భూమిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం -సరిత

ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింస, లైంగిక దాడులపై మరియు కుల దురహంకార హత్యలపై ప్రచురితం మరియు ప్రసారం చేస్తున్న కథనాలు మీడియా జెండర్‌ సున్నితత్వంతో వ్యవహరించాలనే అజెండాతో భూమిక ఉమెన్స్‌ కలెక్టివ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ప్రాజెక్టు కో`ఆర్డినేటర్‌ సుజాత స్వాగతోపన్యాసంతో ప్రారంభించారు. కార్యక్రమానికి అధ్యక్షులుగా భూమిక సంస్థ నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, వక్తలు ూూఔ సంస్థ వ్యవస్థాపకులు సంధ్య, రిటైర్డ్‌ జర్నలిజం ప్రొఫెసర్‌ పద్మ షా మరియు వివిధ ఎలక్ట్రానిక్‌ మరియు ప్రింట్‌ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.
సత్యవతి మాట్లాడుతూ మీడియాలో ప్రసారమయ్యే స్త్రీలు మరియు పిల్లల విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు సెన్సేషన్‌ కోసం కాకుండా సెన్సిటివ్‌తో ప్రసారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీడియా అంతా కూడా సినీ తారలు, వారి వ్యక్తిగత జీవిత విశేషాలను, రాజకీయ నాయకుల రాజకీయాలకు సంబంధించిన విషయాలను ప్రసారం చేస్తున్నారు కానీ జనాభాలో సగభాగం అయిన స్త్రీలు, పిల్లలకు సంబంధించిన విషయాలు రావడం లేదని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. కరోనా తర్వాత మహిళలు, పేదవారు, విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారని, వాటిని ఎక్కడా కవర్‌ చేయడంలేదని అన్నారు. మీడియాలో మహిళలను గొడ్రాలు పదాలతో కసాయి తల్లి లాంటి సంబోధించడం సరికాదన్నారు. మహిళలు మరియు బాలికల విషయంలో వివిధ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ప్రసారం చేస్తున్నప్పుడు మీడియా గౌరవప్రదమైన భాషను వాడాలని చెప్పారు.
ప్రెస్‌ అకాడమీ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలన్నదే ఈ సభా వేదిక నుండి తాము డిమాండ్‌ చేస్తున్న విషయమని అన్నారు. గ్రామీణ ప్రాంత రిపోర్టర్లకు జండర్‌ సెన్సిటివిటీ మీద శిక్షణలు నిర్వహించాలని చెప్పారు.
సంధ్య మాట్లాడుతూ తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నారు కానీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా రావడం లేదన్నారు. ఈ విషయంపై మీడియా కౌన్సిల్‌తో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. మీడియా అంతా సినీ ప్రముఖుల వార్తలు, వారి వ్యక్తిగత జీవితాలను సెన్సేషన్‌ చేస్తూ టీఆర్పీ రేటింగ్‌ కోసం పాకులాడుతున్నాయని అన్నారు. సమాజంలో కుల దురహంకార హత్యలు జరుగుతున్నా, మరియు బాలికలు, మహిళలపై హింసకు సంబంధించిన నేరాల గురించి అసలు వార్తలు రావడం లేదన్నారు. పరువు హత్య పేరుతో రకరకాల వ్యాసాలు, వార్తలు ప్రసారాలు చేస్తున్నారు కానీ వాటి పేరు కుల, దురహంకార హత్యలు అని రాయాలని అన్నారు. బాధితులు అందంగా ఉన్నవారైతే వారి వార్తలు సంచలనాలుగా వేస్తున్నారు కానీ బాధితుల యొక్క బాధలు అందంతో సంబంధం లేకుండా చూసి నిజాలు రాయాలని చెప్పారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు ఎలాంటి భద్రత ఉన్నదో ఇప్పటి ప్రభుత్వం చెప్పాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో మహిళలపై దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత వహించాలని అన్నారు.
