ఏది శిలా? ఏది వల? -పి. ప్రశాంతి

దసరా పండుగ ఇంకో రెండు రోజుల్లో ఉంది. ఊరంతా సందడిగా ఉంది. ప్రతి ఇల్లూ హడావిడిగా కనిపిస్తోంది. ఇంట్లో సామాన్లన్నీ శుభ్రం చేయడం, మరీ ముఖ్యంగా పండగలకి, పబ్బాలకి ఉపయోగించే ఇత్తడి, రాగి పాత్రలని అటకమీద నుంచి దించి, మెరిసేలా తోమి ఎండకి ఆరబెట్టి

చూసుకుని చూసుకుని మురిసిపోతున్నారు. ఇలాం టివి చిన్నా చితకా కలిపి పదికి మించి
ఉండవు. కాని అవి ఒక తరం నుంచి ఇంకో తరానికి వారసత్వంగా వచ్చే పాత్రలు, అందుకే అపురూపం.
ఆ చిన్ని ఆదివాసీ గ్రామంలో ప్రతి కుటుంబం ఇంకో కుటుంబానికి బంధువులే. ఎవరింట్లో ఏం జరిగినా అందరూ కూడతారు. మంచికి, చెడుకి ఒకరితో ఒకరు సంప్రదించుకునే చేస్తారు. ఇప్పుడు కూడా ఏ రోజు సంబరం జరుపుకోవాలో అందరూ కలిసే అనుకున్నారు. పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి. బైటికి నిర్మానుష్యంగా కనబడు తున్న ఊరు లోలోపల మాత్రం సందడిగా ఉంది.
ఆ ఊరికి పెద్దమనిషి రామిరెడ్డి. ఆయన మాట అందరికీ శిరోధార్యం. దాదాపుగా 70 ఏళ్ళుండే రామిరెడ్డి ఊరందరికీ వైద్యుడు కూడా. ఇంటి ముందు కూర్చుని వెదురుబుట్ట అల్లుతున్న రామిరెడ్డి ఉన్న ట్టుండి ట్రాన్స్‌లోకి వెళ్ళినట్లు బుట్ట పట్టుకుని అలాగే అచేతనంగా ఉండిపోయాడు. ఎదురుగా అంత దూరంలో తడక అల్లుతున్న ముత్యంరెడ్డి తన మాటకి బదులు రాలేదేంటా అని రామిరెడ్డిని చూస్తూ మామా అని పిలిచాడు. రామిరెడ్డి అధాటుగా లేచి ఊగిపోతూ బుట్ట విసిరేసి ‘అమ్మ వచ్చింది. ముత్యాలమ్మ వచ్చింది. పిలుస్తాంది. ఎక్కడ… ఎక్కడ’ అంటూ అక్కడక్కడే అటూ ఇటూ చిందులేశాడు. ఎటెళ్ళాలో తెలియనట్టు నిలబడిపోయి నిశ్చలంగా ఆకాశం వైపు చేతులెత్తి శూన్యంలోకి చూస్తూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ వెంటనే వడివడిగా పాకల మధ్య సందుల్లోంచి ఒక ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ వసారాలో ఈతాకుల చాప మీద పడుకునున్న 12 ఏళ్ళ గౌతమి దగ్గరకెళ్ళి నిలబడ్డాడు. అప్పుడే నిప్పులు తెచ్చి వేపాకు, సాంబ్రాణి పొగ వేస్తున్న గౌతమి తల్లి రేవతి అతన్ని చూసి ఆగిపోయింది. రామిరెడ్డి లోగొంతుకతో ‘నాకు చెప్పలేదే’ అంటూ గౌతమి పక్కనే కూర్చున్నాడు.
