భూమిక పనిచేస్తున్న పది బస్తీలలోని సీబీఓలకు ఏప్రిల్ 26న పితృస్వామ్యం అనే అంశంపై శిక్షణనిచ్చాము. మొదటగా ఒక బాల్ గేమ్ ఆడిరచడం ద్వారా అందరం పరిచయం చేసుకొన్నాం. అందరి పరిచయాలైన తర్వాత ఇంతకు ముందు జరిగిన సెషన్‌లో వారు ఏమి తెలుసుకున్నారన్న విషయాలను ఒకసారి గుర్తు చేసుకున్నారు.
ఈ మీటింగ్‌కి 22 మంది సీబీఓలు హాజరయ్యారు. ఈ రోజు చర్చించుకునే అంశం గురించి వివరించి, కేటర్‌పిల్లర్ అనే యాక్టివిటీ చేయించాం. ఇందులో మొత్తం సభ్యులను ఐదు నుండి ఆరు గ్రూపులుగా విభజించాం. ఒకరి మధ్యలో ఒకరు బెలూన్లను ఉంచుకుని చేతితో పట్టుకోకుండా నడవాలి. కొంతమందివి కింద పడిపోయాయి. కొంతమంది చివరివరకు పడిపోకుండా నడవగలిగారు. ఈ యాక్టివిటీని అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అందరూ వారి కుటుంబంలోను, వివిధ సందర్భాలలోను పాటిస్తున్న ఆచారాలు, సంప్రదాయాల గురించి చాలా వివరంగా చర్చించారు. దీనిద్వారా ఆచారాలు, సంప్రదాయాలు అనేవి ముందు తరం నుండి మనం వాటిని ఎలా కొనసాగిస్తున్నాం మరియు సభ్యుల మధ్య కో`ఆర్డినేషన్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోగలిగారు.
ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యవతి గారు సీబీఓలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన కమ్యూనిటీలలో జరుగుతున్న పని గురించి, సపోర్ట్ సిస్టమ్‌ల గురించిన అవగాహన ఎంత ఉంది, మిగిలిన వారికి కూడా ఈ సమాచారాన్ని అందచేయగలిగేలా చేయాలి, సంఘం సమావేశాలు జరిగేటపుడు వారితో కలిసి మాట్లాడడంతో పాటు వారికి ఈ సమాచారమంతా ఇవ్వవచ్చని చెప్పారు. గర్ల్ ఛైల్డ్ బర్త్ సెలబ్రేషన్ గురించి మాట్లాడారు. సీబీఓలందరికీ ఐడి కార్డులను ఇవ్వడం జరిగింది. తర్వాత రిబ్బన్ యాక్టివిటీ చేయించాం. ఇందులో ఐదుగురు సభ్యులను రిబ్బన్‌తో ఒకరిని మరొకరు పై నుండి కింది వరకు బంధిస్తారు. మరొకరు దాన్ని విప్పతీస్తారు. దీనిద్వారా మిగిలిన వారికి ఈ గేమ్ ఎలా అర్థమయిందని అడిగితే, సమస్యలను మనకు మనం ఎలా పరిష్కరించుకోగలగాలి అని కొందరు, కట్టుబాట్లు, ఆచారాలు వంటి వాటిని ముందు తరం నుండి ఈ తరం వారు కూడా ఎలా ముందుకు తీసుకువెళ్తున్నారు, మార్పు ఎక్కడ అవసరం అనేది అర్థమయిందని మరి కొందరు చెప్పారు.
పితృస్వామ్య వ్యవస్థ గురించి, దాని ప్రభావం, అలాంటి వ్యక్తుల యొక్క భావజాలం మన జీవితాలలో ఎంత ప్రభావం చూపిస్తుందనే విషయాలను వివరంగా చెప్పడం, అందులో భాగంగా సీబీఓలందరూ వారి అనుభవాలను, అభిప్రాయాలను పంచుకున్నారు.
సభ్యులందరినీ మూడు గ్రూపులుగా చేసి యాక్టివిటీ చేయించాము. కుటుంబం, సమాజం, రాజకీయ వ్యవస్థలలో పితృస్వామ్యం యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనే అంశాలను గ్రూప్ డిస్కషన్ ద్వారా చేయించాం.
అందరూ చర్చల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను ఛార్టుపై రాసి ప్రజెంట్ చేశారు. కుటుంబంలో సమాజంలో పితృస్వామ్య భావజాలం చాలా బలంగా పాతుకుపోయి ఉందిÑ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే కొన్ని కుటుంబాల్లో ఆడవారికి కూడా తగిన ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతోంది. అందరూ వారి పిల్లలను ఆడ, మగ భేదభావం లేకుండా చూస్తున్నామని, సమాన అవకాశాలను ఇస్తున్నామని చెప్పారు. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా ఇలాంటి మార్పు రావలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. సభ్యులలో ఒకామె రాజకీయ రంగంలో ఉన్నారు. ఆమె వృత్తి విషయాలలో భర్త సలహాలు ఇవ్వడం, నిర్ణయాలు తీసుకోవడం కొన్నిసార్లు జరిగింది. కానీ ఇప్పుడు ఆమె ధైర్యంగా అతనికి ఈ విషయంలో కల్పించుకోవద్దని చెప్పగలుగుతున్నానని, అలాగే తనంతట తాను నిర్ణయాలు తీసుకోగలుగుతున్నానని చెప్పారు. తర్వాత సెషన్‌లో సంక్షిప్తం చేసి, స్నేక్ అండ్ లాడర్స్ యాక్టివిటీ చేయించాము. ఈ యాక్టివిటి ద్వారా ప్రస్తుతం స్త్రీలు మరియు అమ్మాయిలు ఇంకా వివక్షతను ఎదుర్కొంటున్నారు. వారికి కుటుంబం, సమాజం, ప్రభుత్వం ద్వారా తగిన ప్రోత్సాహం, సదుపాయాలు అందించగలిగితే వారు కోరుకున్న లక్ష్యాలను చేరుకోగలరని, తమ కుటుంబాలలో అమ్మాయిలకు తగిన ప్రోత్సాహం, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ యాక్టివిటి చేసేటప్పుడు చాలా సరదగా ఉన్న ఇందులో చాలా విషయాలను తెలుసుకోగలిగామని అభిప్రాయపడ్డారు. రెగ్యులర్‌గా ఇలాంటి శిక్షణలు జరిగితే బాగుంటుందని అభిప్రాయం వెలిబుచ్చారు.