ఐక్యతా రాగం మీటింగ్‌లో చర్చించిన అన్ని అంశాలను మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలని మీటింగ్‌లో జరిగిన విషయాల్ని నోట్ చేసుకున్నాను. టైం 10:10 కి మీటింగ్ స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి అందరం పరిచయం చేసుకున్నాము. ఐక్యతా రాగం ఫేజ్ 1, 2 లో
జరిగిన అంశాలను ఒక్కసారి గుర్తుచేసుకొని మనం ఫేజ్ 1, 2కి తయారుచేసిన మెటీరియల్, భూమిక మ్యాగజైన్‌కి రాసిన ఆర్టికల్స్, రాస్తున్న ఆర్టికల్స్ గురించి రమా వేదుల (AJWS)తో షేర్ చేసుకున్నాము. మనం ఐక్యతా రాగంలో నేర్చుకున్న అంశాలను తమ తమ వర్క్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం మరియు ఫీల్డ్‌లో చేసిన ట్రైనింగ్స్ గురించి కూడా ఒక్కొక్కరు వివరించడం జరిగింది. ఈ ట్రైనింగ్స్ చేస్తున్న క్రమంలో వారికి ఎదురవుతున్న సమస్యలు, సవాళ్ళ గురించి చెప్పడం వాటి మీద సందేహాలను మాట్లాడడం జరిగింది.
ఐక్యతా రాగంలో మనం చేసిన రోల్ ప్లేలు, నేర్చుకున్న అంశాల మీద రాయడం, ఒక నాటిక రూపంలో తయారు చేయడం, తయారు చేసిన వాటిని మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్ లో అప్‌లోడ్ చేయడం వల్ల ఇంకా చాలామందికి ఈ సమాచారం చేరుతుందని మాట్లాడుకున్నాం.
ఈ రోజు ముఖ్యంగా ఐక్యతారాగం నుండి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాము. అందులో భాగంగానే ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుతూ పార్టిసిపెంట్స్ ఒక diversity నుంచి రావాలి, రెండు రోజులు ఈవెంట్ ఉండాలి, పాల్గొన్న ప్రతి ఒక్కరు మాట్లాడాలి, యాక్టివిటీస్‌ని ఎంజాయ్ చేసే విధంగా ఉండాలి, ఒక విషయం మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా అవకాశం ఉండాలి. వయస్సు, స్థలం, సమయం, స్థానిక మద్ధతు గురించి కూడా మాట్లాడుతూ ప్రధానంగా ఒకtheme, sub themes and focus గా ఉండాలని చర్చించుకున్నాం. థీమ్ టాపిక్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ చెప్పాలని ఐదు నిమిషాల సమయం మరియు
ఉదాహరణలు కూడా ఇచ్చారు. ఇచ్చిన సమయంలో అందరూ వారి వారి థీమ్‌లను చెప్పారు.
1.Break the Silence
2. Choices
3. Negotiation of choices
4. Marriages
5. Hetero sexual relationship
6. Property rights
7. Political awareness
8.Trafficking
9. Support systems
10. Higher education
11. Friendship
12. Leadership
13. All Media effects on girls & boys
14. Understanding pleasures
పైన తెలిపిన థీమ్‌లను ఒక్కొక్కరు చెప్తున్న క్రమంలో వచ్చిన ప్రశ్నలకు, అనుమానాలకు ప్రశాంతి, రమా వేదుల చాలా వివరంగా ఉదాహరణలతో కూడా వివరించారు.
స్నేహం గురించి టాపిక్ వచ్చినప్పుడు అబ్బాయిలు, అమ్మాయిల స్నేహం మీదనే దృష్టి పెట్టడమా లేక అమ్మాయిల జీవితంలో స్నేహం ఎలా ఉంటుందనే దాని మీదా లేక అమ్మాయిల యొక్క స్నేహం విలువ గురించి మాట్లాడితే ఈ పితృస్వామ్య వ్యవస్థలో పెళ్ళి తర్వాత ఎంత మంది అమ్మాయిలు వాళ్ళ స్నేహితులతో టచ్‌లో ఉన్నారు? పెళ్ళి తర్వాత అన్ని relationships వేరే వేరే దగ్గర నుంచి పరిచయమవుతున్నాయి అనే చర్చ ముందుకు వచ్చింది. ముఖ్యంగా అబ్బాయిలు, అమ్మాయిల స్నేహం వచ్చేసరికి heterosexual relationship అనే అంశాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది. కానీ స్నేహంలో ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు సెక్స్‌ని ఒక్కటే కోరుకుంటున్నారని ఎలా ఊహిస్తారు. అని మాట్లాడటం జరిగింది.
