భూమిక పత్రికా సంపాదకులకు,
”మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం” చాలా బాగుంది. మీ అనుభవాన్ని గుదిగుచ్చి రాసిన సంపాదకీయం బాగుంది. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. మీకు తోడుగా నిలుస్తున్న మహిళామణులందరికీ శుభాభినందనలు.
అనుభూతుల్ని పంచుతూ… అభ్యుదయవాదంతో అడుగులు వేస్తున్న ప్రశాంతి గారికి అభినందనలు. భూమిక ద్వారా మహిళల్లో చైతన్యం తేవడమే కాదు… ధీరవనితలుగా తీర్చిదిద్దడంలో మీ వంతు ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆశిస్తాను. భూమిక మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తాను. అభినందనలు.
– రాజా రామ్మోహన్రావ్, ఇ-మెయిల్