అమానుషం -కొండవీటి సత్యవతి

పుష్ప హడావుడిగా నడుస్తోంది. ఆలస్యం అయిపోయింది. అమ్మగారేమంటారో! నిన్న తొందరగా రమ్మని మరీ మరీ చెప్పింది. మాయదారి బస్సు దొరకలేదు. అక్కడికీ ఆరింటికి లేచి ఇంట్లోవాళ్ళకి వండిపెట్టి బయలుదేరింది. గంట ప్రయాణం చేస్తేగానీ ఈ మూలకి రాలేదు. ఆఫీసర్ల ఇళ్ళన్నీ ఇటున్నాయి. తనేమో ఆ వైపుంది. ఇల్లు సమీపించే కొద్దీ ఆందోళన ఎక్కువైపోయింది పుష్పకి.

మెల్లగా గేటు తీసుకుని ఇంట్లోకి నడిచింది.
‘‘హమ్మయ్య! అమ్మగారింకా లేవలేదు’’ అని నిట్టూర్చి బెల్లు కొట్టింది. ఇంట్లో ఉండే కుర్రాడు రాజు తలుపు తెరిచాడు.
‘‘అమ్మగారు లేచారా?’’ అని అడిగింది.
‘‘లేదు’’ అని రాజు తలుపు దగ్గరకేసి బయటకెళ్ళిపోయాడు.
పుష్ప వంటింట్లోకి నడిచింది. చిందర వందరగా ఉన్న అంట్లన్నీ తీసి సింక్‌లో వేసింది. గ్యాస్‌ స్టవ్‌ తుడిచి, గట్టు
శుభ్రం చేసి అంట్లను తోమడం మొదలుపెట్టింది.
ఓ అరగంటలో వంటింట్లో పనంతా చేసేసి తేలికగా నిట్టూర్చింది.
అమ్మగారు లేచేటప్పటికి వంటిల్లు శుభ్రంగా లేకపోతే ఎంత కోప్పడతారో పుష్పకి తెలుసు.
అమ్మగారు నిద్ర ముఖంతో బయటికొచ్చింది. వంటిల్లు చూసి ముఖం ప్రసన్నంగా పెట్టుకుని బ్రష్‌ తీసుకుని బాత్‌రూమ్‌లో దూరింది.
పుష్ప బయటంతా ఊడ్చడానికి వెళ్ళింది. అయ్యగారు లేచేలోపు బయట శుభ్రం చెయ్యాలి. చీపురుతో ఆయనకి ఎదురు పడకూడదని అమ్మగారి ఆజ్ఞ. పొరపాటున కనబడితే ఆ రోజు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
మొన్న ఒకరోజు ఫోన్‌లో మాట్లాడుతూ అమ్మగారన్న మాట గుర్తొచ్చింది పుష్పకి. ‘‘ఈ పనివాళ్ళతో చస్తున్నానండి. పొద్దున్నే చీపురు కట్ట తీసుకుని ఆయనకి ఎదురు పడొద్దంటే విన్పించుకోరు. ఒక్క పనీ సరిగ్గా చేసి చావరు. ఇంతమంది పనివాళ్ళున్నా సుఖం లేకుండా పోయిందండి’’ అంటూ ఇంకా ఏమేమో అన్నారు.
పుష్పకి చాలా బాధనిపించింది. ఆ రోజు చీపురుతో తుడుస్తుంటే అయ్యగారు గార్డెన్‌లోకొచ్చారు. తను చాలా భయపడిరది. అమ్మగారు చూడనే చూశారు. తల బొప్పి కట్టేట్లు చివాట్లు పెట్టారు. అందులో తన తప్పేమిటో అర్థం కాలేదు పుష్పకి.
బయటంతా ఊడ్చేసి లోపలికొచ్చి గదులు ఊడ్చడం మొదలుపెట్టింది. ఒక్కో గది ఊడ్చుకుంటూ మూసి ఉన్న ఓ గది తలుపు తీసింది. అంతే, లోపలున్న ఆల్సేషన్‌ కుక్క టైగర్‌ ఒక్క ఉదుటున ఎగిరొచ్చి పుష్ప కాలు పట్టుకుంది. పుష్ప కెవ్వుమంది. మడమని నోటితో ఒడిసి పట్టింది కుక్క. అమ్మగారు పరిగెట్టుకుంటూ వచ్చింది.