ప్రేమ సంబంధాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు ప్రేమికులు కొన్ని రోజులు లేక కొన్ని సంవత్సరాలు ప్రేమలో కలిసి ఉన్నా కూడా ఆ ప్రేమలో ఎప్పుడైనా ఒకరికి ఒకరు నచ్చనప్పుడు విడిపోవడం అనే టాపిక్ వచ్చినప్పుడు ప్రేమ అనేది ఒక్కరి మీదనే శాశ్వతంగా ఉండాలా! అలా ఉంటేనే అది ఒక మంచి సంబంధం అవుతుందా! ఒక మంచి సంబంధానికి కావలసిన లక్షణాలు ఏంటి? కానీ వారి వారి ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు కదా మారుతూ ఉంటాయి. అలా మార్పు వచ్చినప్పుడు మన సంబంధాలలో కూడా మార్పు వస్తుంది, కానీ అలా వచ్చిన మార్పుల్ని మనం ఎందుకు అంగీకరించలేకపోతున్నాం, అలాగే మన సమాజాన్ని కూడా ఒక చిహ్నంగా చూపిస్తున్నాం. ఇరువురు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు ఎవరికి నచ్చకపోయినా వారు ఆ సంబంధం నుండి స్వేచ్ఛగా బయటికి రావడానికి వచ్చే అడ్డంకులు ఏంటి అని, వారు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే స్వేచ్ఛ వారికి ఉంటే వారు బయటకు రాలేరా అనే సందేహం కలుగుతోంది. ఒక సంబంధం నుంచి బయటకు రావాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే ఆ సంబంధం వారి ఇరువురిలో ఒకరికి నచ్చకపోవడం లేదా ఇద్దరికీ నచ్చకపోవడమే కదా. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తులు విడిపోయిన తర్వాత ఎలాంటి ఆందోళనలకు, బాధలకు గురవుతారు అనే చర్చ కూడా వచ్చి కొంచెం ఆలోచింపచేసింది.
పైన పేర్కొన్న థీమ్‌లను చర్చిస్తున్న క్రమంలో వాటిలో కొన్నింటినిsub themes గా కొన్ని మెయిన్ themes గా తీసుకున్నాం. break the silence ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు. పెళ్ళి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ ఇలా చాలా విషయాల్లో వాళ్ళు ఈ నిశ్శబ్దాన్ని ఎందుకు ఛేదించలేకపోతున్నారు. ఎవరు వీరిని అడ్డుకుంటున్నారు, వీరి ఆలోచనలకు స్వతంత్రమైన పూర్తి స్వేచ్ఛ లేదా, వీరి విషయాల్లో ప్రతిదీ వాళ్ళ పెద్దవాళ్ళు చేసేదే సరైన నిర్ణయాధికారమా? అలా తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ అమ్మాయిల జీవితాల్ని సంతోషంగా వారికి నచ్చినట్లు ఉంచగలుగుతున్నాయా? ఎందుకు వారి జీవితాలు ఒకరి చేతుల్లో ఎప్పుడూ బందీలుగా ఉండాలా?
pleasure గురించి మాట్లాడగానే మొదటగా చాలామందికి గుర్తుకు వచ్చే విషయం సెక్సువల్ pleasure అని కానీ pleasure అంటే అది ఒక్కటే కాదు. పైన పేర్కొన్న అన్ని అంశాల్లో కూడా pleasure ఉంది. అమ్మాయిలు చిన్న చిన్న సంతోషాలను కూడా పొందలేకపోతున్నారు. సైకిల్ తొక్కడం కానీ, బైక్ నడపడం, నచ్చిన డ్రెస్ వేసుకోవడంలో, స్నేహితులతో బయటకు వెళ్ళడంలో ఇలా చాలా విషయాలలో అమ్మాయిలను మాత్రమే ఎందుకు కట్టడి చేస్తున్నారు. వాళ్ళు ఒంటరిగా బయటకు వెళ్తే ఎవరైనా ఏమైనా చేస్తారనే భయాన్ని ముందే వాళ్ళమీద పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎవరు ఎవర్ని కట్డడి చేస్తున్నారు, ఇలా చేయడం వల్ల వాళ్ళను మానసిక అనారోగ్యాలకు గురిచేస్తున్నారని గ్రహించలేక పోతున్నారు. అమ్మాయిలకు వారి శరీరం మీద వారిదే కదా పూర్తి హక్కు. కానీ ఈ పితృస్వామ్య భావజాలంలో ఉన్నవారు అమ్మాయిలకు సంతోషాన్ని ఇచ్చే పూర్తి స్వేచ్ఛను వదిలేయగలరా… అలా వదిలేస్తే అమ్మాయిలు వాళ్ళ సంతోషాల్ని పొందే క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతున్నారని, అలాగే ముఖ్యంగా వీరు గుర్తించే విషయం ఏంటంటే అమ్మాయిలకు గర్భం వస్తే ఎలా? అది పెళ్ళికి ముందే రావడం వల్ల కుటుంబ పరువు ఈ పితృస్వామ్య వ్యవస్థలో పూర్తిగా పోతుంది, సమాజంలో గౌరవంగా తలెత్తుకొని ఎలా ఉండగలం అని అడుగుతారు. కానీ నిజానికి అమ్మాయిలను అంత చులకనగా చూసేవారే ఈ తప్పులు చేస్తున్నారు. అమ్మాయిలు నా శరీరం నాది అని నిర్ణయించుకున్నాక దానిమీద సర్వహక్కులు వారికే చెందుతాయి. ఆమె ఒక్కసారి ఏ విషయంలోనైనా వద్దు అని చెప్పిందంటే వద్దనే అర్థం, కానీ ఆ మాటని గౌరవించేవారు ఎంతమంది మన సమాజంలో ఉన్నారు.