వలసాంధ్రలో ముమ్మరంగా సాగిన సంఘ సంస్కరణోద్యమానికి హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ప్రశంసనీయమైన సేవలందించారు. వారూ స్త్రీల కోసం పత్రికలు ప్రారంభించారు. వాటిలో ప్రముఖమైనది ‘వివేకవతి’. అయితే వలసాంధ్రలోని తెలుగు మహిళా పత్రికారంగ చరిత్రలో ఈ పత్రికకు న్యాయంగా దక్కాల్సినంత స్థానం దక్కలేదు. కొంతమందైతే అసలీ పత్రికంటూ
ఒకటుండిరదనే విషయం కూడా ప్రస్తావించకుండా వ్యాసాలు రాసిపడేస్తుంటారు. సమాజంలో అంచులకు నెట్టివేయబడ్డ ప్రజల్ని గట్టిగా పట్టించుకున్నట్టే పరిశోధనల్లో ఉపేక్షకు గురైన ‘వివేకవతి’ లాంటి పత్రికల్నీ పట్టించుకోవాలి. ఆ దిశలో చేసిన ఒక చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.
మద్రాసులోని ‘క్రైస్తవ విద్యాభివర్ధనీ సమాజము’ ‘వివేకవతి’ని ప్రచురించింది. అక్టోబరు 1909లో ప్రారంభమైన ‘వివేకవతి’ (ఇప్పటి వరకు దొరికిన ఆధారాల ప్రకారం) 1934 దాకా చాలా కాలమే కొనసాగింది. మిగతా స్త్రీల పత్రికల్లా మధ్యమధ్యలో ఆగిపోలేదు. నిA ్‌వశ్రీబస్త్రబ వీశీఅ్‌ష్ట్రశ్రీవ వీaస్త్రaఓఱఅవ టశీతీ ్‌ష్ట్రవ నశీఎవు అని ఇంగ్లిషులోనూ, ‘‘వివేకవతి స్త్రీలు చదువఁదగిన నానా విషయములను ప్రస్తావించునొక మాస పత్రిక’’ అని తెలుగులోనూ యిచ్చేవారు. పత్రిక లక్ష్యాలను వివరిస్తూ మాస్ట్‌హెడ్ కింద ఉత్పలమాలలో ఒక పద్యాన్ని ప్రచురించేవారు. దాని కింద ‘‘గుణవతియయిన స్త్రీ ముత్యము కంటె నమూల్యమయినది’’ అనే బైబిల్ సూక్తిని ముద్రించేవారు. (‘పరిశుద్ధ గ్రంథము’లో ఇలా వుంది: ‘‘గుణవతిjైున భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయునుగాని కీడేమియు చేయదు. ఆమె గొఱ్ఱె బొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులార వాటితో పని చేయును …. ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనము సిద్ధపరచును. … దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. … జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. చాలమంది కుమార్తెలు పతివ్రతా ధర్మముననుసరించి యున్నారు గాని వారందరిని నీవు మించిన దానవు, అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. …’’ (బైబిలు సొసైటీ ఆఫ్ ఇండియా, బెంగులూరు, పు. 554 ` 555).
‘వివేకవతి’కి వివిధ కాలాల్లో పలువురు క్రైస్తవ స్త్రీలు సంపాదకులుగా వుండినారు. మిస్. మెక్‌లారిన్ (వీఱంం. వీషూaబతీఱఅ) మొదటి సంపాదకురాలు. ఆమె కృష్ణా జిల్లా ఉయ్యూరులో నివసించేవారు. శ్రీకాకుళంలో నివసించిన ఆర్చిబాల్డు మిస్మమ్మగారు (ఫోటో చూడగలరు) అక్టోబరు 1910 సం॥ నుండి 18 ఆగష్టు 1913 సం॥ దాకా సంపాదకత్వం వహించారు. (ఈమె అనారోగ్య కారణాల వల్ల కెనడా వెళ్ళిపోయారు). తర్వాత గుంటూరులో నివసించిన ‘‘మెకాలి అమ్మగారు’’ (వీతీం. వీషజaబశ్రీవవ) చాలాకాలం పాటు సంపాదకత్వం వహించారు. తదుపరి సంవత్సరాల్లో ఉత్తర ఆర్కాటు జిల్లాలోని తిరువత్తూరులో నివసించిన శ్రీనివాస బి.ఏ., ఎల్.టి. ‘‘అమ్మగారు’’ సంపాదకులుగా వుండినారు. పత్రికను ‘‘వివేకవతి కమిటీ’’ నిర్వహించేది. ఈ కమిటీలో చాలా కాలం వరకు పది మందికి తక్కువ కాకుండా సభ్యులుండేవారు. దాదాపుగా అందరూ స్త్రీలే. (రెవరెండు డి. అనంతముగారి లాంటి ఒకరిద్దరే పురుషులు). ఎక్కువ మంది విదేశీ క్రైస్తవులు. ఒకరిద్దరు భారతీయ క్రైస్తవులు. కమిటీ సభ్యుల్లో దాదాపు సగం మంది ‘‘అమ్మ’’గార్లుÑ సగం మంది ‘‘మిస్సమ్మ’’గార్లు. 1912 అక్టోబరు సంచికలో ప్రచురించబడ్డ ‘‘వివేకవతి కమిటీ’’ సభ్యులు: స్టీఫెన్‌సన్ అమ్మగారు (గుత్తి)Ñ సత్యనాథన్ అమ్మగారు (పిఠాపురము)Ñ హెన్‌స్మన్ అమ్మగారు (చెన్నపట్టణము)Ñ లాజరస్ అమ్మగారు (వాల్తేరు)Ñ జోషీ అమ్మగారు (రామచంద్రపురము)Ñ కెయిన్ అమ్మగారు (దుమ్ముగూడెము)Ñ మెక్కాలీ అమ్మగారు (గుంటూరు)Ñ ఆర్చిబాల్డు మిస్సమ్మగారు (శ్రీకాకుళము)Ñ బుల్లార్డు మిస్సమ్మగారు (కావలి)Ñ సిమ్మొన్స్ మిస్సమ్మగారు (జమ్మలమడుగు)Ñ ఫీయర్ మిస్సమ్మగారు (జమ్మలమడుగు)Ñ డాక్టర్ హార్ట్ మిస్సమ్మగారు (మదనపల్లి)Ñ హేర్ మిస్సమ్మగారు (సికందరాబాదు)Ñ పార్కర్ మిస్సమ్మగారు (ఈ దేశములో లేరు)Ñ స్ట్రింగ్ఫెల్లో మిస్సమ్మగారు (ఈ దేశములో లేరు). కమిటీ సభ్యుల మధ్య స్పష్టమైన బౌద్ధిక శ్రమ విభజన ఉండేది. కొంతమంది సభ్యులు రకరకాల కాలమ్స్ నిర్వహించేవారు. ఇలా ఒక స్త్రీల పత్రికని ఒక కమిటీ నిర్వహించడమనేది అప్పటికి ఒక కొత్త పద్ధతి.
‘వివేకవతి’లో 32 పుటలుండేవి. 1920 ప్రాంతంలో పుటల సఖ్య 24కు తగ్గింది. తపాలా ఖర్చుతో కలుపుకొని సంవత్సర చందా 12 అణాలుÑ విడి ప్రతి వెల ఒక అణా. మొదటి నుంచి చివరి దాకా పత్రిక ధరలో మార్పేమీ లేదు. పత్రిక ప్రారంభమైన సంవత్సరాంతానికి (అక్టోబరు 1910) కేవలం 300 మందే వుండినప్పటికీ, ఫిబ్రవరి 1913 కల్లా చందాదారుల సంఖ్య 1,400కు పెరిగింది. అక్టోబరు 1913 నాటికి 1,500 మంది చందాదారులుండినారు. ఈ విధంగా చందాదారుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూపోయింది. ‘‘ఈ నాలుగేండ్లలో నీ పత్రిక యధికాభివృద్ధి జెందెను. అనేకులు వ్యాసములు వ్రాసి విశేషముగా బంపియున్నారు. ఇంక ననేకులు చందాదారులైరి. తెలుగుదేశమంతటను దీని విషయమై యధికాసక్తిని గనుపరచుచున్నా’’రని సంపాదకురాలు సంతోషంతో పత్రిక అభివృద్ధిని తెలియబరచారు (అక్టోబరు 1913, పు. 2). బర్మా మొదలైన సుదూర ప్రాంతాలకు కూడా పత్రిక చేరేది.
