ఏమిటీ ఘోరాలమ్మా… ఎన్నెన్ని నేరాలమ్మా…
ఎదిరించి నిలవాలమ్మా… నిలదీసి అడగాలమ్మా…
కామాంధులను పట్టి నీవు… చెల్లెమ్మా…
కఠిన శిక్ష వేయాలమ్మా… చెల్లెమ్మా… (2)
‘‘ఏమిటీ ఘోరాలమ్మా’’
చూపుల్లో కామ వాంఛా… చేతల్లో కామ వాంఛా
మాటల్లో కామ వాంఛా… నిలువెల్లా కామ వాంఛా
ఆడవాళ్ళ ఒంటిపై హక్కూ… చెల్లెమ్మా
మగవారికి ఎవరు ఇచ్చిరి… చెల్లెమ్మా (2)
‘‘ఏమిటీ ఘోరాలమ్మా’’
పాటల్లో అశ్లీలత… ఆటల్లో అశ్లీలత…
బట్టల్లో అశ్లీలత… బ్రతుకంతా అశ్లీలత…
సమాజం అంతా కూడా చెల్లెమ్మా
పచ్చి బూతులతో నిండిపోయే… చెల్లెమ్మా (2)
‘‘ఏమిటీ ఘోరాలమ్మా’’
బళ్ళల్లో అత్యాచారం… గుళ్ళల్లో అత్యాచారం
పల్లెల్లో అత్యాచారం… పట్టణాల్లో అత్యాచారం
అత్యాచారం దేశమాయే చెల్లెమ్మా
ఆడవాళ్ళకు రక్షణ లేదు… చెల్లెమ్మా (2)
‘‘ఏమిటీ ఘోరాలమ్మా’’
ఆడవారిమీద దాడి… జరుగుతున్న తీరు చూసి
జన్మనిచ్చిన తల్లి కూడా… తోడబుట్టిన చెల్లి కూడా
జడుసుకొని చావబట్టే… చెల్లెమ్మా
జీవించుడు గండమాయే… చెల్లెమ్మా (2)
‘‘ఏమిటీ ఘోరాలమ్మా’’