గౌతమి ఒళ్ళంతా జ్వర తీవ్రతతో అదురు తోంది. పక్కన కూర్చున్న రామిరెడ్డికి కూడా వేడి సెగ తెలుస్తోంది. చూస్తుండగానే గౌతమి శరీరం మీద అక్కడక్కడా సన్నగా ఎర్రగా పొక్కులు లేచాయి. ‘తల్లీ…’ అని అర్ద్రంగా అంటూ దణ్ణం పెడ్తున్న రామిరెడ్డిని చూసి ఏదో స్ఫురించినట్టు రేవతి గబగబా వీథిలో ఉన్న వేపచెట్టు దగ్గరకొచ్చి కొమ్మలు విరిచి పట్టుకెళ్ళింది. మెరిసేలా తోమి పెట్టిన రాగి కడవలో పసుపు కలిపిన నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టింది. అంతలో అక్కడికి చుట్టుపక్కల వారు పదిమంది దాకా వచ్చారు. ఒకరు తేనె తెచ్చారు. ఇంకొకరు చెట్టు మీంచి దించిన జీలుగ కల్లు కుండ తెచ్చారు. ఇంకొకరు దోసెడు భూతులసి రెమ్మలు తెచ్చారు. మరొకరు ఇప్ప సారా, మాగిన ఇప్పపూలు తెచ్చారు. నీలపురెడ్డి తట్టతో మెత్తటి మట్టి తెచ్చాడు. ఇంతలో రామిరెడ్డి వేపాకు మండలు తీసుకుని పసుపు నీళ్ళలో ముంచి గౌతమి చుట్టూ చల్లడంతో పాటు ఆమె శరీరానికి గాలి తగిలేలా ఆ కొమ్మలతో చిన్నగా విసురుతూ కూర్చున్నాడు. అప్పటికిక ఊరంతా తెలిసిపోయి ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. ఇక ఇప్పుడు పండగ లేదని, ఊరికి ఏదో ఉపద్రవం వచ్చిందని అందరూ గుసగుసగా అనుకుంటున్నారు. దాదాపు ఊరంతా అక్కడికి చేరింది.
సన్నటి లోస్వరంతో కళ్ళు మూసుకుని ముత్యా లమ్మని ప్రార్ధిస్తున్న రామిరెడ్డి కళ్ళు తెరవకుండానే ‘అమ్మతల్లిని ఎవరో ముట్టారు. తప్పు చేశారు’ అంటూ లేచి నిల్చున్నాడు. గాభరాగా ఊరికి తూర్పున వంద ఫర్లాంగుల దూరంలో వాగు ఒడ్డున బాట పక్కగా ఉన్న ముత్యాలమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఐదారుగురు తప్పించి మగవారంతా వెనకే వెళ్ళారు. ముత్యాలమ్మ ఉండాల్సిన చోట పెద్ద గొయ్యుంది. అక్కడికొచ్చిన అందరూ గందరగోళంగా మాట్లాడుకుంటూ, కొంచెం దూరంగా చెట్ల కింద కూర్చున్న వారి దగ్గరకెళ్ళారు. యువకులు కొందరు వాళ్ళని పట్టుకుని ‘రోడ్డేస్తామని మీరు చూపించిన చోటేంటి, మీరు చేసిందేంటి? ముత్యాలమ్మని పెరుకుతారా?’ అని రోషంగా కొట్టడానికెళ్ళారు. వాళ్ళు బెదురు కుంటూ దణ్ణం పెట్టి ‘ఆ బండ ముత్యాలమ్మని మాకు తెలవదు, కాంట్రాక్టరు చెప్పాడని రోడ్డు అంచు చక్కగా రాదని జెసిబితో ఆ బండని పెకిలించాడు. అందుకేనేమో తిక్కతిక్కగా మాట్లాడుకుంటూ బాలేదని ఎల్లిపోయాడు’ అని పరిగెత్తుకెళ్ళి ఆ బండకి మొక్కారు.
అందరూ కలిసి ఆ శిలని తిరిగి యధాస్థానానికి దొర్లించాలని చూశారు. అది కదలక కష్టపడుతు న్నంతలో రామిరెడ్డి వాళ్ళని వారించి ‘అక్కడే
ఉండనివ్వండి. అమ్మని చల్లబరచాలి’ అనేసరికి వెనక్కి వచ్చి తాటాకులతో దొన్నెలు చేసి వాగులోంచి
నీళ్ళు తెచ్చి పోశారు. కల్లు, ఇప్పసారా తెచ్చి నివేదన చేశారు. నల్లటి ఆ రాయి నిగనిగలాడడమే కాక ఒక పారదర్శకతతో కూడిన సన్నటి వెలుగు కనిపిస్తోంది. ఇక పండగ ఆగదని వారిలో సంబరం.
