బరువెక్కిన మేఘం – జి.శ్యామల

శిన్న వయసుల బొమ్మరిల్లు గట్టి ఆడుతుండంగనే లగ్గం జేషిర్రు శిన్న శిన్న సంబురాలు గోల్పోతున్న అని తెలిసి కూడా మౌనంగా బుగులు మోషిన…
ఆటలాడే వయసులనే బిడ్డలను మోషిన… తాగిన మొగుడు కొట్టిన బాధలు మోషిన… కాపాడుకుంటా అనే మాట మర్షిపోయి నమ్మకాన్ని మట్టు వెట్టిన నరకం మోషిన…

బయటకొచ్చిన కొడుకు ప్రేమ పదేంన్లే అయితే నాకు ప్రాప్తం లేదని గుండెల నిండా కమ్ముకున్న దుఃఖాన్ని మోషినా… మాయదారి రోగాన్ని పైసతో కొడ్తరందెల్వకపాయె ఎన్నడూ ఏం ఎనకేసుకోలే అని కొడుకును మింగిన కాన్సర్‌ రోగాన్ని గొట్టే శక్తిని నాకు దేవుడియ్యలే అని కుమిలి కుమిలి ఏడ్షిన కన్నీళ్ళు ఇంకిపోయిన బండెడు వ్యతను మోషినా…
వాడు పోయాక జీవితం వృధా అని క్షణం ఒక యుగంగా బతుకు నిండా నరకాన్ని మోషినా…
కాలం గడుస్తుంటే ఒక ఆడబిడ్డను గన్న
దాన్నైనా మంచిగ్గాపాడాలని, అయిన పని కాని పని యేసుకుంటా రూపాయి రూపాయి పోగుజేష్న
అది జర వెరిగే వరకే తాగువోతు మొగడు కాలం జేశిండు
‘‘పీడ వాశిన ఆనందమో తోడు వాశిన నరకమో ఏం అర్థంగాని మౌనం గుండె మీద కుంపటి లెక్క మోషినా…’’
తొడవుట్టిన తోడు ఎవళ్ళేరు నాకు, అయ్యా అవ్వ ఆనికి కట్టవెట్టినంక నేను ఉన్నన్నో లేనో అని కూడా సూడలే, కన్నోళ్ళకి నేస్కోని పాపిష్టిదాన్నని చెయ్యని పాపాన్ని మోషిన…
ఆగని కాలంతో పరుగులు దీశిన…
బిడ్డ పెద్దది అయింది, సంతోషంతో దాని నొసట బొట్టువెడ్తా అనుకున్న ‘‘ఉండి ఏం ఉద్ధరియ్యని మొగడు సచ్చినంక గూడ నన్ను సాధిస్తుండు’’ అని పాణం నీళ్ళైతే చేతులకి వడ్డ ఊరి గోస మోషిన… దాన్ని సాధివిపియాలే అని మస్తుగా కళలు గన్న కానీ లోకం తీరు జూషి భయపడ్డ. దాన్ని కంట్లే వత్తేస్కోని వెంచిన ఏడికి దోళ్తే ఏం అయితదో దెల్వది ఆడదాని బతుకు అరటాకు చందం నాకున్నది అదొక్కతే అని నెత్తిల మోషిన… మంచి దొరోళ్ళ పిల్లగాడు బంగారం లెక్క మెరిసే నా బిడ్డను మెచ్చిండు. పెండ్లి జేత్తవ అనడిగిండు నాకు నోట మాట రాలే తాకత్తి మించిన సుట్టీర్కం అని భయపడ్డ…
మల్ల మదిల ముల్లు లెక్క కొడుకు యాదికచ్చిండు, గానాడు గివ్వే పైసలు ఉన్నోనికి నన్ను మా అయ్యా అవ్వ దారావోత్తే వాడు ఎదిగి నన్ను సూడాకపోవా అని కండ్ల నీళ్ళు వరదలైనై. నా బిడ్డకు బతుకు ఎన్నడు భారంగావద్దు అని గిన్ని కష్టాలు దానికి వద్దని బిడ్డ తోటి గలిపి ఉన్న కాడికి అల్లునికి ఇచ్చిన, తల దాస్కొనికి ఒక శెట్టు కింద గుడిషె గప్పిన శెట్టు మీదున్న పిట్టలో, ఉడుతలో అప్పుడప్పుడు పలకరిస్తాయ్‌ అని అనుకున్నగని అవే తోడుండే బిడ్డలు అయితయ్‌ అనుకోలే. ఇగ తిన్నంక పారావోషె అంట్లు, ఎవలన్న దయతో ఇచ్చిన నూకలు, పప్పులు ఇసిరేత్తే గుడిషె సుట్టు సంబురంగా తిరుగాడుతుండె అవ్విటిని జూస్కుంట జర మనసు అల్కగవు.
