జ్యోతి, వయస్సు 13 సంవత్సరాలు, ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న అమన్ వేదిక రెయిన్ భో హోమ్‌లో ఉంటూ ముసీరాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి ఆంగ్ల మాధ్యమంలో చదువుతోంది.
పట్టుదల, కొంత సామాజిక చేయుత ముందు, పేదరికము, కలిమి, లేములు, కుటుంబ పరిస్థితులు నిలువజాలవని నిరూపించడానికే, ఈ అమ్మాయి కథను ఎంపిక చేసుకున్నాము. తాగుడు వలన జ్యోతి నాన్న చనిపోయిన తరువాత, తల్లి రమకు జ్యోతి చదువు, పోషణ భారంగా మారాయి. చదువు, రక్షణ కల్పించడానికి, జ్యోతిని, తల్లి రమ అమన్ వేదిక రెయిన్‌బో హోమ్ ముషీరాబాద్‌లో 2017 సం॥లో చేర్పించింది. 2020 ఎండాకాలం సెలవుల్లో, పిల్లలకు చెస్ నేర్పడానికి స్వయానా చెస్ క్రీడాకారుడు అయిన సృంజయ్‌ని హోమ్ నియమించింది. జ్యోతి ప్రతిభను గమనించిన, సృంజయ్, ఆమెను చెస్‌లో తర్పీదు ఇవ్వడం ప్రారంభించాడు. అప్పటి నుండి జ్యోతి ప్రాక్టీస్ చేస్తూ వస్తూంది.
హైద్రాబాద్ నగర స్థాయి ప్రాథమిక పోటీల్లో పాల్గొన్న తరువాత, జ్యోతి జాతీయ స్థాయి చెస్ పోటీలకు ఎంపిక కాబడిరది. ఆదృష్టవశాత్తు, నిర్మాణ్ సంస్థ యొక్క సహాయం ద్వారా జ్యోతి నాగపూర్‌లో నిర్వహించబడ్డ నజూ డ ూఖీజ జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొని 14 సంవత్సరాల లోపు విభాగంలో వెండి పథకాన్ని గెలిచింది. జ్యోతి, చదువు మరియు చదరంగం రంగాల్లో చక్కటి ప్రతిభను కనబరిచి, తన జీవితానికి ఒక చక్కటి పథాన్ని వేసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాము. 27 జులై నాడు, జ్యోతి, డిప్యూటీ ణజుూ, ప్రధానోపాధ్యాయులచే స్థానిక వీూA ముఠా గోపాల్ సమక్షంలో సత్కరించబడినది. స్కూల్ టీచర్లు, అమన్ వేదిక రెయిన్‌బో హోమ్ ముషీరాబాద్ ప్రాజెక్టు ఇంచార్జీ, సిబ్బంది, రెయిన్‌బో ఫౌండేషన్ ఇండియా వారు అభినందనలు తెలిపారు.