మహమ్మారి – భూక్యా గోపిరాజ

ఈ మహమ్మారిని

తరిమేయాలనే ఆవేశం

అందరిలోనూ ఉంది కానీ

ఆచరణ కొరతయింది!

లోకాన్ని దాని విషకోరలతో

అడుగులు వేసుకుంటూ

కాటేస్తూ వస్తోంది

వలసకూలీల పాలిట

మత్యువై విభంజిస్తుంది!

పేదోళ్ల ఆకలిని

చుట్టుగుడిసెల్లోనే చంపేస్తుంది

నిన్నటి వరకు నవ్వుకుంటూ

తిరిగిన ప్రాణాన్నే..

కబళించి కాటికి పంపుతుంది!

కనిపించని గాలిలో

వికటాట్టహాసాలను వినిపిస్తూ

లోతైన గుండెల్లో నుంచి

కన్నీటి శోకాలను బయటికి

వంపుతుంది

ఈ మహమ్మారికి విరుగుడు

వెతికేంత వరకు

ఇంకెన్ని మరణాలో!

పరిశుభ్రతను పాటించడమే

ఈ మానవాళికి ఇక పునర్జన్మ

ప్రభుత్వమూ, వైద్యులు చెప్పినట్టుగా

ప్రవర్తించడమే పౌరులుగా

మనం చేయాల్సిన పని!!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.