‘‘ఆ తలుపెందుకు తీశావ్‌’’ అంటూ అరిచి ‘‘టైగర్‌ వదిలెయ్‌ కమాన్‌’’ అని రాజూ అంటూ రాజూను కేకేసింది. టైగర్‌ గుర్రుగా చూసింది గానీ వదల్లేదు. పుష్ప గిలగిల్లాడుతోంది. ఒంటి కాలిమీద నిలవలేక కింద కూలబడిరది. రాజు బెల్టు తెచ్చేసరికి టైగర్‌ పుష్ప కాలిని వదిలేసింది. టైగర్‌ పళ్ళు పుష్ప కాలి మడమలోకి దిగబడిపోయాయి. వదిలెయ్యగానే రక్తం ధారకట్టింది. పుష్పకి కళ్ళలోకి నీళ్ళొచ్చాయి. అలాగే లేచి నిలబడి మెల్లగా కుంటుకుంటూ బయటికెళ్ళి పైపు కింద కాలుపెట్టి బాగా కడిగింది. రక్తం ఆగడం లేదు. అమ్మగారేమైనా మందు తెస్తారేమోనని ఎదురుచూసింది పుష్ప. అమ్మగారి జాడలేదు.
‘అయ్యో కరిచిందా’ అని కూడా అనలేద ు. బాగా కడిగి బట్ట చుట్టుకుని కుంటుకుంటూ ఇంట్లోకొచ్చింది. నేలమీద అంటిన రక్తం మరకల్ని శుభ్రంగా తుడిచేసింది. కాలికి చుట్టుకున్న బట్ట రక్తంతో తడిసిపోయింది. రాజునడిగి ఇంకో బట్ట తీసుకుని తడిపి చుట్టుకుంది.
కుంటుకుంటూ అలాగే మిగిలిన గదుల్ని తుడవడం మొదలుపెట్టింది. టైగర్‌కి ఏమైందివాళ? రోజూ తనని చూస్తూనే ఉంది. అసలు గదిలో ఎందుకు పెట్టారు? తనేమో తెలియక గది తలుపులు తెరిచింది. రాత్రినుంచి దాన్ని లోపలే
ఉంచినట్లున్నారు.
రాజు మెల్లగా వచ్చి ‘‘అమ్మగార్నడిగి ఎల్లిపోలేకపోయావా?’’ అన్నాడు.
‘‘అమ్మగారు చూశారుగా. ఏమీ అనలేదు. అయినా దానికేమొచ్చింది. రోజూ నన్ను చూస్తుంది కదా! ఎంత లోతుగా దిగాయో చూడు’’ అంది పుష్ప.
‘‘రాత్రి గోడదూకి బయటికెళ్ళి ఊరకుక్కలెంట పడిరది. దాని వెంట పరిగెత్తి పట్టుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. అమ్మగారికి కోపమొచ్చి గదిలో పడేసారు. అది చాలా కోపంగా ఉంది. నువ్వు దొరికిపోయావు’’ అన్నాడు రాజు.
‘‘పొద్దున్నే ఎవల ముఖం చూసేనోÑ బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు పొడిపించుకోవాలి. రక్తం కారుతూనే ఉంది. అమ్మగారు బయటికొస్తే బాగుండు. అడిగి వెళ్ళిపోదును’’ తనలో తనే గొణుక్కుంటూ బట్ట తీసుకుని గదులు తుడవడం మొదలెట్టింది.
కాలికి చుట్టుకున్న బట్ట మరోసారి రక్తంతో తడిసిపోయింది. తుడుస్తున్న గదుల్లో అక్కడక్కడా మరకలు. మళ్ళీ తుడిచి కట్టు మార్చుకుని కిచెన్‌లోకెళ్ళింది. వంట మనిషి వంట పూర్తిచేసి బండెడు అంట్లు సింకులో పడేశాడు.
‘‘కుక్క కరిచిందటగా. ఎల్లిపోలేకపోయావా అమ్మగార్నడిగి. వెంటనే ఇంజక్షన్‌ చేయించుకోవాలి’’ అన్నాడు.
