మన శరీరాలు, మనం : పునరుత్పత్తి హక్కులు -బెల్‌హుక్స్‌

సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభంలో ముందుకు తీసుకొచ్చిన ప్రాసంగిక సమస్యలన్నీ బాగా చదువుకుని, ఎంతో కొంత డబ్బున్న తెల్లజాతి స్త్రీల అనుభవాల నుండి పుట్టినవే. పౌర హక్కుల, లైంగిక విముక్తి ఉద్యమాల తర్వాత వచ్చిన స్త్రీ వాద ఉద్యమం స్త్రీల

శరీరం చుట్టూ ఉండే సమస్యల గురించి మాట్లాడటం అప్పుడు సరైందిగానే అనిపించింది. ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలు నమ్మబలికినట్లు స్త్రీవాద ఉద్యమం మిస్‌ అమెరికా ప్రదర్శన సమయంలో స్త్రీలు తమ బ్రాలు తగలబెట్టటంతోటో లేక తర్వాత గర్భ స్రావాలు చేయించుకోవటానికి లైన్‌ కట్టినప్పుడో ప్రారంభం కాలేదు. స్త్రీవాద ఉద్యమానికి మొట్టమొదటి ప్రేరణ`లైంగికత`స్త్రీలు ఎప్పుడు, ఎవరికి లైంగికంగా దగ్గరవ్వదలచుకుంటారు అన్న విషయం. పౌర హక్కులు, సామ్యవాద ఉద్యమాల వంటి రాడికల్‌ ఉద్యమాల్లో కూడా స్త్రీ శరీరాల లైంగిక దోపిడీ సర్వ సాధారణంగా జరిగేది.
లైంగిక విముక్తి ఉద్యమం తారా స్థాయిలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి స్వేచ్ఛాపూరిత శృంగారం (అంటే ఎవరితో కోరుకుంటే వారితో కావాల్సినంత శృంగారం చేసుకోవటం) వల్ల కలిగే అక్కర్లేని గర్భం పెద్ద సమస్యగా పరిణమించింది. స్వేచ్ఛాపూరిత శృంగారంలో ఆడవాళ్ళూ, మగవాళ్ళూ సమానంగా పాల్గొనాలంటే సురక్షితంగా, బాగా పనిచేసే గర్భనిరోధక సాధనాలు, అక్కర్లేని గర్భం వచ్చినపుడు తొలగించుకునే అవకాశం రెండూ అందుబాటులో ఉండాలి. వర్గ పరమైన ఆధిక్యత ఉన్న కొంతమంది తెల్ల జాతి స్త్రీలకి తప్ప, మిగిలిన వారికి ఇవి రెండూ అందుబాటులో ఉండేవి కాదు. అందుబాటులో ఉన్న ఆరోగ్య సదుపాయాలను కూడా పైవర్గాలకి చెందిన స్త్రీలు అక్కర్లేని గర్భం వచ్చిందనే అవమాన భారంతో వాడుకునే వాళ్ళు కాదు. 1960లు, 70లలో సురక్షితమైన గర్భస్రావాలు సాధికారంగా కావాలంటూ అరచి గగ్గోలు పెట్టిన ఆడవాళ్ళందరూ చట్టబద్ధత లేని గర్భస్రావాల విషాదం, అక్కర్లేని గర్భాల వల్ల బలవంతపు పెళ్ళిళ్ళు చేసుకోవాల్సి రావటంతో కలిగే యాతన అనుభవించిన వాళ్ళే. మనలో చాలా మంది ఇటువంటి ప్రతిభావంతులయిన, సృజనాత్మకత కలిగిన స్త్రీలకి అక్కర్లేని, అనుకోకుండా వచ్చిన గర్భాల వల్ల పుట్టిన పిల్లలమే. జీవితం ఇచ్చిన చేదు అనుభవం పట్ల వారి కోపం, కటుత్వం, ఆశా భంగం చూసిన వాళ్ళమే. మా తరం అందరికీ స్త్రీలు, పురుషులకి మెరుగైన, సురక్షితమైన గర్భ నిరోధక సాధనాలు లేకుండా, గర్భస్రావ హక్కులు లేకుండా స్త్రీ పురుష విముక్తి అసాధ్యమనే స్పష్టత వచ్చింది.
