భూమిక సంపాదకులకు,
భూమిక ఫిబ్రవరి సంచిక ఇప్పుడే చూశాను. సంపాదకీయంలో ఆడపిల్లల పెళ్ళి వయసు పెంచే ప్రతిపాదన గురించి చదివాను. పోయిన వారం ఈ వార్త పేపర్‌లో చూసినప్పుడే అనుకొన్నా, ఇది తప్పు అని. 18 ఏళ్ళ పెళ్ళి వయసును ఇంకా పెంచటం అనవసరం. ఎలాగూ ఇప్పుడు 20 ఏళ్ళు దాటాకనే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కానీ పరిస్థితులు బాగాలేవని, కొందరు త్వరగా చేయాలని ఆలోచిస్తున్నారు. బలవంతంగా వద్దు అని చెప్పటంలో అర్థం లేదు. ఆడపిల్లల హత్య, ఆత్మహత్య అని చదివినప్పుడు వివరాల్లోకి వెళ్తే చాలా వరకు బాయ్ ఫ్రెండ్స్ వల్లనే జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులకు భయం వేసి త్వరగా పెళ్ళి చేయటం మంచిదనే ఆలోచనలో ఉన్నారు. చాలా మంది అమ్మాయిలు తమ కాళ్ళమీద తాము నిలబడాలనే తాపత్రయంలో తప్పటడుగు వేస్తున్నారు. ఏదేమైనా పెళ్ళి వయసు పెంచనవసరం లేదని నా అభిప్రాయం.
సర్వమంగళ, Chennai