బిడ్డను బంగారం లెక్క సాదిన అని మురిషిపోయిన కానీ దానికి నా మీద ప్రేమ ఎంత ఉందని ఎన్నడూ యోచన చెయ్యలేదు. ఒంటరిదాన్ని అయిన ‘‘బిడ్డున్న గొడ్డు లెక్క అయింది నా బతుకు’’ అనుకుంట గంపెడు దుఃఖం గొడ్డు లెక్క మోషిన. ఐదేండ్లు అయినయ్‌ ఒక్కనాడు కూడా గుడిషెకు రాలే అల్లునికి నామోషి అయితది అని తల్లిని మర్షిపోయింది. కానీ సుఖం దక్కింది మొదటి కాన్పులనే కొడుకు పుట్టిండు నా కొడుకే మళ్ళా పుట్టిండు అనుకున్న. బండెడు చాకిరీ భారం అనక అంన్లనే నా సంతోషం సూస్కున్న. ఇట్టన్న కొన్ని దినాలు బిడ్డ దగ్గర ఉన్న అని నిమ్మళం లేని మనసుకి సర్ది చెప్పుకున్న అయినా పరాయి ఇల్లే అనే భారాన్ని అడుగడుగునా మోషిన… నా మన్మడు ఇప్పుడు మూడేండ్లోడు. అప్పుడు వానికి అమ్మమ్మ సేవ చేస్తుంది అనే ఊహ కూడా దెల్వది తెల్తే వాడు అమ్మమ్మ అని వత్తుండెనేమో అయినా ‘‘నా పిచ్చిగని వాన్నెట్ల రానిత్తరు ఇన్నెండ్లల్ల నా బిడ్డనే దోలలె నా అల్లుడు కూడా ఒక్కసారన్నా అత్తమ్మ అని పిల్వలే తాకత్‌కి మించినోళ్ళు అని ముందుగాల్నే తెల్సు గదా కొత్తగా ఏం బాధ అన్పియలే’’.
పొద్దున ఎందుకో నా బిడ్డ నా అల్లుడు నా మన్మడు నా గుడిషెకు వచ్చిర్రు. బిడ్డ బాగా ఏడుత్తుంది మన్మడు భయం భయంగా దూరం వోతుంటే అల్లుడు ఊకోవెట్టుకుంట ఎత్తుకొని బైటకి వోయిండు. ఏమైంది బిడ్డ అని ఎందుకు ఏడ్తున్నావ్‌ అని తల్లడిల్లుకుంటా మస్తు ఒర్రుతున్న కండ్ల నీళ్ళు తుడుత్తున్న అయినా ఒకటే ఏడుపు. నా అల్లుడన్న ఊకోవెడ్తడని బైటకి వచ్చి యూషిన ఆయన మీద గౌరవంతో మాట బైటకి వస్తలేదు. పెద్దింటోడు కదా మన్మన్ని అయినా ఎత్తుకుని ముద్దాడ్త అని చేతులు చాచిన వాడు నా మొఖం కూడా సూత్తలేడు పుట్టి బుద్ధి ఎరిగినంక వాడు నన్ను ఇదే తొలిసారి చూడడం. ఇప్పుడే రాడని ఊకున్న మళ్ళా మనసునవట్టక బిడ్డ దగ్గరికే పోయిన అది ఏడుపు అప్తలేదు. దాని ఏడుపుకి సుట్టు పక్కోళ్ళు కూడా గుడిషె ముంగట జమయిర్రు. బిడ్డ క్షమించు అమ్మా క్షమించు అమ్మా అని గుండెలు బాదుకుంటే నా పాణం వోతున్నట్టు అన్పిత్తుంది ఆ ఆవేదన ఇని వచ్చినోళ్ళు కూడా కండ్లు తడుపుకుంటున్నారు. రోజొచ్చే ఉడుతలు ఇయ్యాల రాలే, పక్షులు కుయ్యలే అసలు చెట్టు మీద ఏం లేవు వీళ్ళ ఏడుపులకి పారిపోయినయ్‌ సరే ఏం యాదికి వచ్చిందో నా బిడ్డకు అర్థమైతలేదు. కానీ దానికి ఏడిషీ ఏడిషీ ఎక్కిళ్ళు వట్టినయి నీళ్ళు తెస్తా అని లేశిన కుండల నీళ్ళు ముంచవోయిన గిలాస చేతికి వస్తలేదు. నాలుగైదుసార్లు గిట్లే అయింది. నాకేమైందో దెల్వక బైటకు చూస్తున్న నాకు భగవంతుని దివ్య రూపం కనవడ్డది.
నాతోని గిట్లన్నడు మస్తు కష్టాలు ఎల్లదిషినవ్‌ బిడ్డ వేడెక్కిన సముద్రం నీళ్ళను మేఘం మోషినట్టు కురవని వాన లెక్క బతుకు మొత్తం బండెడు బాధలు మోషినవ్‌ ఇగవోదాం బిడ్డ అన్నడు, గప్పుడే అర్థమైంది నేను సచ్చిపోయిన అని. పెళ్ళైనంక ఇప్పుడే నవ్విన నేను ఆ నవ్వు మాయం కాకముందే నా బిడ్డ సక్కగా, సల్లగా, సంతోషంగా బత్కాలే అనుకుంట ఆ వెలుతురులోకి పోతుండగానే నా ఆత్మ దేవునిలో కలిసిపోయింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.