‘వివేకవతి’ చూడటానికి చాలా`చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేది. అట్టపై ఎడమ చేతిలో తెరిచిన ఒక పుస్తకాన్ని పట్టుకొని హుందాగా నిలబడ్డ స్త్రీ బొమ్మని ముద్రించేవారు. పత్రిక కోసం చాలా నాణ్యమైన కాగితం వాడేవారు: వలసాంధ్రలో వెలువడ్డ ఏ స్త్రీల పత్రికలోనూ యింత నాణ్యమైన కాగితాన్ని వాడలేదు. నాణ్యతలోనే కాకుండా, పేరు విషయంలో కూడా ‘వివేకవతి’ మిగతా స్త్రీల పత్రికల కన్నా భిన్నమైనది: విశిష్టమైనది. మత అస్తిత్వాలనూ (‘హిందూసుందరి’), హిందూ పతివ్రతలనూ (‘సావితి’, ‘అనసూయ’), ప్రాంతీయ అస్తిత్వాలనూ (‘ఆంధ్రలక్ష్మి’, ‘ఆంధ్రమహిళ’) స్ఫురింపజేసేలా స్త్రీల పత్రికలకు పేర్లు పెట్టిన చారిత్రక సందర్భంలో ‘వివేకవతి’ అని వివేకాన్ని చాటిచెప్పే సార్వజనీనమైన పేరు కల్గివుండడం తప్పకుండా ‘వివేకవతి’ విశిష్టతే! (‘వివేకవతి’కి ఏ పేరు పెట్టాలా అని ఆలోచించి, ముందు ‘స్త్రీల క్షేమాకోశము’ అని పెట్టాలనుకున్నారుÑ కానీ, బొబ్బిలిలోని బాలికా పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండిన అమూల్యమ్మ చౌదరి (ఎమేల్యమ్మ) ‘వివేకవతి’ అనే పేరును సూచించారు). పత్రిక మరో విశిష్టత రకరకాల ముద్దుగొలిపే బొమ్మలూ, పటాలూ వుండడం.
సహజంగానే ‘వివేకవతి’ చాలామంది హృదయాల్ని చూరగొంది. పత్రికను ప్రసంశిస్తూ కొంతమంది రాసిన ఉత్తరాల్లోని భాగాల్ని ‘మెప్పుమాటలు’ ఉపశీర్షికతో ప్రచురించారు. ఒక ‘‘చాల చురుకైన హిందు బి.ఏ.’’ యిలా రాశాడు: ‘‘నేనీ చిన్న ముద్దు పత్రికనెట్లు ప్రేమించుచున్నానో చూపుటకు తీరుబడి చేసికొని వ్యాసములను వ్రాయ ప్రయత్నించెదను.’’ ‘‘కుగ్రామములో నివసించుచున్న బ్రాహ్మణుడొక’’డు యిలా రాశాడట: ‘‘నేను వివేకవతీ చూచినందున సంతోషించితిని. నేనందులోని పటములను నా భార్యకు చూపి సంగతులను వివరించితిని. ‘మీరు నాకు చదువు నేర్పరా? ఈ పత్రికను చదువుకొనగోరుచున్నా’నని ఆమె చెప్పెను. గనుక ఆమె తల్లిదండ్రుల కిష్టములేకపోయినను ఆమెకు చదువు నేర్పుచున్నాను.’’ విజయనగరం రైల్వేస్టేషన్లో ‘వివేకవతి’ని కొన్న ఒక ‘హిందూ పెద్ద మనుష్యుడు’ చందాదారునిగా చేరడమే కాకుండా, పత్రికను చదివిన తన భార్య సంతోషించిందనీ, ‘‘దానిలో ప్రచురించుటకు ఒక వ్యాసము నామె త్వరగా వ్రాసి’’ పంపుతుందనీ చెప్పాడట (‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’, అక్టోబర్ 1912, పు. 1`2). ‘‘కొన్ని స్త్రీ సమాజముల కార్యదర్శినులు’’ పత్రికను ఉచితంగా పంపమని కోరగా, ‘‘మంచి కాకితముపై మంచి పటములతో ముద్రించబడుచు ఒక్కొక్కటి 32 పుటలుగల 12 ప్రతులను సంవత్సరమునకు 12 అణాలకెవ్వరిచ్చెదరు?’’ అని ప్రశ్నించి ఉచితంగా యివ్వడానికి వీలుగాదన్నారు సంపాదకురాలు (ఫిబ్రవరి 1913, పు. 132). ‘వివేకవతి’ చందాదారుల్లో ‘హిందువు’లతో పాటు అనేకమంది మూల్‌నివాసీ క్రైస్తవులుండేవారు. లెక్కలేనంత మంది మూల్‌నివాసీ క్రైస్తవ స్త్రీలు ‘వివేకవతి’ నిండా అందంగా పరుచుకొని వున్నారు ` పాఠకులుగా, రచయితలుగా.
కొత్త చందాదారుల్ని ఆకర్షించడం కోసం సంపాదకురాల్లు విపరీతంగా ప్రచారం చేసేవారు: ఈ విషయంలో కూడా ‘వివేకవతి’ మిగతా స్త్రీల పత్రికలకన్నా భిన్నమైనది. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాల్గవ సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పుడు, ‘‘సలాం, సలాం, నాకు మూడు సంవత్సరములు దాటినదని మీరెరుగుదురా? సుమారు 1400 మంది మాత్రమే నన్ను తమ గృహములలోనికి చేర్చుకొన్నారు. రెండు కోట్లమంది తెలుగువారున్నప్పుడు ఇంక (ఇంకా) యెక్కువమంది నన్ను (అక్కున) చేర్చుకొనవలెననుట నా కోరిక’’ అని తన మనసు విప్పి చెప్పింది. ‘‘పత్రికను మీ స్నేహితులకు చూపించి వారిని చందాదారులగునట్లు ప్రోత్సాహము చేసి పత్రికా ప్రచారము 4,000 వరకుండునట్లు మీరు సహాయము చేయరా?’’ అని పాఠకుల్ని వేడుకొన్నారు సంపాదకురాలు (అక్టోబరు 1912, పు. 1`4). 1912 మార్చి సంచికలో ‘‘వివేకవతి మీ పత్రికయని జ్ఞాపకముంచుకొనుఁడు. మీ స్నేహితులకాపత్రికను చూపి దయచేసి క్రొత్త చందాదారులను చేర్పుఁడు. పర్లాకిమిడి వాస్తవ్యురాలగు హారిశన్ మిశమ్మగారచ్చట 20 మంది చందాదార్లను సంపాదించెను. ఇట్టి మంచి పత్రికకు 12 అణాలు మాత్రమే చెల్లించి చందాదారులగుటకచ్చటి ముఖ్య కుటుంబముల వారానందించుచున్నారు. ప్రియ పాఠకులారా, మీయూరిలో నెంతమంది చందాదారులున్నారు? చందాదారులు హెచ్చగుచున్నారుకాని యింకను నెక్కువ మంది మనకు కావలెను గదా!’’ అని నచ్చజెప్పారు (పు. 