సమగ్రంగా స్త్రీల పునరుత్పత్తి హక్కులపై దృష్టి పెట్టకుండా గర్భస్రావ హక్కులనే ప్రధానం చెయ్యటం ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన పైవర్గానికి చెందిన స్త్రీల పక్షపాత దృష్టి కోణాన్ని ప్రతిబింబించిందని వెనక్కి తిరిగి చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. గర్భస్రావ హక్కు అప్పుడూ, ఇప్పుడూ ప్రధానమైనదే. అయితే పునరుత్పత్తికి సంబంధించిన ఇతర ఆవశ్యక సమస్యలపైన కూడా దృష్టి పెట్టి ఉంటే పెద్ద ఎత్తున ప్రజలని కూడగట్టడానికి అవకాశం వచ్చి ఉండేది. అందరికీ సెక్స్‌ గురించిన మౌలికమైన పరిజ్ఞానాన్ని అందించటం (సెక్స్‌ ఎడ్యుకేషన్‌), గర్భంతో ఉన్న స్త్రీలకి అవసరమైన సంరక్షణ (ప్రినేటల్‌ కేర్‌), రోగ నిరోధక ఆహార సంరక్షణ (ప్రివెంటివ్‌ హెల్త్‌కేర్‌) వంటి విషయాలపై దృష్టి పెట్టి ఉంటే ఆడవాళ్ళకి తమ శరీరాల గురించి కొంత జ్ఞానంతో పాటు బలవంతపు గర్భ నిరోధక ఆపరేషన్లు, అనవసరమైన సిజేరియన్‌, గర్భ సంచి తీసివేత ఆపరేషన్లు, వాటితో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అర్థమై ఉండేది. ఆయా సమస్యలన్నింటిలో మధ్య తరగతి తెల్లజాతి స్త్రీలు అనవసర గర్భస్రావ సమస్య వల్ల స్త్రీలు పడే యాతనలో తమని తాము చూసుకున్నారు. అందువల్లే గర్భస్రావ సమస్యని ఎత్తి చూపారు. సురక్షిత, చట్టబద్ధ గర్భస్రావ సేవలు వారికి మాత్రమే కాదు అనేకమంది స్త్రీలకు అవసరం. ముందే చెప్పినట్లు శ్రామిక వర్గ స్త్రీల కంటే వారికే అటువంటి సేవలు అందుబాటులో ఉండే అవకాశమెక్కువ. నల్లజాతి స్త్రీలతో సహా, పేద స్త్రీలందరూ అనధికార గర్భస్రావాన్ని చేయించుకున్నవాళ్ళే. గర్భస్రావ హక్కు కేవలం తెల్లజాతి స్త్రీల సమస్య కానే కాదు. అయితే అత్యధిక శాతం అమెరికన్‌ స్త్రీలకి పునరుత్పత్తికి సంబంధించి మాత్రమే సమస్య కాదు.
పూర్తిగా సురక్షితం కాకపోయినప్పటికీ బాగా పనిచేసే గర్భ నిరోధక మాత్రలు (తమలోని సెక్సిజం వదులుకోని మగ శాస్త్రవేత్తలు సృష్టించినవి) రూపొందించటం గర్భస్రావ సంబంధిత హక్కుల కంటే స్త్రీల లైంగిక విముక్తికి ఎక్కువ పనికొచ్చాయి. నా టీనేజి వయసు చివర్లో అందరికీ అందుబాటులోకి వచ్చిన ఈ మాత్రల వల్ల మాలో చాలా మందికి అనవసరమైన గర్భంతో వచ్చే భయం, అవమానం అనుభవంలోకి రాలేదు. స్త్రీలకి గర్భం ధరించే విషయంలో స్వేచ్ఛ ఉండాలి అనే నాలాంటి అనేక మందికి ఈ గర్భ నిరోధక మాత్రలు బాధ్యతాయుతమైన లైంగిక స్వేచ్ఛని కల్పించాయి. మాలో చాలామంది అనవసర గర్భ అనుభవం వ్యక్తిగత జీవితాల్లో తెలిసి ఉండటం వల్ల స్వేచ్ఛాయుత గర్భస్రావానికి అనుకూలంగా ఉండేవాళ్ళం కాదు. దానికి కారణముంది. లైంగిక విముక్తి ఉద్యమమప్పుడు నాకెప్పుడూ అక్కర్లేని గర్భం రాలేదు కానీ, నా స్నేహితులు చాలామంది జాగ్రత్తగా మాత్రలు వాడటానికి బదులు గర్భం వస్తే తీయించుకోవటం సరైందని భావించేవాళ్ళు. గర్భస్రావాన్ని చాలాసార్లు గర్భ నిరోధక సాధనంగా వాడేవాళ్ళు. మాత్రలు వాడే స్త్రీలకి తాము తమ లైంగిక స్వేచ్ఛని ఎలా వాడుకోవాలో స్వంతంగా నిర్ణయించుకోవాల్సి వస్తుంది. కానీ అలా బాధ్యతాయుతంగా ప్రవర్తించే స్త్రీలను మగవాళ్ళు చాలాసార్లు బరితెగించిన స్త్రీలుగా పరిగణించేవాళ్ళు. కొంత మంది ఆడవాళ్ళకి ఏదన్నా అయిన తర్వాత గర్భస్రావం ద్వారా ఆ ‘సమస్యని పరిష్కరించుకోవడం’ తేలికని అనిపించేది. రెండు పద్ధతులు… పలుసార్లు గర్భస్రావం చేయించుకోవటం, ఈస్ట్రోజన్‌ ఎక్కువ ఉండే గర్భ నిరోధక మాత్రలు వాడటం. రెండూ కూడా ప్రమాదకరమైనవే అని మనకి ఇప్పుడు తెలుసు. లైంగిక స్వేచ్ఛ కోసం స్త్రీలు ఇటువంటి రిస్కులు తీసుకోవటానికి సిద్ధమయ్యారు.
