ప్రేమా, గుండెల్లో
నువ్వుంటే ఎంత ఆనందం
ప్రతి ఉదయం ఎంత ఉత్సాహం ..
కాలమంతా చలనమే
నేల అంతటా సంతస సంచలనాలే
కళ్ళల్లో దయా కాంతులు ప్రసరిస్తేనే కదూ ..
శాంతిని వెదజల్లే జ్యోతులు ..మాచుట్టూస్వార్థ చీకట్లను ఛేదించేది .. !
కరిగిపోతూ.. ఒరిగిపోతూ.. నిఅర్పణంలోనే ఆనందిస్తూ ..
దేదీప్యంగా వెలిగే కొవ్వొత్తిలా.. త్యాగ రాగాన్ని మౌనంగా ఆలపిస్తూ ..
ప్రేమా, జగమంతా నువ్వుంటే .. ఎంత సంతృప్తి !
ఉన్నట్టుండి .. నువ్వు శూన్యమయ్యావు ..మాకు వీడ్కోలు పలికావు
వెలుగు కిరణం కనుమరుగయింది
నేత్రాశ .. కళ్ళను దురాశ లతో నింపింది ..
శరీరాశతో.. దేహం వ్యాధి బాధల లోలకమయింది ..
లోకాశ .. అహంకార విద్వేషాలకు ఆహ్వానం పలికింది ..
అంతే.. ! నేల యావత్తూనియుధ్ధోన్మాద రణరంగమయింది
సూర్య చంద్రులతో పోటీపడుతూ సాధించుకొచ్చిన
ప్రగతిని తానే.. బుగ్గిపాలు చేసుకునే మారణాయుధమయ్యాడు .. మనిషి .. !
తన రక్తసిక్త చరిత్రకు .. తానే.. కలం గళం ఉఛ్వాశ నిశ్వాస అయ్యాడు .. ! !
ఇప్పుడు మనిషికి అవసరం.. లేపనాల పై పై పూతలు కాదు..
మెదడు కేంద్రాన్ని ప్రక్షాళించే రక్తమార్పిడి అత్యవసరం .. !
ప్రేమా , అది .. నీతోనే సాధ్యం ..!
మాకు తెలుసు, నిన్ను
ఏనాడో ఆవలికి తోసేసినా.. మనిషిగుండె తలుపు ..తడుతూనే ఉంటావని
మేము ఆహ్వానించినప్పుడునిమాత్రమే..
ఆనందంగా ఆగమిస్తావని ని.. ఆవరిస్తావని ..
ప్రేమా, ఇప్పుడు నువ్వు రావాలి ..నువ్వే కావాలి .. !
సకల దుష్టత్వాల మృత్యువును జయించే
నువ్వు మాత్రమే .. మానవతా జ్యోతులు నిమాలో వెలిగించే ..నీతి సూర్య తేజోపుంజం !
మా గుండెలనిండా..
గృహాల నిండా..
సమాజాలు..దేశాల నిండా
ఈ పుడమి.. ఆకాశము.. సాగరమంతటా..నిండిపో ..
మమ్మల్ని నింపివేయి..
ప్రేమా, నువ్వు రా… నువ్వే .. మమ్మల్ని ఆక్రమించి ఉంటే ..
నిజంగా .. మేమెంతనిసంపూర్ణులం
జీవితం .. క్షణక్షణం .. ఎంత ఉత్సాహం ..
అప్పుడే మాకు పునరుథ్థానం.. నిత్య నవజీవం … ! !