ట్రాన్స్ జెండర్స్ (ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల ప్రొటెక్షన్ సెల్ ` తెలంగాణ పోలీస్
భారత రాజ్యాంగం మన దేశ పౌరులందరికీ సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, గౌరవం కలిపిస్తూ అందరినీ, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులతో సహా కలుపుకొని పోయి ఉండే సమ సమాజం ఉండాలని నిర్దేశిస్తుంది.
లక్ష్యాలు:
్న ట్రాన్స్ జెండర్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తుల యొక్క హక్కులపై అవగాహన కల్పించడం, చట్టపరంగా వారికి
ఉన్నటువంటి భద్రత మరియు రక్షణలు ఉండేలా చేయటం.
్న ట్రాన్స్ జెండర్స్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తులపై జరిగే దాడులు, హింస పెరగకుండా పర్యవేక్షించడం మరియు కేసులను పర్యవేక్షించడం.
్న ట్రాన్స్ జెండర్‌లకు మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తులకు బహిరంగ ప్రదేశాలు స్వేచ్ఛగా, సురక్షితంగా, అందుబాటులో
ఉండేలా చేయటం.
్న పోలీసులకు, ట్రాన్స్ జెండర్‌ల మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తుల యొక్క సమస్యలపై అవగాహన కల్పించడం.
్న వీరికి పోలీసుల నుండి సంపూర్ణమైన సహాయ సహకారాలను అలాగే ఇతర నెట్‌వర్క్‌ల నుండి అవసరమైన సేవలను అందించడం.
్న ట్రాన్స్ జెండర్స్ మరియు ఎల్.జి.బి.టి.క్యూ.ఐ.ఎG వ్యక్తుల ప్రొటెక్షన్ సెల్స్ రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయబడుతుంది.
సందర్భం:
్న భారత రాజ్యాంగంలో భావ స్వేచ్ఛ (ఆర్టికల్ 19 (1)(ఎ)) మరియు సమానత్వ హక్కు (ఆర్టికల్ 14) ఏ లింగ భేదం లేకుండా, అందరి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నిర్మించబడ్డాయి.
్న 15 ఏప్రిల్ 2014లో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నల్సా పం. భారత యూనియన్ కేసులో మొట్టమొదటి సారిగా ప్రతి వ్యక్తికి వారి జెండర్‌ని స్వయంగా ఎలాంటి వైద్య పరీక్ష లేకుండా, ఆడా, మగా, ట్రాన్స్‌జెండర్‌గా నిర్ధారించుకునే ప్రాథమిక హక్కును కల్పిస్తూ, అలాగే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు రాజ్యాంగ హక్కులను కల్పిస్తూ తీర్పునిచ్చింది.
్న 2017 ఆగస్టులో పుట్టుస్వామి పం. భారత యూనియన్ కేసులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం గోప్యత హక్కును (రైట్ టూ ప్రైవసీ) ని సమాన హక్కు Ê జీవించే హక్కు (రైట్ టూ లైఫ్)లో అంతర్భాగమని చెప్తూ, పౌరులు వారికి నచ్చిన సంబంధాలలో ఉండడం, లైంగికత్వ హక్కు, అలాగే స్వీయ లింగ నిర్ధారణ హక్కులో భాగం చేస్తూ తీర్పునిచ్చింది.
్న 2018 సెప్టెంబరులో నవతేజ్‌సింగ్ జోహార్ పం. భారత యూనియన్ కేసులో భారత శిక్షా స్మృతిలో భాగమైన సెక్షన్ 377 కి సంబంధించి సమ లైంగిక సంబంధాలు నేరం కాదు అని తీర్పునిచ్చింది. ూGదీు హక్కుల సంఘర్షణ చరిత్రలో ఇది ఒక ప్రముఖమైన తీర్పు.
్న ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల సంరక్షణ) చట్టం 2019 మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల (హక్కుల సంరక్షణ) రూల్స్‌ని చట్టబద్దం చేసింది. ఇవి ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సమాన అవకాశాలను, హక్కుల సంరక్షణను కల్పిస్తూ ప్రతిపాదించినవి.
ప్రైడ్ ప్లేస్ ఎందుకు?
చారిత్రక, వ్యవస్థీకృతమైన హింసకు, ఆర్థిక, వివక్షతకు, సామాజిక వెనుకబాటుతనానికి క్వీర్ ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు, సమూహాలు గురవుతున్నారు. అత్యున్నత న్యాయస్థానాల తీర్పులను, ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల హక్కులను పరిరక్షించే చట్టాలను అమలు పరుస్తూ, వారి రక్షణ, భద్రతలను కల్పించడంలో విమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్, ముఖ్య పాత్ర పోషించగలమని దృఢంగా నమ్ముతున్నాము.
ఇది మేము మా కొత్త ఇనీషియేటివ్ అయిన ‘ప్రైడ్ ప్లేస్`ట్రాన్స్‌జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల యొక్క ప్రొటెక్షన్ సెల్’ ద్వారా చేయాలనుకుంటున్నాము.