గర్భస్రావం స్త్రీల హక్కు అనటం క్రిస్టియన్‌ ఛాందస వాద ఆలోచనకి సవాలుగా పరిణమించటం వల్ల ప్రసార సాధనాల దృష్టిని ఈ విషయం బాగా ఆకర్షించింది. స్త్రీలుగా పుట్టింది పిల్లల్ని కనటం కోసమేనన్న ఆలోచనని ఈ ఆలోచన తీవ్రంగా సవాలు చేసింది. స్త్రీల శరీరాల పట్ల అమెరికాలో గర్భస్రావ హక్కు కలిగించిన ఆసక్తి ఇతర ఏ పునరుత్పత్తికి సంబంధించి ఎన్ని సమస్యలు ముందుకు తీసుకొచ్చినా అవి ప్రసార మాధ్యమాల దృష్టిని ఆకర్షించలేకపోయాయి. సిజేరియన్‌, హిస్టరెక్టమీ శస్త్ర చికిత్సల వల్ల కలిగే దీర్ఘకాలిక సమస్యలు వాటి దృష్టికి ఆనలేదు. ఆ సమస్యలు వ్యక్తీకరణలు, పెట్టుబడిదారీ పితృస్వామ్యంలో పురుషాధిక్య వైద్య వ్యవస్థ స్త్రీల శరీరాల్ని నియంత్రించి వాటితో ఇష్టమొచ్చినట్లు ఆడుకోవటాన్ని ప్రశ్నించాయి. సంప్రదాయికత, స్త్రీవాద వ్యతిరేకత లోతుగా పాతుకొని ఉండే ప్రసార మాధ్యమాలకి వైద్య వ్యవస్థలో స్త్రీలకి జరిగే ఇటువంటి అన్యాయం మరీ రాడికల్‌గా అనిపించి ఉండవచ్చు. 1960లు, 1970లలో స్త్రీ వాద యాక్టివిస్టులు 1990లలో స్త్రీల పునరుత్పత్తి హక్కుల గురించి పెద్ద ఎత్తున యుద్ధం చేయాల్సి వస్తుందని ఊహించి ఉండరు. సాంస్కృతిక విప్లవం సృష్టించి ప్రమాదం లేని గర్భ నిరోధక మాత్రలు, సురక్షితమైన, చట్టబద్ధమైన గర్భస్రావ సేవలు ఉపయోగించుకోవటం అందరికీ ఆమోద యోగ్యం చేసిన తర్వాత ఆయా హక్కులు నిరంతరం కొనసాగుతాయని స్త్రీవాద ఉద్యమం భావించింది. సంఘటితమైన, ప్రజా స్త్రీవాద ఉద్యమం అంతరించి పోయి, మతాన్ని సనాతన దృక్పథంతో చూసే మితవాద రాజకీయ కూటములు తీవ్రంగా స్త్రీవాద వ్యతిరేకతని ప్రేరేపిస్తున్న సందర్భంలో గర్భస్రావ సమస్య మళ్ళీ రాజకీయ ఎజెండాలోకి వచ్చింది. స్త్రీలకి గర్భ స్రావం చేయించుకునే హక్కు ప్రశ్నార్థకమైంది.