161`162). మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం వల్ల కల్గిన కష్టాల్ని తెల్పుతూ ‘‘ఈ కష్ట యుద్ధ కాలములో’’ ‘‘ ‘‘వివేకవతి’’కి సహాయము చేయుడి’’ అని దీనంగా వేడుకున్నారు (ఫిబ్రవరి 1918Ñ మొత్తానికి ఈ తేదీ నాటికి చందాదారుల సంఖ్య 1,250కు తగ్గింది). అందుకే ‘‘మరి 1250 మంది చేరినయెడల ఎప్పటివలె చక్కని కాగితములపై నచ్చొత్త వీలగును’’ అని తమ బాధను పంచుకొన్నారు. చాగంటి కాంతమ్మ రాసిన ‘వివేకవతి సంభాషణ’లో బాల వితంతువైన కమల, శ్యామలతో ‘‘ఇప్పడు నేను సంవత్సరానికి 12 అణాలు కట్టి, ఒక పుస్తకం తెప్పిస్తున్నాను. దానిలో ఎన్నో సంగతులు, కథలు, వింతలు మొదలగునవి వేస్తున్నారు … అదే నాకిప్పుడీ కష్టములలో స్నేహితురాలిగా ఉంది. నీకు కొంచెమయి(నా) అక్షరం పొల్తి ఉన్నట్టాయెనా, దానిని చూచి విడువగలవనుకొన్నావేమిటి? ఎప్పుడూ చదువాలనే యుంటుంది. అది దాని పేరుకు తగినట్టు కూడా యున్నది’’ అని ఏ విధంగా ‘వివేకవతి’ కష్టాల్లో వున్న స్త్రీలకు ‘‘స్నేహితురాలుగా,’’ ఆలంబనగా వుండగలదో తెలిపింది (అక్టోబర్ 1912, పు. 22`24). సంభాషణ రూపంలో సాగిన ‘బాలికా విషయములు’లో ‘‘యెక్కాల పుస్తకమునకు 6 పైసలగడి’’న కూతురితో యిలాగైతే ‘‘సంసారము’’ కూలిపోతుందని సమాధానమిచ్చిన తల్లి, ‘వివేకవతి’ని కొనడానికి మాత్రం నెల నెలా అణా యివ్వడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే, ‘‘ఇక్కాలమున స్త్రీ విద్యాభివృద్ధిని గూర్చి మాటలాడుచున్నారేగాని, తద్విషయములను గూర్చి సులభ శైలిని వ్రాసి సులభ మూల్యమున (అతి తక్కువ డబ్బుకు) ప్రకటించు ప్రతికలేవి. అట్టి కొరంత బాపినదీ వివేకవతియే. …’’ అని పొగిడిరది. ఇక బిడ్డ, ‘‘అవునమ్మా, సర్వమత సమ్మతమైనట్టిదియు అందరికిని రుచించునట్టియు, నీతిదాయకమైనట్టిదియునై, నిజదేవుని ప్రార్థించునట్టిదియు, అత్తిపూచినట్లుగ పిన్నలకు పెద్దలకు సదుద్దేశములను’’ బోధిస్తుందని ‘వివేకవతి’ని ప్రశంసించింది. దీనికి సమాధానంగా తల్లి ‘‘తనయా, నీవు చక్కగా గ్రహించితివి. స్త్రీలకుపచరించు పత్రికలెన్నిటిలో చూచినారము గాని యిట్టిదాని జూడము. ఆహా యేమి సుగుణ సంపద. ఎంత భక్తి గలది. ఇప్పటి నుంచి నీవు పట్టుదలతో వివేకవతి సహవాసము చేసినచో మన యూరనుండు కన్నెలకు మిన్నవై యుందువు గాదె’’ అని పత్రికను కీర్తించింది (అక్టోబర్ 1913, పు. 15`17). సర్క్యులేషన్ పెంచడానికి ‘వివేకవతి’ తన పాఠకులకు కొన్ని ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది.
‘వివేకవతి’లో భాష 1920కి ముందు ప్రచురించబడిన మిగిలిన స్త్రీల పత్రికల్లోని భాషలా కఠినంగా కాకుండా కాస్తంత సరళంగా వుండేది. పత్రిక శైలి పట్ల శ్రద్ధ తీసుకొన్న సంపాదకురాల్లు ‘‘శైలి మిగుల హెచ్చుగానైన తగ్గుగానైన’’ వుండకూడదనీ (అక్టోబర్ 1912, పు. 3), ‘‘నాలవ (నాలగవ) తరగతి జదివిన బాలిక సహితము దీనిని జదివిన సులభముగా గ్రహించుకొనునట్లు జేయగోరుచున్నా’’మనీ ప్రకటించారు (అక్టోబరు 1913, పు. 3). 1913 అక్టోబరు నుండీ శీర్షికల్ని తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లోనూ యివ్వడం ప్రారంభించారు. ‘వివేకవతి’ పాఠకుల్లో కొందరు ఇంగ్లిషు కూడా నేర్చుకుంటున్నారనీ, వారి ప్రయోజనార్థం శీర్షికలు ఇంగ్లిషులో కూడా యిస్తున్నామనీ చెప్పారు. ‘‘కొంత కాలమైన పిదప సులభమైన కొన్ని యాంగ్లేయ కథలను తెలుగుతో కూడ ప్రచురింప నిరీక్షించుచున్నారము’’ అని తమ భవిష్యత్ కార్యక్రమాన్ని తెలిపారు (‘కొన్నిమార్పులు’ ఃూశీఎవ జష్ట్రaఅస్త్రవంః, అక్టోబరు 1913, పు. 2`3).
ముచ్చటైన తెలుగు బైబిల్ భాష ‘వివేకవతి’కి అదనపు అందం చేకూర్చింది. స్త్రీల రచనలకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ప్రచురించడం ‘వివేకవతి’ విధానం: అందుకే తమ రచనల్ని ఆలస్యంగా ప్రచురిస్తున్నందుకు ‘‘క్షమించవలెనని’’ పురుషుల్ని కోరారు (అక్టోబర్ 1912, పు. 2). ‘వివేకవతి’ తన పాఠకులతో సజీవ సంబంధాల్ని నెరిపింది. పత్రికలో చదివిన వివిధ విషయాలు తమకెలా ఉపయోగపడ్డాయో ఉత్తరాలు రాయమని ప్రోత్సహించేది. ‘‘వివేకవతి వలన తమకు కలిగిన సహాయమును గూర్చి మా చదువరులు కొద్ది(యో) గొప్ప(యో) వ్రాయవలెనని కోరుచున్నాము. మీరెప్పుడైనా వైద్యవిషయములలో జెప్పినదాని నుపయోగించితిరా? మీ బిడ్డలకు బాలికా విషయములను గూర్చి నేర్పితిరా? గృహ విషయముల వలన మీకేమయిన మేలు గల్గెనా? దైవభక్తి విషయములు చదువుటచే మీకేమయినను ఆత్మీయ లాభము కల్గినదా? ప్రకృతి పాఠములు నేర్చుకొనుటచే, మీ శరీరము గూర్చి క్రొత్తదేదయిన తెలిసికొంటిరా? అలాగైన యెడల మాకును వ్రాసి తెలుపుడి. వివేకవతిలోని నానా విషయముల నితరులెట్లుపయోగించుకొనుచున్నారో చదివి దాని వలన యితరులు సహాయమును బొందుదురు’’ అని 1915 ఆగష్టు సంచికలో పాఠకులను కోరారు (పు. 328). ఈ విధంగా పాఠకులను ప్రోత్సహించి వారి అభిప్రాయాలనూ, స్పందననూ కోరడం వలసాంధ్ర మహిళా జర్నలిజం చరిత్రలో ‘వివేకవతి’ ప్రారంభించిన కొత్త ఒరవడి.
