భూమిక సంపాదకులకు,
25వసంతాల పండగ సంబరాలతో మెరిసిపోతూ వచ్చిన భూమికలో ఎన్ని అందాలో! సంబరంగా ఒక్కొక్కటి చూస్తున్న నన్ను ఒకదాన్ని మించి ఒకటిగా సాహిత్య పరిమళాలు మరో లోకంలోకి తీసుకెళ్ళాయి. సంపాదయకీయం, ప్రతిస్పందన, ఇంటర్వూలు, వ్యాసాలు, కవిత్వం, సమాచారం… ఓహ్! ఎన్ని మెరుపులో. కథలైతే నన్ను మరీ కదిలించాయి. నాలో ఎన్నో భావతరంగాలు…
అలవోకగా చూస్తేనే ఇంతలా మరిపించిన భూమికని నిశితంగా చూస్తే ఇంకెంత ఆనందమో… ఇంత అంద్భుతంగా మలచిన సత్యకి, ప్రశాంతికి, భూమిక టీంకి, రచయితలకి హృదయపూర్వక అభినందనలు.
– అనురాధ, విశాఖపట్నం