అంగట్ల ఆగమైన గొంగడి -జూపాక సుభద్ర

గీ గ్లోబలైజేషన్‌ ఎన్ని గొల్లేలేసినా, మాడ్రనైజేషన్‌తోని ఎన్ని కొత్త వస్తువులు కోలాటమాడినా నాకు పాత వస్తువులంటేనే ఖాయిషు. నా సిన్నప్పుడూ మా సుట్టు అవుసరాలు దీర్సిన మర్రిసెంబు, యిసుర్రాయి, రోలు, కడెమేసుకుని వుండే రోకలి, కంచుతలెలు, సిర్రె

గోనెలు, గోలీలాటలు, సిల్కలపేర్లు, లాయిలప్పలు, పుంగీలు, పిప్పరమెట్లు, గుడ్డబొమ్మలు, నుల్కమంచాలు, గొంగల్లు, అటికెలు, గుంట గిన్నెలు జూస్తే పానం లేసొస్తది. నేనేనంటే నా బిడ్డ దీపగ్గూడ నా తీరుగనే పాత ఆటలు, పాత వాడుకం వస్తువులు, పాత సినిమాలు, పాత పాటలు, పాత వంటలంటే మస్తు ఇష్టం. దాని చిన్నప్పుడు వస్తువులు మారుకానికి గూడ ఎయ్యనియ్యకపోవు. కుక్కర్‌ ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ ఉందని మార్సెదానికి బోతే ‘అమ్మా యిన్నేండ్లు ఆ కుక్కర్‌ మనకు తొందరగా పప్పు, అన్నం టైముకు అందిచ్చింది, సర్వీస్‌ చేసింది. యిప్పుడట్టా ఏ సెంటిమెంట్‌ లేక వొదిలేస్తవా’ అని బాదపడేది. పాత పేపర్లు, తన సిన్నప్పటి పలక, మొదటి క్లాస్‌ పుస్తకాలను గూడ అమ్మనియ్యలే. ‘అరే యీ పిచ్చేంది బిడ్డా యింటినిండా గీ సెత్తేందే అమ్మేద్దాం, చెత్తకేద్దామంటే వినకపోయేది. బిడ్డా పాణమున్నోల్లకే దిక్కులేదు. తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని వొదిలేస్తున్నరే గీ నోరులేని, పాణంలేని వాటిని ఎవడడిగిండు!’ అని వాదించుకునేది నేను, దీప.
ఈ మధ్య వూరికిబొయి తనకిష్టమైన యిసుర్రాయి, గంప, ఈతసాప తెచ్చుకున్నదని చెప్పింది సంతోషపడుతూ… ‘నేను గొంగడి జాడ దియ్యమన్న తీసుకొచ్చినవా!’ అంటే ‘లేదమ్మా ఆడీడ అడిగిన దొర్కలే… కాని ఎట్లనోకట్లె నీకు గిఫ్ట్‌నిస్తలే… గొంగడి కోసం తిరుగుతాంటె జాబిగాడు గొంగడి పాటను గూడ నేర్సుకుండు’ అని కొడుకును పిల్సింది దీప. ‘వూల్లె నేర్సుకున్న పాట బాడురా’.
‘ఏం పాట రెండు మూడు నేర్సుకున్న జాబీ’ ఏడేండ్లున్న నా బిడ్డె కొడుకు జాబి. వాని పేరు జాబాలి అని పేరు బెడితే… వాడు కూడా నన్ను ‘జాబీ’ అనే పిలుస్తడు. వైస్‌ వర్సా జాబీ పేర్లు మా యిద్దరియి.
‘గొంగడి పాట పాడు’ అన్నది వాల్లమ్మ దీప. అట్లన్నదో లేదో యిట్ల పాటెత్తుకుండు ‘ఆదివారమండీ, బుజమ్మీద గొంగడి అవ్వనేనత్తనే అల్లుడాగమైతడే’ నేను గీడికే నేర్సుకున్న జాబీ అని సెంగున గంతేసి బైటకురికిండు.
పల్లెల మంచిగ జాడదీస్తె బాగుండు గానీ, నేంబొయినపుడు గూడ యెవ్వల్నడిగినా ‘గొంగడా గిప్పుడు యెవలు నేత్తండ్రు బిడ్డ ఎన్నడో మర్సిండ్రు గొంగడిని యిప్పుడు శాన మోటయింది గొంగడంటే…’ అనే మాటలే యిన్న. గిప్పుడు కనుమరుగైంది, కంటికి కానొస్తలేదు గానీ, నా సిన్నప్పుడు గొంగడి లేని యిల్లు లేకుండె. అది పల్లెలకు, మనుషులకు, నాగరికతకు చేసిన సేవ సిన్నదిగాదు. ఎండ, వాన, సలినుంచే గాగు, ఒక గూడులాగ మనిషిని కాపాడిరది. పుట్టిన పిల్లలకు చనిపోయినోల్లకు గొంగడే యేసేది పక్కకు.