అసలు ‘వివేకవతి’ని ఎందుకు ప్రారంభించారు? భారతీయ సమాజాన్ని ‘వివేకవతి’ ఏ విధంగా అర్థం చేసుకుంది? పత్రికను నిర్వహించిన వారి దృష్టిలో భారతీయులు పరమ మూర్ఖులు. సభ్యతా సంస్కారం లేని వాళ్ళు. దట్టంగా అలుముకొన్న అజ్ఞానాంధకారంలో నిండా మునిగి వున్నారు. నాగరకత లేకుండా ఆది మానవ దశలోనే నగ్నంగా నర్తిస్తున్నారు. నిజమైన దేవుడెవరో తెలియక పాప పంకిలమైన బ్రతుకిల్ని వెల్లదీస్తున్నారు. కాబట్టి ఎలాగైనా చేసి ఈ మూర్ఖుల మనసు రంజింపజేయాలి. వారికి విద్య నేర్పాలిÑ విజ్ఞానాన్నివ్వాలిÑ నాగరకతా రహదార్లోకి ఈడ్చుకు రావాలిÑ నిజమైన దేవుడి రక్షణనిప్పించాలి. ఆ పని రక్షణ పొందిన క్రైస్తవులది. వారా బరువు బాధ్యతల్ని తీసుకోవాలి: ఔష్ట్రఱ్‌వ వీaఅ్ణం దీబతీసవఅ. స్త్రీల పత్రికైన ‘వివేకవతి’ ఔష్ట్రఱ్‌వ ఔశీఎవఅ్ణం దీబతీసవఅ ని తన చేతుల్లోకి తీసుకొంది. ధాటిగా నిర్వహించింది. భారతీయుల పట్ల ‘వివేకవతి’ దృక్పథాన్ని ఒకటీ రెండూ ఉదాహరణలతో చూద్దాం. ప్‌ా.స్. హెంస్మన్ రాసిన ‘ఇండియా దేశస్థులకు ఆవశ్యకరమైనవి’ అనే వ్యాసంలో భారతీయులకు ‘‘అగత్యమైనట్టి’’ విషయాలనేకం వున్నా ‘‘మిక్కిలి అగత్యకరములగు’’ రెండు విషయాల్ని మాత్రమే చర్చించారు. ఒకటి: విద్యావివేకాలు లేకపోవడంÑ రెండు: ఎవరు నిజంగా రక్షించే దేవుడో తెలియకపోవడం. విద్య లేకపోవడం కారణంగా భారతీయుల్లో చాలామంది ‘‘మూర్ఖముగా పిచ్చి భ్రమల ప్రకారము నడచుకొనుచున్నారు.’’ విద్యా ‘‘తేజస్సు’’ లేకపోవడం వల్ల ‘‘తరతరముల నుండి వారలు ఒకే విధముగా బ్రతుకుచున్నారు. వారల తండ్రులు జీవించినట్లు వీరును (జంతువుల) వలె జీవించుచున్నారు.’’ అలా తరతరాల నుండీ చలన రహితంగా, ఏ మార్పూ లేకుండా వుంది భారతీయ సమాజం. అలా మురిగిపోయి కంపు కొడుతున్న భారతీయ సమాజాన్ని మార్చడానికి దేవుడే క్రైస్తవుల్ని ఎంపిక చేసి పంపాడు (ణఱఙఱఅవ ణఱంజూవఅంa్‌ఱశీఅ). భారతీయ ‘‘స్త్రీలకు తమ సంసారమును చక్కగా జరుపుటకు తెలియదు. తమ బిడ్డలను బాగుగా సన్మార్గములందు నడపించుటకు తెలియదు. చిన్ననాటి నుండి అబద్ధము చెప్పుట, ఒకరినొకరు సహాయము చేయకపోవుట, తల్లిదండ్రుల కెదిరించి మాట్లాడుట, చెప్పిన మాట వినకపోవుట మొదలైన దురభ్యాసములు బిడ్డలకు కలుగును. ఇంతేకాక వారియొక్క శారీరారోగ్యములు సరిగా జూచుటకు తెలియదు. మంత్రములందు, విద్యలేనట్టి వైద్యులందు నమ్మిక యుండుటచే అనేకులు తమ జీవములను వ్యర్థముగా ధారపోవుదురు.’’ కాబట్టి మూర్ఖ భారతీయుల్లో పేరుకుపోయిన ఇలాంటి కోకొల్లలయిన ‘‘చెరుపులన్నియు పోగొట్టుటకు చదువు అభివృద్ధి కావలెను…. క్త్రీస్తు బోధకులు సువార్త ప్రసంగము జేయుటయే కాక చదువును వృద్ధి చేయుటకు ప్రయత్నించవలెను. ఇట్లు జేసినట్లయిన అప్పుడు సువార్త ప్రసంగము చేయునపుడెక్కువ లాభముండును.’’ ‘‘ఇండియా దేశస్థుల’’ మతపరమైన అజ్ఞానాన్ని వివరిస్తూ, నిజమైన ‘‘దేవుడు ఎవడో వారికి తెలియద’’నీ, ‘‘ఆ జ్ఞానమును సంపాదించుటకు వారు ప్రయత్నించర’’నీ, ‘‘పాపమును గురించి లక్ష్యము లేద’’నీ, దేవుడు దయాళువనిగానీ, మనల్ని ప్రేమిస్తున్నాడనిగానీ తెలియని అవివేకపు చీకట్లో మగ్గుతున్నారనీ, కాబట్టి క్రీస్తు బోధకులు సువార్త ద్వారా వారిని చీకట్లోంచి వెలుగులోకి లాక్కొని రావాలన్నారు. అది క్రైస్తవులపై వున్న ‘‘గొప్ప భారము’’ కాబట్టి స్వయంగా జీసస్‌లాగే తమ జీవితాల్ని మలచుకొని ‘‘విశ్వాసముతోను, ధైర్యముతోను, ఆయన వార్త ప్రసంగము (ప్రచారము) చేయవలెన’’ని ఉద్బోధించారు (నవంబరు 1909, పు. 58`61).
పైన పేర్కొన్న హెన్సమన్‌గారే ‘హిందూదేశ స్త్రీల స్థితిని గురించి’ అనే వ్యాసంలో హిందూ స్త్రీలెంత అంధకారంలో వుంచబడ్డారో, హిందూ సమాజం వారిపై ఎన్ని అఘాయిత్యాలు చేస్తోందో కళ్ళకు కట్టినట్లు వివరించడమేగాక తన వాదనను నిరూపించడానికి జానాభా లెక్కల నుండి గణాంకాధారాలనూ పొందుపరచారు. ‘‘హిందూ స్త్రీలయొక్క స్థితి అనేక విధములు కష్టతరమైనది’’ అని బాధతో ప్రకటించిన హెన్సమన్, వాళ్లకు చుదువుకొనే అవకాశమే లేదనీ, ‘‘బ్రాహ్మణులు మొదలగువారు’’ పాటించే బాల్యవివాహ దురాచారం వల్ల బాలికల చదువుకు ‘‘ఆటంకము’’ లేర్పడుతున్నాయనీ అన్నారు. విద్యావిహీనులవడం వల్ల బాలికలకు ‘‘ఇంటి సంసారము చక్కగా గడుపుకొనుటకు, ఇంటిని అలంకారముగాను, సౌందర్యముగాను, శుభ్రముగాను, దేహారోగ్యమునకు తగిన వీలు చేసుకొనుటకు… తెలియదు. … చిన్ననాటినందు పెండ్లి చేయుట వలన శరీర బలహీనత కలుగును. మరియు బాల్యమందు బిడ్డలు కలుగుట వలన వాని చక్కగా పెంచుటకు తల్లులకు తెలియదం’’టూ బాలభార్యల, బాలమాతల కష్టాల్ని వర్ణించారు. బాల్య వివాహం వల్ల ఒకవేల వితంతువులైతే వాళ్ళ కష్టాలకు అంతేవుండదన్నారు: ‘‘ఒకవేళ దురదృష్టము వలన విధవలైనట్లైన, వారి యొక్క అవస్థ చెప్పజాలము. అందరును తిరస్కరించి, పరిహసించి, వారి యెడల కొంచెమైనను ప్రేమ జూపక, వారిని శుభకార్యములందు రానీయక, వారి యొక్క బ్రతుకును చాలా కష్టతరముగా చేయుదురు. ఇంటియందు పని యావత్తును వారిచే చేయించి, వారిని కొంచెమైనను బాగుగా జూడరు. మనస్సునందు వారలకు దుఃఖము కలుగజేయుటయేకాక, శరీర కష్టములనేకము. భోజనమొకపూటనే చేయవలెను. పడక నేలమీద తప్ప ఇంకొక చోట నుండరాదు. ముతక బట్టలు మాత్రమే కట్టుకొనవలెను. వ్యాధి వచ్చిన మందు తీసుకొనరాదు. ఇట్టి కష్టములు వారలకనేకములు గలవు. మరియు వారికి కొంచమైనను సంతోషము లేదు. ఇట్టి దశ వారలకు కలిగినపుడు వారు చెడు మార్గములందు పడిపోవుట, వారు నీతిగా నడుచుకొనకపోవుట ఆశ్చర్యమా?’’ హిందూ వితంతువుల దుర్భరమైన దుఃఖస్థితిలాగే ‘‘ఇంకొక మిక్కిలి దుఃఖకరమైన సంగతి’’ వుందనీ, అది ‘‘అనేకమంది స్త్రీలు తమ కుమార్తెలను హిందూ ఆలయములకు’’ ఇచ్చే దర్మార్గమైన పద్ధతనీ తెలిపారు. ‘‘ఈ స్థలములందు వారు చెడు వాడుకలు నేర్చుకొని వేశ్య స్త్రీలవలె ప్రవర్తించి, వారి యొక్క జీవనమును పాడు’’ చేసుకుంటున్నారనీ, ‘‘ఇది చాలా గొప్ప పాపము’’ అనీ హృదయ విదారకమైన హిందూ స్త్రీల దైన్యస్థితిని వివరించారు.
