా చేసంచీలో ఎప్పుడూ ఉంటాయి
విత్తనాలు
ప్రేమ విత్తనాలు..
ఎక్కడికెళ్ళినా కొన్ని విత్తులు చల్లేసి వస్తానా
మళ్ళీ వెళ్ళినప్పుడు చూద్దును కదా
అక్కడంతా అంకురించిన ప్రేమ మొలకలు
పచ్చటి ఆకులు… రంగు రంగుల పువ్వులు
ఇంకోసారి వెళ్ళినపుడు చూస్తే
ఆశ్చర్యంగా ఆ పువ్వులోంచి మళ్ళీ
ప్రేమవిత్తులు