యువత పోర్న్‌ వీడియోల మత్తులో ఉందని, దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉన్నదని, చాలా దేశాలలో పోర్న్‌ వెబ్‌సైట్లను బ్యాన్‌ చేస్తున్నారని, ప్రభుత్వం ఒక సమీక్ష నిర్వహించి ఇలాంటి విషయాలపైన అన్ని వర్గాలతో సలహాలు తీసుకుని పోర్న్‌ సైట్లను బ్యాన్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అత్యాచారం, హత్యకు గురైన మహిళలు మరియు పిల్లల ఫోటోలు మీడియాలో చూపించొద్దని అన్నారు. నేషనల్‌ క్రైం బ్యూరో ప్రకారం తెలంగాణ రాష్ట్రం అత్యాచారాలు, హత్యలు, పరువు హత్యలు, లైంగిక దాడుల విషయంలో మొదటి నాలుగు స్థానాల్లోనూ, అభివృద్ధిలో చివరి మూడు స్థానాల్లో ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, హింస మరియు వ్యవస్థలో ఉన్న లోపాల సవరణ గురించి ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం తరపున ఒక్క ప్రకటన కూడా చేయడం లేదన్నారు.
ఎన్నో మహిళా పోరాటాల తర్వాత, బీజింగ్‌ సదస్సు ఫలితంగా గృహ హింస చట్టం 2005, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పురుడు పోసుకున్నాయని, కానీ అమలులో విఫలమవుతున్నాయని అన్నారు. చట్టాలు రావడం కోసం పోరాటాలు చేశామని, వాటి అమలు కోసం కూడా పోరాడాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వాలు, చట్టాల అమలు గురించి ఎవరూ పని చేయడం లేదని, సామాజిక కార్యకర్తల పైన సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతున్నాయని పెరుగుతున్నాయని అన్నారు. సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేస్తూ బూతులతో తమను వెంటాడుతున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా తాము బాధిత మహిళల తరపును పని చేస్తామని, పోరాడుతామని ఆమె స్పష్టం చేశారు.
ప్రొఫెసర్‌ పద్మజ షా మాట్లాడుతూ నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్ట్స్‌ ప్రకారం ఇస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న హింసకు పొంతన లేదని అన్నారు. పోలీస్‌ స్టేషన్లలో రిజిస్టరయిన కేసులు తప్ప బయట జరుగుతున్న నేరాలు మీడియాలో ఎక్కడా చూపించట్లేదని అన్నారు. మీడియా కొన్ని వార్తలను మాత్రం సెన్సేషన్‌ చేస్తుందని, కానీ మీడియా అనేది చాలా బాధ్యతాయుతమైన వ్యవస్థ అని, నిరంతరం నిజాలనే ప్రసారం చేయాలని అన్నారు. మహిళా రాజకీయ నాయకుల కట్టుబొట్టు, నడవడిక గురించి రాయడం సరికాదన్నారు. మహిళా రాజకీయ నాయకుల సామర్ధ్యాలను మరియు వారి పనితీరును ప్రశంసిస్తూ వార్తలు రాయాలన్నారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని పదే పదే మీడియాలో చూపించడం సరికాదన్నారు.
టీవీ సీరియల్స్‌లో పితృస్వామ్య భావజాలం, మహిళలను కొట్టడం, తిట్టడంతో పాటు అందులో వాడే భాష, స్త్రీలను విలన్‌గా చూపించడం, విష ప్రయోగాలు చేయడం వంటి విషయాలు, సమాజంలో స్త్రీలు ఆలోచించే విధానం మీద వారి జీవన విధానంపై చాలా వ్యతిరేక ప్రభావం చూపుతుందని, ఇలాంటివి అసలు ఆమోదయోగ్యమైనవి కావని అన్నారు. ఇలాంటి సీరియల్స్‌ విష సంస్కృతిని వెదజల్లుతున్నాయని అన్నారు.