హిందూ స్త్రీలలోని విద్యలేమినీ, బాల్య వివాహ దురాచార ఫలితంగా కోకొల్లలుగా పెరిగిపోయిన వితంతువుల సంఖ్యనూ, దేవదాసీల సంఖ్యనూ జనాభా లెక్కల ఆధారంతో వివరించి, హిందూ స్త్రీల పరిస్థితి ఎంత ఘోరంగా వుందో, హిందువులెంత అవివేకాంధకారంలో మగ్గుతున్నారో స్పష్టం చేసిన హెన్సమన్ భారతీయ స్త్రీల జీవితాల్లో వివేకపు వెలుగులు తీసుకొచ్చే అతిపెద్ద బాధ్యత క్రైస్తవ స్త్రీలపై వుందన్నారు. క్రైస్తవ స్త్రీలు హిందూ స్త్రీల దగ్గరికి చేరి వాళ్ల మనుస్సుల్నెలా రంజింపజేయాలో ఇలా సూచించారు: ‘‘కాబట్టి క్రైస్తవ స్త్రీలు తమ చుట్టు ప్రక్కలనుండు హిందూ స్త్రీలను తమకు శక్యమగునంత వరకు సహాయము చేయవలెను. ముందు తమ యొక్క స్వంత నడవడిక నీతిగాను, పరిశుద్ధముగా నుండవలెను. ఈ ప్రకారము క్రీస్తు యొక్క నామము ఘనపడును. రెండవదేమన, తమకు గల లాభములు, తమ మతముచే కలుగునట్టి మనస్సంతోషము మొదలగునవి తాము ఇతరులకు బోధించవలెను. బోధించుటకు హిందూస్త్రీలొప్పుకొనని యెడల, వారలను ప్రేమగా జూచి, వారి కష్టములు విచారించి, వారి దుఃఖములను నివర్తించుటకు జూచి, వారికి స్నేహితులుగా జేసికొని, ఈ ప్రకారముగా (దు:ఖపూరితములయిన) వారి జీవములందు కొంచెము సంతోషము కలిగించవలెను. మరియు వారలకు ఆ స్త్రీలను ప్రేమగాను, అనుతాపము కలవారుగాను జూచిన యెడల, వారలను చెడు మార్గంలో పోనీయక కాపాడవచ్చును… తల్లులకు విద్య, నాగరీకత నేర్పిన యెడల, పిల్లలను చక్కగా పెంచుటకు సహజముగా వచ్చును. దేవుని యొక్క భయము, ఆయన యొక్క ప్రేమ మనము బోధించి మనస్సులను తాకునట్లు చేసిన యెడల మనుష్యుల యొక్క నడవడికలు మారును. మన యొక్క స్వంత నడవడిక యొక్క దృష్టాంతము వలను, మన యొక్క ప్రేమ వలను, మన యొక్క ప్రార్థన వలను హిందూ స్త్రీలకు మనము సహాయము చేయవలెను.’’
హిందూ స్త్రీల విద్యావిహీనతకు సంబంధించిన గణాంకాధారాలను పొందుపరుస్తూ ,‘‘ఇండియా దేశమంతటలో’’ ప్రతి వెయ్యి మంది స్త్రీలలో కేవలం ఏడుగురు మాత్రమే అక్షరాస్యులనీ, మద్రాసు ప్రెసిడెన్సీలో కొంత మెరుగైనప్పటికీ, తొమ్మిది మంది మాత్రమే అక్షరాస్యులనీ తెలిపి, ‘‘యెంత అంధకారము!’’ అని, స్త్రీలను ఆవరించి వున్న చీకటిని చూపించారు హెన్సమన్. ఈ పరిస్థితికి బాల్యవివాహ దురాచారాన్ని కారణంగా చూపుతూ, దేశంలో పది సంవత్సరాలకంటే తక్కువ వయస్సుగల బాలికల్లో 2,273,245 మందికి పెండ్లిండ్లైపోయాయని తెలిపి, ఆ బాలభార్యల యెడల ‘‘జరిగే అన్యాయము అంతంత కాదు’’ అని గుండెలు బాదుకున్నారు. ‘నీతి విషయము’ ఉపశీర్షికన వితంతువులూ, ‘‘వేశ్యలును, భోగమువారి’’కి సంబంధించిన లెక్కల్నిచ్చారు. వాటి ప్రకారం భారతదేశంలో మొత్తం 144,000,000 మంది స్త్రీలుంటే, వాళ్ళలో 26,000,000 మంది విధవలు, అంటే ప్రతి ఆరుగురిలో ఒకామె వితంతువు. వివిధ వయస్సుల్లోని విధవల సంఖ్యను తెలుపుతూ (కేవలం ఒకే ఒక్క సంవత్సరంలోపు 1,064 మంది) ‘‘ఈ విధవరార్రడ యొక్క స్థితిని గురించి యాలోచించండి. పునర్వివాహమునకు సెలవులేనివారై, ఒక విధమైన ఖైదులై యుందురు. వీరి యొక్క దుర్లభమైన గతిని వి వరించ శక్యము కాద’’న్న హెన్సమన్ ‘‘యేసుక్రీస్తు యొక్క సువార్త మాత్రమే వీరిని (విధవత్వ ఖైదునుంచి) విడిపించగలద’’నీ, యేసొక్కడే మార్గమనీ, అత్యంత ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా ప్రకటించి, మొట్టమొదటి వితంతు శరణాలయం (‘‘విధవలాశ్రయము’’) క్రైస్తవులే స్థాపించారన్న విషయాన్ని గుర్తుచేశారు.
