వర్షం కురిసెను, చిలిపి భావాలు మురిసెను.
వర్షం నీటి బిందువుల కలయిక,
మన ఆనందం, ఆరాటం మొదలిక!
వర్షం తో మొదలయ్యేను ఎన్నో పండగలు,
తీరెను అందరి లోటులు!
వర్షం ఒక ప్రకృతి హర్షం,
కలిగెను రైతు కంట సంతోషం!
వర్షంతో కలిగెను కమ్మటి మట్టి సువాసన,
జల్లుతో తడిసెను పచ్చని పొలాలు!
వర్షంతో ఆడెను నెమలి నృత్యం,
ఎంతో కనువిందు చేసెను దాని పురి విప్పడం!
వర్షం మనలోని స్పర్శను తాకేనుగా!
దానితో మన మది మురిసేనుగా!
– షేక్. నుస్రత్, 9వ తరగతి