మీడియా ఎలక్ట్రానిక్‌ అయితే టీఆర్పీ రేటింగ్‌ కోసం, ప్రింట్‌ మీడియా అయితే సర్క్యులేషన్‌ కోసం, సోషల్‌ మీడియా అయితే చాలా అధ్వాన్నంగా తయారయ్యాయని అన్నారు. సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ చేసే న్యూస్‌ హెడ్డింగ్‌లు చాలా పవర్‌ఫుల్‌గా పెడుతున్నారని, వాటిని ఓపెన్‌ చేసి చూస్తే అందులో పొంతనలేని సమాచారం ఉంటుందని అన్నారు. మీడియా యూట్యూబ్‌ ఛానల్స్‌ పుణ్యమా అని అందరూ జర్నలిస్టులయ్యారని అన్నారు. జర్నలిజాన్ని ఒక వృత్తిగా స్వీకరించి నిజాలను రాయాలి అనే నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయిందన్నారు. కోవిడ్‌ సమయంలో మహిళలపైన పని భారం పెరిగిందని, మహిళలకు ఉద్యోగాలు పోయాయని, లెక్కలేనన్ని బాల్య వివాహాలు జరిగిపోయాయి కానీ ఆ విషయాలను ఎక్కడా ప్రస్తావించలేదని ఆమె అన్నారు. ఏదైనా గ్రామంలో కానీ, బస్తీల్లో కానీ ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాన్ని మీడియాలో వార్తల కోసం పదేపదే వేధిస్తూ వార్తలు రాస్తున్నారని, ఒకవేళ బాధిత కుటుంబం నిరాకరిస్తే ఆ గల్లీలో, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళని పట్టుకొని బాధిత కుటుంబం గురించి వారితో ఎలా ఉండేవారు, ఇక్కడ ఎప్పటినుంచి ఉంటున్నారు అని అడిగి ఇతరుల ఒపీనియన్‌ అడిగి తెలుసుకుని ఆ వార్తకు సెన్సేషనల్‌ టైటిల్‌ పెట్టి ప్రచారం చేస్తూ టి.ఆర్‌.పి రేటింగ్‌ పెంచుకుంటున్నారని అన్నారు.
ఆధునిక పోకడలతో పెరుగుతున్న హింసను నివారించాలని, ఈ ప్రభావం మహిళలు, యవత, పిల్లలపై పడి వారి భావి జీవితాలను నాశనం చేస్తున్నాయని అన్నారు. ఈ మధ్య భార్యా బాధితుల సంఘాలు వస్తున్నాయని, ఎక్కడో ఒకచోట జరిగిన సంఘటనను పదేపదే చూపిస్తూ స్త్రీలను నిందితులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున చాలా విలువలతో కూడిన, బాధ్యతాయుతంగా మీడియా వ్యవహరించాలని ఆమె కోరారు. ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ వెంకటేష్‌ గారు మాట్లాడుతూ భూమిక సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో సమాచారంతో కూడుకున్నదని, నిత్యం గుర్తుంచుకోవాల్సిన విషయాలను ఇక్కడ వక్తలు మాట్లాడారని అన్నారు. చాలా విలువలతో కూడిన సమాచారాన్ని ప్రసారం చేయాలి అనీ, మీలాంటి సంస్థలు ముఖ్యంగా ఇలాంటి సమావేశాలను, వర్క్‌షాప్స్‌ను రాజకీయ నాయకులకు, న్యూస్‌ ఛానల్స్‌, న్యూస్‌పేపర్ల సీఈఓలకు కూడా పెట్టాలన్నారు. అలాగే మీడియా సామాజిక మహిళా కార్యకర్తల జీవిత సంఘర్షణలు కూడా బయటి ప్రపంచానికి, సమాజానికి పరిచయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
చివరిగా సరిత సమావేశానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపి సమావేశాన్ని ముగించారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.