‘‘ఇండియాలో 1,74,000 (మంది) వేశ్యలును, భోగమువారున్నా’’రనీ, వారిని ‘‘దేవదాసులని’’ (దేవదాసీలు) పిలుస్తారనీ తెలిపిన హెన్సమన్ ‘‘హిందూమతమని చెప్పి, హిందూమతము నామమున వీరు పాపముగల హేయకరమయిన స్థితిలో పోషించబడుదుర’’న్నారు. హిందూ స్త్రీలపట్ల జరుగుతున్న ఘోరాలన్నీ వివరించాక క్రైస్తవ స్త్రీల నుద్దేశించి ‘‘ప్రియ సహోదరీయులారా! ఈ లెక్కలు మీ హృదయమున తట్టడము లేదా? (మీ హృదయాల్ని కదిలించడం లేదా?) ఇవి వట్టి సంఖ్యలు కావు. ఈ సంఖ్యలు మీవంటి స్త్రీలును, మీ సహోదరీయులే సుమండి. వీరిని విడిపించుటకు దేవుని సహాయము వేడి, పూనుకొనెదరా!’’ అని హిందూ స్త్రీలను ‘‘ఖైదు’’ నుంచి విడిపించడానికి పూనుకొమ్మని గట్టిగా పిలుపిచ్చారు. అలా పూనుకొన్న ఫలితమే ‘వివేకవతి’ ఆవిర్భావం. ‘వివేకవతి’ ‘‘గొప్పభారాన్ని’’ తనపై వేసుకొంది: చేరి మూర్ఖుల మనసు రంజింపజేయడానికి ధాటిగా ప్రయత్నించింది.
‘వివేకవతి’ వైవిధ్యభరితమైన పత్రిక. హిందూ స్త్రీల అభివృద్ధిని తనదైన పద్ధతిలో గట్టిగా కోరుకున్న ‘వివేకవతి’లో స్త్రీ విద్యనూ, వితంతు పునర్వివాహాలనూ, సంఘ సంస్కరణనూ ప్రోత్సహిస్తూÑ బాల్య వివాహాలనూ, వృద్ధ వివాహాలనూ, మూఢ నమ్మకాలనూ ఖండిస్తూ అనేక రచనలు ప్రచురితమయ్యాయి. క్రైస్తవాన్ని ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రభుత్వం పట్ల భారతీయుల్ని అత్యంత విశ్వాసపాత్రులుగా తీర్చిదిద్దడం కూడా పత్రిక ప్రధానోద్దోశాల్లో ఒకటి. గృహకార్య నిర్వహణలో స్త్రీలు పాటించాల్సిన మెలకువల్నీ, పిల్లల్ని పెంచాల్సిన విధానాల్నీ, భర్తలతో మెలగాల్సిన పద్ధతుల్నీ స్త్రీలకు కూలంకషంగా వివరించేది. ‘వివేకవతి’లో అనేక కాలమ్స్ వుండేవి. ‘దైవభక్తి విషయములు’, ‘బాలికా విషయములు’, ‘గృహ విషయములు’, ‘వైద్య విషయములు’, ‘ప్రకృతి పాఠములు’, ‘స్త్రీ పరస్పర క్షేమార్థ విషయములు’ అనేవి వీటిలో కొన్ని. ‘ఇంగ్లాండులోని యరుణోదయము’, ‘హేమలత’ (నవల) మొదలైనవి ధారావాహికలుగా ప్రచురించబడ్డాయి. పత్రిక మరో విశేషమేమిటంటే వెనక సంపుటాలకు సంబంధించిన ‘ఇండెక్స్’ ప్రచురించడం. ఇది కూడా ‘వివేకవతి’ ప్రారంభించిన నూతన ఒరవడి. మరే స్త్రీల పత్రికలోనూ ఈ అంశం కన్పించదు. ‘విషయసూచిక’ సాధారణంగా ప్రారంభంలో వుండడం మనకు తెలుసు. కానీ ‘వివేకవతి’లో మాత్రం పత్రిక చివరి పేజీలో వుండేది. ఆశ్చర్యంగా వుంది!
‘వివేకవతి’ సంపాదకీయాలు ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి. ‘పత్రికా సంపాదకురాలి వ్యాసం’ ఏదో ఒక ప్రత్యేక విషయానికి మాత్రమే పరిమితంగా కాకుండా వివిధ విషయాలను “ కొన్నిసార్లు ఒకదానికొకటి అసలు సంబంధమే లేని విషయాలను “ క్లుప్తంగా ప్రస్తావించేది. అనేక రకాలైన విషయాలను ప్రస్తావించినప్పటికీ, సంపాదకీయాలు ప్రధానంగా సంఘ సంస్కరణ, స్త్రీ విద్య, అభివృద్ధిలపై దృష్టి కేంద్రీకరించేవి. 1912 ఏప్రిల్ సంచికలో స్త్రీ విద్య ప్రాముఖ్యతను వివరిస్తూ చదువుకున్న భర్తలక్కూడా చదువులేని భార్యలుండడం ‘‘శోచనీయమును లజ్జాకర’’మైన విషయంగా తేల్చి చెప్పారు. ‘‘ఇంటి బాధ్యత గలిగి యుండునది తల్లియే. ఏలన, తండ్రి పగలంతయు పనిమీఁద బైట పోయి యుండునుÑ తల్లి పిల్లలను కనుపెట్టుకుని యింటనే యుండును. తల్లి మంచి చదువు నేర్చినదేని పిల్లలను చక్కని మార్గమున నడపించి, వారిని సుగుణవంతులుగా చేయగలదు. తల్లికిట్టి మంచి గుణములు లేని యెడల పిల్లలకు నష్టము కలుగును’’ అని ఆడవాళ్ళెందుకు చదువుకోవాలో వివరించారు. ఇంట్లోనే వుండి తమ విద్యను యింకా ఎక్కువ అభివృద్ధి చేసుకోదలచుకున్న చదువుకున్న స్త్రీలకు ‘విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి’వారు నిర్వహించే పరీక్షల గూర్చి తెలియజేశారు. ‘‘మన దేశపు స్త్రీలలో నూటికొకరు మాత్రమే చదువగలిగియున్నారనుట మిక్కిలి విచారకరము గదా’’ అని వాపోయారు (‘పత్రికా సంపాదకురాలి వ్యాసము’, పు. 193`195).