అందరికీ తెలిసిన కథే అయినా రామిరెడ్డి మళ్ళొకసారి ఆ శిల చరిత్ర చెప్పాడు. ఆయన ముత్తాతల తాతల నాడు కరువొచ్చి పోడు పండలే దంట. అడవిలో కూడా ఏమీ దొరకలేదంట. ఆకలికి జనం చచ్చిపోయారంట. ఎలకల్ని పట్టి తిని రాళ్ళల్లో నీళ్ళు తాగి బతికినవారు బతికారంట. ఒకనాడు రెండో జాములో అడవిలో కుందేళ్ళ వేటకెళ్ళిన వారికి పెద్ద వెలుగుతో పాటు దూసు కొచ్చి ఇక్కడ ఏదో పడ్డట్టు పెద్ద శబ్దం వచ్చిందంట. అక్కడున్న చెట్లు తగలబడ్డాయంట. భయపడిపోయి వారు అడవిలోనే దాక్కున్నారంట. ఊర్లో వారు దడుచుకుని బాగా తెల్లారేదాకా ఎవరూ బైటికి రాలేదంట. పొద్దొక్కేసరికి చుట్టుపక్కల ఊళ్ళవారు కూడా వచ్చి ఏమైందని అడిగారంట. అందరూ కలిసి గుంపుగా వెళ్ళి వెతికితే అక్కడ ఈ శిల నల్లగా మెరుస్తూ ఉందంట. దాన్నుంచి ఇంకా సెగలొ స్తుంటే అందరూ కలిసి అమ్మతల్లే ఆకాశం నుంచి తమ కోసం వచ్చిందని మొక్కి కల్లు, సారా, వాగు నీళ్ళతో చల్లబరిచారంట. ఆ తర్వాతెప్పుడూ వారికి తిండి లేకుండా లేదంట. దాంతో గొప్ప తల్లి అని, చల్లగా చూస్తుందని నమ్ముతారు. ఇప్పుడు ఆ శిలని కదిపినందుకే గౌతమి మీదకి వచ్చి బాధని చెప్పిందని, అమ్మని శాంతింప చేస్తే ఊరికిక భయం ఉండదని అందరూ ప్రార్థించారు. అంతేకాక రోడ్డు పేరుతో ఇలాంటి పనులు చేస్తే ఊరుకోం అని గట్టిగా చెప్పారు.
అమాయకమైన ఆ ఆదివాసీలు ఉల్కాపాతంతో వచ్చిపడ్డ ఆ శిలని దేవత అని నమ్మి పూజిస్తున్నం దుకు అది ఎవరి బారిన పడకుండా మిగిలింది. ఇలాంటి శిలల కోసం తిరిగే వారికి ఎప్పటికైనా దొరికే అవకాశం లేకపోలేదు. ఆ ఆదివాసీల సాంప్రదాయం ప్రకారం ఈ కథ ఊరికి పరిమితమ వ్వాలన్న కట్టడి ఉంది కనుక ప్రచారంలోకి రాలేదు. అది కూడా మంచిదే అయ్యింది, దానివల్లే అది ఆ ఊరికే పరిమితమైంది.
రామిరెడ్డికి ఏదో జరుగుతోందని అనిపించడం, గౌతమికి తట్టు పోయడం, అప్పుడే అమ్మతల్లిగా నమ్మే గుండును పెకిలించడం… ఇవన్నీ యాదృచ్ఛి కమే కావచ్చు. కానీ ఆ ప్రకృతి బిడ్డలకి అదే గట్టి నమ్మకం. బయటి ప్రపంచం దీన్నే ‘సిక్త్స్‌ సెన్స్‌’గా, అది గొప్ప శక్తిగా చెప్తుంది. కానీ ఈ ఆదివాసీలది మూఢనమ్మకం అంటుంది. ఏది నిజం అనే వాదన లోకి వెళ్ళకపోతే నగరాల్లో ప్రచారమే ఆదాయానికి మార్గంగా మారిన గుళ్ళూ, గోపురాలకి ఈ ఆది వాసీల ఆరు బయట ఉండే అమ్మతల్లులకి ఎంత తేడా! భక్తి పేరున, వలేసి దండుకునే ఆ గుళ్ళు నాగరికులవంట, శ్రద్ధతో సేవించే ఈ గుండ్లు అనాగరికులవట!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.