పొలంబోయిన రైతుకూలీలకు, రైతులకు, యెడ్లకాసేటోల్లకు, అడివికి కట్టెలకు బొయేటోల్లకు గొంగడి వుంటే యెంతో పుర్సతి. ‘నిప్పులు గురిసే యెండయినా, పిడుగులు పడే వానయినా, తుఫానైనా, గడ్డగట్టే సలైనా గొంగడుంటే సాలు గవేమి సెయ్యవు’ అనే ధీమాగుంటరు. గొంగడి గొర్రెల బొచ్చు నుంచి తయారు జేస్తరు గొల్లలు. దాని హక్కుదారులు వాల్లే. గొంగడి నేసి పల్లెల్ని కాపాడినోల్లు వాల్లే. గొంగడి గొప్పతనం అది జేసిన సేవ అంతా అది నేసిన గొల్లలకే చెందుతది.
గొంగడి లేకుంటె ఎవుసం లేదు. ఎవుసం జేయనీకి ఆడ, మగ, రైతు, రైతు కూలీలు ఎండనీ, వాననీ, చలి అని యింట్లుండరు, ఎట్లున్నా పొలాల సంజేయాలె. పంజేస్తేనే వ్యవసాయం, ఫలసాయం అభివృద్ధి. ఎండ, సలి, వానకు ఎవుసం బందునెడితే, దేశం దేశమంతా ఉపాసంబంటది. దేశానికి గా కరువు రాకుంట వుండనీకి గొంగడి సేసిన సర్వ సాకిరి సిన్నదిగాదు.
వానబడితే, గొంగడిని కప్పుకుంటే ఒక్క సినుకు కారదు, సలికి యెచ్చగుంటది, ఎండదెబ్బ తల్గది, వడదెబ్బ గొట్టది. గొంగడుంటే ఇల్లే అక్కర లేదంటరు, నడిసే ఇల్లు గొంగడంటరు.
గొంగడి నల్లగ, మెత్తగ, నున్నగుంటది. పెండ్లిల గొంగడుండవల్సిందే. గొంగడి లేకుంటే పెండ్లే జరుగకపోయేది. పెండ్లి పిలగాని బుజమ్మీద గొంగడి లేకుంటే పెండ్లే కాకుండేది. పెండ్లీల సెద్దరున్నా లేకపోయినా యెవ్వరు పట్కపడరు, పట్టింపుండది గానీ, పెండ్లి పిలగానికి గొంగడి పెట్టాల్సిందే… ‘గొంగడి లేనోనికి నా బిడ్డనిస్తీ తానెతందాన గొగుపువ్వు’ అనే పాటలుండేయి పల్లెల్ల.
ఆ కులం, ఈ కులం, పెద్ద కులం, సిన్న కులమని లేకుంటా అందరికి గొంగడే దిక్కు. సుట్టమొస్తే మంచమ్మీద గొంగడి పర్సి కూసోబెడితే గొప్ప మర్యాద చేసినట్లు. ఇంట్ల మనిషికో గొంగడి ఉంటే సిరిమంతుల కింద లెక్క. పొద్దంతా యెండకు వానకు కప్పుకునేదానికే కాదు, ఇంటికొచ్చేటప్పుడు కూలిగింజలు మూటగట్టుకొని వచ్చేదానికి గూడ ఆసరయ్యేది గొంగడి. దీనికి ఉతుకుడు సాకిరి గూడ లేదు. ఎండల ఆరేసి బాగా దులిపితే సాలు దుమ్మంత బొయి తాజాగా నల్లగా మెరుస్తది. గట్లా గొంగడి పల్లెలకు ఆర్థిక సంపదనే గాదు సాంస్కృతిక సంపదలో గూడ గొంగడి పనితనం చానా గొప్పది. గంత గొప్ప గొంగడి గిప్పుడు పల్లెల్ల గూడ కనబడుతలేదు. పల్లె జనాల్ని పచ్చపచ్చగ కాపాడిన నల్ల గొంగడి గియ్యాల పల్లెల్ల గూడ కనుమరుగాయె, గిప్పటిపోరలకు సూపిద్దామంటె.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.