చదువుకొని పెద్ద పరీక్షల్లో నెగ్గిన స్త్రీలను మనసారా అభినందించేవి ‘వివేకవతి’ సంపాదకీయాలు. అలా పరీక్షల్లో నెగ్గిన స్త్రీల ఫొటోలనూ, వాళ్ళ జీవితానికి సంబంధించిన క్లుప్తమైన సమాచారాన్నీ యిచ్చి, వారిని రోల్‌మోడల్స్‌గా చూపేవి. ఉదాహరణకు, హిల్డా లాజరసు మిస్సమ్మ బి.ఏ., ఫొటో ప్రచురించి, ఆమె మద్రాసు మెడికల్ కాలేజ్‌లో చదువుతున్నారనీ, ‘‘ప్రస్తుతమా కళాశాలలో 34`గురు విద్యార్థిను’’లున్నారనీ, వాళ్ళల్లో యిద్దరు హిందూ స్త్రీలనీ, 11 మంది ‘‘స్వదేశ క్రైస్తవురాండ్ర’’నీ తెలియజేసింది 1912 జూన్ నాటి సంపాదకీయం. అంతేకాకుండా, ‘‘ముఖ్యమైన వైద్యవృత్తి కింతమంది స్త్రీలు తమ్ము సిద్ధపఱచుకొనుచున్నారని వినుటకెంతయు కుతూహలముగానున్నది’’ అని సంతోషం ప్రకటించింది. భారత స్త్రీలు మెల్లమెల్లగా సాధిస్తున్న విద్యాభివృద్ధిని ప్రస్తావిస్తూ ‘‘ఈ దేశమందు విద్యాభివృద్ధి మిగుల మెల్లఁగానున్నట్టు కనబడినను, వృద్ధిలోనున్నది. గత సం॥ చెన్నపురి సర్వకళాశాల యందెనమండ్రు విద్యార్థినులు బి.ఏ. పరీక్షయందు కృతార్థలయిరి, వారిలో నొకరు బ్రాహ్మణ బాల వితంతువగు సుబ్బలక్ష్మమ్మగారు. ఈమెకుఁగల యింగ్లీషు భాషా పాండిత్యమునకు గ్రిగ్ దొరగారి పేరట స్థాపింపఁబడిన బంగారు పతకము బహుమానముగా నొసంగఁబడినది. ఇంకొకామె మళయాళములో హీనజాతులుగా పరిగణింపఁబడువారిలో చేరిన తియ్యర్ జాతి స్త్రీ’’ (పు. 25`258). ‘విజ్ఞాన చంద్రికా మండలి’ నిర్వహించిన పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన కాంచనపల్లి కనకమ్మను ప్రశంసించిన 1913 సెప్టెంబర్ నాటి సంపాదకీయం అలాంటి పరీక్షలనిచ్చి విద్యనభివృద్ధి చేసుకోమని స్త్రీలను కోరింది. 1921 మార్చి నాటి సంపాదకీయంలో ‘‘ఈ సంవత్సరము కలకత్తా సర్వవిద్యాలయ బి.యే. పట్ట పరీక్షలో … మేయడుల్ యిసార్ (?మైదుల్ ఇస్రార్) గారి జ్యేష్ఠ పుత్రిక బేగం సుల్తా(నా) మొయిడ్ జాడాగారు (?బేగం సుల్తానా మొయిద్ జారా) పొందిన జయమును తెలియజేయుటకు సంతోషము గలుగుచున్నది. ఆమె నారీమణులలోనే గాక పురుషులందరిలోను యగ్రస్థానమున జయమునొందెను. ఇంతవఱకు హిందూదేశమున బి.యే. పరీక్షయందు గెలుపొందిన నల్గురు మహమ్మదీయ స్త్రీలను మాత్రమే వినియున్నాము’’ అన్న సమాచారాన్నందించారు (పు. 122). అదే సంపాదకీయంలో స్విట్జర్లాండులోని జెనీవాలో జరిగిన ఎనిమిదవ International Women Suffarage Alliance (‘‘పరస్పర రాజస్త్రీల సమ్మతి సంబంధము’’) గురించి రాశారు. భారతదేశంలో స్త్రీల ఓటు హక్కు కోసం కృషి చేస్తున్న మహిళా నాయకులను ప్రశంసించారు.
1913 డిసెంబరు నాటి సంపాదకీయం బ్రిటిష్ రాచకుంటుబాన్ని ఆకాశానికెత్తి ‘‘మన రాజు’’గారీ, ‘‘మన రాణి’’ గారీ ఉదారత్వాన్ని వేనోళ్ళ కొనియాడిరది. భారతీయ స్త్రీలు బ్రిటిష్ రాజు / రాణి పట్ల రాజభక్తిని ఎలా ప్రదర్శించాలో ఈ విధంగా తెలియజేసింది: ‘‘. . . మన కుటుంబములో బిడ్డల నెవరు పెంచుచున్నారు? వారి మొదటి ఉపాధ్యాయులెవరు? తల్లులమగు మనమేగదా! చాల దూరమందలి యూరిలోనున్న తాతనుగాని అవ్వనుగాని ప్రేమించునట్లు నీ చిన్ని బిడ్డకు నీవు నేర్పుట లేదా! తాత గారిని జూడక పోయినను, వారినతఁడు ప్రేమించుచున్నాఁడు గదా. అలాగే మన రాజుగారిని రాణిగారిని ప్రేమించునట్లు వారికి నేర్పవచ్చును. బిడ్డలకు నేర్పక పూర్వము మనము వారి యెడల నిజమైన రాజభక్తిఁగలిగి, వారిని బ్రేమించి గౌరవింపవలెను. వారి పటములను మన ఇండ్లలో నుంచి, జెండాలను గోడలకుఁ దగిలించి, దినదినమును వారిని గూర్చి మాట్లాడుచు, మన యేలికల యెడల ప్రేమగలిగి యుండునటుల’’ చేయండని స్త్రీలకు బోధించింది. మొత్తానికి పెద్దలకు బ్రిటిష్ రాజూ, రాణీ అమ్మానాన్నలైతే, పిల్లలకు అవ్వా తాతలన్నమాటÑ ‘వివేకవతి’ కల్పించిన రాజకీయ బంధుత్వం భలే వుంది! ఇంకేం, బ్రిటన్ నుంచి మన అవ్వా తాతల ఆస్తుల్లో భాగం అడగొచ్చు మనం!! (‘హైందవరాండ్రెటుల రాచభక్తిని గనుపర్చవచ్చును’:’How Indian Women May be Loyal’ పు. 66`67). ఇంట్లో రాజుగారి పటాన్ని వేలాడగట్టండని సలహా యిచ్చిన సంపాదకురాలు పటాలు పిల్లలపై వేసే గాఢమైన ప్రభావాన్ని తెలిపే ఒక చిన్న కథ చెప్పి ‘‘చూచితిరా? మీ చిన్ని బిడ్డలును రాజుగారి పటముల వంక జూచినప్పుడు ఆయనను ప్రేమించి, గౌరవింప నేర్చుకొనగలరు’’ అని నచ్చజెప్పింది (‘రాజుగారి పటము జేయగలిగిన పని’:’The influence of the King’s Picture’ పు. 67). అలాగే విద్యార్థుల్లో రాజభక్తిని ప్రేరేపించడంలో ఉపాధ్యాయులు పోషించాల్సిన బృహత్తర పాత్రను వివరిస్తూ ‘‘తల్లి తరువాత పిల్లల గుణముల యాకారమేర్పరచు విషయములో నుపాధ్యాయునికంటె మించిన వారెవ్వరును లేరు . . . ‘‘యథాగురు తథాశిష్య’’ అను వాక్యమెంతో సత్యమైనది. మీచేతి కప్పగింపఁబడిన బిడ్డలను, వారు తమ రాజును దేశమును బ్రేమించునట్లు జేయు గొప్ప పని మీకు గలదు. వారికి దేశాభిమానము నేర్పవలెనా? అవును. తప్పకుండ నేర్పవలెను. గాని వారికి ‘‘నిజమైన దేశాభిమానము’’ నేర్పవలెను. హిందూ దేశమును ప్రేమించి దానికి మేలుజేయ నేర్పుడి. బాంబులు వేసి, ఉద్యోగస్థులను చంపుట దేశమును బాడుజేయుటేగాని, దానికి సహాయముఁజేయుట కాదు. మానవులను మర్యాదఁజేసి, సర్కారు వారిని గౌరవించి, రాజుగారిని ప్రేమించునట్లు నీ బడి పిల్లలకు నేర్పుము. ‘‘దేవునికి భయపడి, రాజును సన్మానించుము. (‘రాజభక్తి నేర్పుటలో ఉపాధ్యాయుల భాగము’:’A teacher’s share in teaching Loyalty’ పు. 67`68). అదే సంపాదకీయంలో, యేసుక్రీస్తును ‘మన రాజాధిరాజు’ (Our king of kings) అని పిల్చి, ‘‘మన రాజును గూర్చియు, వారి యెడల కనపర్చవలసిన భక్తిని గూర్చియు, పైన చెప్పియుంటిమి. గాని అన్నిటికంటే ముఖ్యముగా మన (రాజాధి)రాజగు యేసుక్రీస్తు యెడల భక్తి కలిగి యుండవలెను. పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ మనస్సుతోను ఆయనను ప్రేమించిన యెడల, మనము ఈలోకపు రాజును (బ్రిటిష్ రాజును) ప్రేమింతుము’’ అని తెలిపి జీసస్‌ను ప్రేమిస్తే సహజంగానే బ్రిటిష్ రాజును ప్రేమించి విశ్వాసపాత్రులుగా మారతారని ప్రచారం చేశారు (పు. 68).
