నువ్వొక ఉత్ప్రేరకానివి
అలవాటు పడ్డవాళ్ళదే కానీ నీ తప్పేమీ లేదంటూ…
నీ పనే మత్తు చల్లడం కదా…
ఆత్రంగా అంగాలను వెదుక్కునే నువ్వు
ఏనాడైనా ఎవరినైనా ఆత్మీయంగా
ఆలింగనం చేసుకున్నావా…
ప్రతి ఆలిలో ఆడతనం వెదుక్కునే నువ్వు
అమ్మలోనైనా అమ్మతనం చూశావా…
మగతనమంటే నీ పటుత్వం కాదు…
కట్టుజారిపోకుండా బంధాలను పట్టివుంచడం
ఏనాడైతే ఈ నిజం తెలుసుకుంటావో
మా స్త్రీ జాతి తరపున నీరాజనాలు…
ఎన్నటికీ మారనంటావా
నిన్ను కన్న కడుపుకి అభినందనలు…
నేనెప్పటికీ ఇంతేనంటావా
నిన్ను కట్టుకున్న అభినేత్రికి శతకోటి వందనాలు