ప్రైడ్ ప్లేస్, విమెన్ సేఫ్టీ వింగ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ యొక్క కార్యక్రమాలలో భాగం. ప్రైడ్ ప్లేస్ ద్వారా ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) వ్యక్తుల పట్ల జరిగే హింసను అరికడుతూ, వారికి భద్రతను, రక్షణను కల్పించబడుతుంది. ట్రాన్స్ జెండర్ (ఎల్.జి.బి.క్యూ.ఐ.ఎG) సమూహాలతో కలిసి పనిచేస్తూ, లింగం, లైంగికత్వం ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ కలుపుకొని పోయే సమాజాన్ని నిర్మించే దిశగా ఈ ప్రయత్నం.
కొన్ని తెలుసుకోవలసిన విషయాలు:
సెక్స్:
సెక్స్ వ్యక్తి యొక్క శారీరక అంశాలకు (క్రోమోజోమ్స్, గోనాడ్స్, హార్మోన్స్, ప్రత్యుత్పత్తి అవయవాలు, ద్వితీయ లైంగిక లక్షణాలకు) సంబంధించిన విషయం. వీటి ఆధారంగా వ్యక్తులను ఆడా, మగా, లేదా ఇంటర్ సెక్స్ వ్యక్తులుగా పరిగణించవచ్చు. ఈ శారీరక అంశాలు పరస్పర భిన్నత్వం కలిగి అందరికీ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.
లైంగికత్వం:
ఇతర వ్యక్తుల పట్ల ఉండే లైంగిక ఆకర్షణను లైంగికత్వం అంటారు. లైంగికత్వం Ê సెక్స్ రెండూ భిన్నమైన విషయాలు. లైంగికత్వం, లైంగిక ఆకర్షణకు సంబంధించిన విషయం. సెక్స్ శరీర అంశాలు/ అవయవాలకు సంబంధించిన విషయం.
లింగం:
సామాజిక, సాంస్కృతిక పరిణామ క్రమంలో వ్యక్తులను వారి, వారి సెక్స్ ఆధారంగా వివిధ వర్గాల్లో విభజించి, దాని ఆధారంగా వారికి తగ్గ పనులు, బట్టలు, రూపం మొదలైనవి ఆపాదిస్తూ చేసేది జెండర్ (లింగం) ప్రక్రియ.
లింగ అస్తిత్వం:
ఒక వ్యక్తి వ్యక్తిగతంగా తాను ఆడా, మగా, లేదా రెండిరటి మిశ్రమం లేదా వేరే అస్తిత్వమా అనేది వ్యక్తులు వారి గురించి వారు ఏమనుకుంటున్నారు, వారిని వారు ఏమని సంబోధించుకుంటారు, ఇవి లింగ అస్తిత్వంలో భాగం. ఒక వ్యక్తి యొక్క లింగ అస్తిత్వం వారికి పుట్టినప్పుడు ఇచ్చిన సెక్స్‌తోనే ఉండవచ్చు లేదా అందుకు భిన్నమై ఉండవచ్చు.
సీస్ జెండర్ వ్యక్తి:
చాలామందిలో పుట్టుకతో వారికి ఆపాదించబడే సెక్స్‌కు, ఎదుగుతున్న క్రమంలో రూపొందే జెండర్ గుర్తింపునకు మధ్య పొత్తు
ఉంటుంది. వారిని సీస్ జెండర్ వ్యక్తులు అంటారు.
ట్రాన్స్ జెండర్ వ్యక్తులు:
చాలా మందికి పుట్టుకతో వారికి ఆపాదించబడే సెక్స్‌కు, ఎదుగుతున్న క్రమంలో రూపొందే జెండర్ గుర్తింపునకు మధ్య పొత్తు
ఉండదు. వారిని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు అంటారు. (ఈ వ్యక్తులు ఎలాంటి వైద్య పరమైన చికిత్స తీసుకోని వారు కూడా అయి ఉంటారు) ఇందులో స్త్రీ, పురుషులలో ఇమిడే అస్తిత్వాలు అయినా ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు, ఇమడని అస్తిత్వాలు అయినా జెండర్, క్వీర్, ట్రాన్స్ ఫెమినైన్, ట్రాన్స్ మాస్క్యులైన్ అస్తిత్వాలు కూడా ఉంటాయి.
ూతీఱసవూశ్రీaషవ.ఔూఔ.ుూ – ష్ట్ర్‌్‌జూం://షశీఎవఅంaటవ్‌వషఱఅస్త్ర.్‌వశ్రీaఅస్త్రaఅa.స్త్రశీఙ.ఱఅ
9440700906 – ్‌తీaఅంషవశ్రీశ్రీ.షంషఏ్aంజూశీశ్రీఱషవ.స్త్రశీఙ.ఱఅ
PridePlace.WSW.TS – https://womensafetywing.telangana.gov.in
9440700906 – transcell.wsw@taspolice.gov.in