స్త్రీ విద్యను బాగా ప్రోత్సహించిన రచనలనేకం ‘వివేకవతి’లో ప్రచురించబడ్డాయి. ఏదో కొంతమంది తప్ప మిగిలిన బాలికలందరూ భవిష్యత్తులో ‘‘యిల్లాండ్రుగా నుండఁబోవువారే’’ కాబట్టి ‘‘బాలికా పాఠశాలలందు విద్యతోకూడ వంట చేయుటకును, కుట్టుపని చేయుటకును, అతిథి సత్కారము సల్పుటకును, గృహములను శుభ్రముగా నుంచుటకును, బిడ్డలను కాపాడుటకును, రోగులకు సహాయము చేయుటకును, బాలికలకు నేర్పించుట యుక్తము. ఆరోగ్యశాస్త్రము, గృహతంత్రము మొదలగు గ్రంథరాజములను వారిచే చదివించుట మాత్రము గాక, వారినాపనులలోఁ గ్రమముగా నభ్యసింపఁజేయుటవల్ల వారికా కృత్యములందు అనుభవమును హెచ్చింపఁ గల్గుదుము’’ అనేది స్త్రీవిద్య పట్ల ‘వివేకవతి’ మౌళిక వైఖరి. పైన చెప్పిన విషయాల్లో నేర్పు లేకపోతే స్త్రీలు ‘‘సంసార భారమును భరింప నశక్యులగుదురు’’ అని హెచ్చరించింది. అందుకే బాలికా పాఠశాలాధికారులూ, తల్లిదండ్రులూ ఈ విషయమై ‘‘నెక్కువ శ్రద్ధ పుచ్చుకొనుట మంచిది’’ అని గట్టి సలహా యిచ్చింది (‘మన బాలికా విద్య’, ఏప్రిల్ 1921, పు. 146).
‘చదువెఱుగని స్త్రీలు తమ బిడ్డలకు శత్రువులు’ అనే వ్యాసంలో కత్తిరశెట్టి కేశవమ్మ ‘‘తల్లి విద్యావతియయ్యెనేని బిడ్డల చదువు నిమిత్తము తాను స్వయముగా కనుక్కొని యింటి వద్ద పాఠములు చెప్పి వారిని విద్యాబుద్ధులయందు ప్రవీణులుగా జేయును. (తల్లులు) మూర్ఖురాండ్రయిన పక్షమున బిడ్డలకు చదువురాక మూర్ఖులయి దుర్మార్గులయి చెడిపోయి కడపట తాము దుఃఖముల పాలయి తమ వారికి కూడా దు:ఖము తెచ్చి పెట్టుదురు’’ అని ప్రకటించారు. ‘‘అవివేకము విద్య లేనందున కలుగును’’ అని తీర్మానించిన కేశవమ్మ ‘‘మన దేశము యొక్క అభివృద్ధి, నాగరికతయు, క్షేమమును కావలెనంటిమా, మన స్త్రీలకు చదువు చెప్పించి స్త్రీ విద్యాభివృద్ధి చేయవలయును’’ అని వాదించారు. బాలికలు చదువుకోకపోతే ‘‘తల్లిదండ్రులను శిక్షించే’’ విధంగా బ్రిటిష్ ప్రభుత్వం చట్టం చేయాలని కేశవమ్మ కోరడం అప్పటికీ, యిప్పటికీ చాలా గొప్ప విషయం (ఆగస్టు 1913, పు. 333`335). ‘‘మన స్త్రీలకు విద్యలేమికి స్త్రీలే కారణముగాని పురుషులేమో యాటంకపరచిరని నిందించుట తప్పు’’ అని భావించిన వాడ్రేవు సుందరమ్మ ‘విద్యను గూర్చి స్త్రీలకు గల మూఢాభిప్రాయము’లను ఖండిరచారు. స్త్రీలెందుకు చదువుకోవాలి, వాళ్లేమైనా ఉద్యోగాలు చేయాలా, ఉళ్ళేలాలా అనే పనికిమాలిన వాదనకు సమాధానమిస్తూ ఎందుకు చేయకూడదు, ‘‘మనకిష్టమున్న యెడల ఉద్యోగము కూడా చేయవచ్చు’’నన్నారు. ఉద్యోగం చేయడం ‘‘సంసారి’’ స్త్రీ లక్షణం కాదన్నవారిని ‘‘ఉద్యోగం చేసినంత మాత్రమున సంసారి కాదనవచ్చునా?’’ అని బలంగా ప్రశ్నించారు. వేరే మగవాళ్ళ కంటబడ్డంగానీ, వాళ్ళతో మాట్లాడ్డంగానీ తప్పేమీ కాదన్నారు (‘సంఘ సంస్కరణ విషయములు’, నవంబర్ 1912, పు. 39`40). వలసాంధ్రలోని మహిళోద్యమ నాయకుల్లో ప్రముఖురాలైన బుఱ్ఱా బుచ్చి బంగారమ్మ బాలికలకు తప్పకుండా ఇంగ్లిషు విద్య చెప్పించాలని వాదించారు. ‘‘ఇంగ్లీషుభాష జ్ఞానము వలన మరింత మనోవికాసత గల్గును. యుక్తాయుక్త సమయముల నారయ, తారతమ్యముల నారయ, విశేష యోచన శక్తి గల్గును’’ అన్నారు. ‘‘స్త్రీలు కూడా లౌకిక విషయములో ప్రతిదాని యందును కొంచెము కొంచెము జ్ఞానము సంపాదించినగాని లోకయాత్రకు వీలుండదు . . . వివిధ విషయములయందు జ్ఞానము గలిగించు విద్య మనకిప్పుడు ఇంగ్లిషు విద్యాగారములలోనే లభించుచున్నదిగాని యితరత్ర లభించుటలేదు.’’ కాబట్టి బాలికలు తప్పకుండా ఇంగ్లిషు నేర్చుకోవాలన్నారు బంగారమ్మ. చదువుకోవడమనేది కేవలం ఉద్యోగాలు చేసి ఊళ్ళేలడానికి మాత్రమే కాదనీ, దానివల్ల ‘‘జ్ఞానము’’ కలుగుతుందనీ తెలిపి, ‘‘జ్ఞానమెవరికవసరముండదు?’’ అని ప్రశ్నించారు బంగారమ్మ (‘సంఘ సంస్కరణ విషయములు’, మే 1913, పు. 231`234). 1912 మే 16, 17 తేదీల్లో (విశాఖపట్నంలోని) భారతీ సమాజ (మహిళా సంఘం) వార్షికోత్సవానికి అధ్యక్షత వహించిన సౌభాగ్యవతి కందుకూరి వెంకాయామ్మారావు స్త్రీల స్థితిగతులపై దీర్ఘంగా ఉపన్యసించారు. ఆమె ప్రసంగ పాఠాన్ని ‘వివేకవతి’ ప్రచురించింది. వెంకాయమ్మారావు స్త్రీలకు ‘‘ఉన్నత విద్య’’ అవసరమా అనవసరమా అనే విషయాన్ని చర్చించారు. విద్యార్జన అంటే కేవలం చదవగలిగీ రాయగలిగీ వుండడమేనని చాలామంది భావిస్తున్నారనీ, కానీ ‘‘ఇది సరికాదని నా యభిప్రాయము’’ అన్నారు. సమాజానికి ఉపయోగపడేలా వైద్యశాస్త్రం మొదలైన ఉన్నత విద్యల్ని కూడా స్త్రీలు చదవాలనీ, కేవలం ‘‘అక్షర జ్ఞానము కలుగునంతనే విద్య పూర్తిjైునదని’’ అనుకోరాదన్నారు. ‘‘అక్షర జ్ఞానము కలుగుట, చదువ నేర్చుట, వ్రాయ నేర్చుట’’ తదుపరి విద్యార్జనకు సాధానాలు మాత్రమే అనీ, ‘‘ఇంతటితో మనము తృప్తి జెందరాదు’’ అనీ స్త్రీలకు పిలిపునిచ్చారు.