‘‘అవునయ్యా! పొద్దున్నే ఈ ఉపద్రవం వచ్చిపడిరది. అమ్మగారు చూశారు. ఎల్లమని అనలేదు. ఎలా అడగను? పనంతా చేసేసి ఎల్లిపోతాలే. రక్తం కారడం ఆగడం లేదు’’ అంది పుష్ప అంట్లు తోముతూనే.
‘‘కొంచెం పసుపేసి కడతావేంటి?’’
‘‘వద్దులే. డాక్టరు దగ్గరికి పోతాలే’’
పుష్ప అలా కుంటుకుంటూనే పనంతా పూర్తి చేసింది.
అమ్మగార్ని అడిగి వెళ్ళిపోదామని అనుకుంటుంటే గేటు ముందు వెటర్నరీ ఆస్పత్రి వాళ్ళ వ్యాన్‌ ఆగింది.
అమ్మగారెంత మంచివారు. డాక్టరు గారిని ఇంటికి పిలిపించారు అనుకుంది పుష్ప. ఇంతసేపు ఫోన్‌లో మాట్లాడిరది డాక్టరు గారికోసమే కాబోలు అనుకుంది.
గేటు తీసుకుని ఇద్దరు మనుషులు లోపలికొచ్చారు. కాంపౌండర్లలా ఉన్నారు.
అమ్మగారు బయటికొచ్చారు.
‘‘డాక్టరు గారు రాలేదా?’’ అన్నారు.
‘‘లేదమ్మా! మమ్మల్ని పంపారు’’ అన్నారు వాళ్ళు అతి వినయంగా.
‘‘చూడండి! టైగర్‌ రాత్రి నించి ఏమీ తినలేదు. గోడదూకి పారిపోయింది. రాత్రినుంచి చిరాగ్గా ఉంది. సర్వెంట్‌ని కరిచింది. దానికేమైందో తెలియడంలేదు. మీ డాక్టరొస్తే బాగుండునే’’ అంది అమ్మగారు.
‘‘అయ్యగారు హాస్పిటల్‌లో ఉన్నారు. టైగర్‌ని మేము తీసుకెళ్తామమ్మా’’ అన్నారు.
అతి చాకచక్యంగా టైగర్‌ని పట్టుకుని వ్యాన్‌లో ఎక్కించి ‘‘అయ్యగారికి చూపించి తీసుకొస్తామమ్మా’’ అంటూ అతి వినయంగా వంగి దండం పెట్టి వెళ్ళిపోయారు.
కళ్ళప్పగించి చూస్తున్న పుష్పని చూస్తూ ‘‘పనైపోయిందా! అయిపోతే వెళ్ళి డాక్టర్‌కి చూపించుకో. ఏం ఫర్లేదులే. టైగర్‌కి అన్ని ఇంజక్షన్లు వేయించాం’’ అంటూ లోపలికెళ్ళిపోయింది.
రక్తంతో చెమరుస్తున్న కాలిని చూసుకుంటూ పుష్ప అనుకుంది ` తనకన్నా కుక్క బతుకే నయంగా ఉంది. తనని కూడా అదే వ్యాన్‌లో హాస్పిటల్‌కి పంపొచ్చుగా. వ్యానొస్తే తనకోసమని తనెలా అనుకుంది. వాళ్ళకి వాళ్ళ కుక్క గొప్ప కానీ తన గురించి ఎందుకాలోచిస్తారు. రక్తం కారుతున్నా కానీ వాళ్ళ పనులకి ఆటంకం రాకూడదు. పనయ్యాకే డాక్టరు దగ్గరికెళ్ళాలి. ఛీ… ఛీ… ఏం మనుషులు. తమచేత అడ్డమైన పనుల్నీ చేయించుకుంటారు. తమకి కష్టమొచ్చినప్పుడు చిన్న సాయం కూడా చేయరు. ఈ ఆఫీసర్ల ఇళ్ళల్లో పని చెయ్యడం కత్తిమీద సామని తనకి తెలుసు. వాళ్ళెంత కఠినంగా ఉంటారో తెలుసుగానీ మరీ ఇంత మానవత్వం లేకుండా ఉంటారని తను అనుకోలేదు.
రకరకాల ఆలోచనలతో కుంటుకుంటూ బస్టాప్‌ వైపు నడవసాగింది పుష్ప.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.