ఈ గర్భస్రావ వ్యతిరేక కూటమి ప్రభుత్వ నిధులతో, చౌకగా, ఖర్చు లేకుండా గర్భస్రావ సేవలని అందించే సదుపాయాలపై తీవ్రంగా దాడులు జరిపింది. దీని పర్యవసానం ఏంటంటే, డబ్బున్న అన్ని జాతుల స్త్రీలకి ఈ గర్భస్రావ సేవలు, అంటే, ఆ హక్కు అందుబాటులో
ఉంటోంది కానీ, డబ్బు లేని స్త్రీలు మాత్రం ఏ సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పునరుత్పత్తి హక్కులకు సంబంధించిన ఆరోగ్య సేవలకు ప్రభుత్వం నిధులివ్వకపోవటంతో పేద, శ్రామిక వర్గ స్త్రీలు గర్భస్రావ హక్కుని పూర్తిగా కోల్పోయారు. డబ్బున్న స్త్రీలకి ఇప్పటికీ ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ అత్యధిక శాతం స్త్రీలు ఈ వర్గానికి చెందరు. ఇదివరకటికన్నా ఎక్కువమంది స్త్రీలు పేదరికంలోకి నెట్టబడుతున్నారు. చౌకగా, సురక్షితంగా, ఖర్చు లేని గర్భస్రావ సేవలు అందుబాటులో లేకపోవడంతో తమ శరీరాలపై నియంత్రణ కోల్పోతున్నారు. బాగా డబ్బున్న స్త్రీలకి మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంచే ప్రయత్నంలో ప్రభుత్వ విధానాలు గర్భస్రావాన్ని దాదాపు చట్ట వ్యతిరేకంగా మార్చేస్తున్నాయి. సాంప్రదాయిక రాష్ట్రాల్లో ఇది ఇప్పటికే జరుగుతోంది. అన్ని వర్గాల స్త్రీలు అనివార్యంగా గర్భస్రావాన్ని సురక్షితమైన, చట్టబద్ధమైన, చౌకగా దొరికే సేవగా అందేటట్లు చేయడానికి కలిసి పనిచేయాలి.
అయితే గర్భస్రావం చేయించుకోవాలా, వద్దా అన్న విషయం స్త్రీల పునరుత్పత్తి హక్కులలో ఒక భాగం మాత్రమే. ఆయా స్త్రీల వయసు, జీవన పరిస్థితులు ఆమెకి పునరుత్పత్తి హక్కులలో ఏ విషయం ప్రధానమవుతుందో నిర్ణయిస్తాయి. 20, 30 వయసు మధ్యలో లైంగికంగా చురుగ్గా ఉండే స్త్రీలకి గర్భ నిరోధక సాధనాలు సురక్షితం, చట్టబద్ధం. చౌకగా ఉండే గర్భస్రావ సేవలు ప్రాసంగికమైన పునరుత్పత్తి హక్కు. అయితే ముట్లు పోయే వయసులో ఉన్న స్త్రీలకి వైద్యులు గర్భ సంచి తీసెయ్యాలి అని చెప్తున్నపుడు అదే ఆమెకి అవసరమయిన పునరుత్పత్తి హక్కుకి సంబంధించిన సమస్య అవుతుంది.
మనం స్త్రీవాద ఉద్యమాన్ని మళ్ళీ ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రయత్నిస్తున్నప్పుడు పునరుత్పత్తి హక్కులకి మన ఎజెండాలో కేంద్ర భాగం అవ్వాలి. మన శరీరాలపై నియంత్రణ లేకపోయినప్పుడు మనం ఇతర అన్ని హక్కులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. స్త్రీవాద ఉద్యమం పునరుజ్జీవనం పొందినప్పుడు పునరుత్పత్తి హక్కులు, ఇతర అన్ని హక్కుల కన్నా ప్రధానమవుతాయి. సురక్షిత, చట్టబద్ధమైన, చౌకగా లభించే గర్భస్రావ సేవల కోసం చేసే ప్రయత్నం కొనసాగుతూనే ఉండాలి. కానీ అదొక్కటే మన ఎజెండాలో భాగం కాకూడదు. సెక్స్‌కి సంబంధించిన విద్య, రోగ నివారణ కోసం కావాల్సిన ఆరోగ్య సేవలు, గర్భనిరోధక సాధనాలు అందుబాటులో ఉంటే అనవసర గర్భం ధరించే వాళ్ళు చాలా తక్కువ అయిపోతారు. దాంతో ఆయా సేవల అవసరం కూడా తగ్గిపోతుంది.
గర్భస్రావ సేవలు పోగొట్టుకుంటే స్త్రీల పునరుత్పత్తి హక్కుల కోసం జరిగే పోరాటం దెబ్బతిని అన్ని విషయాలలో వెనక్కి పోయే ప్రమాదం ఉంది. గర్భస్రావ హక్కు స్త్రీలకి ఉండకూడదు అని ఉద్యమించే వాళ్ళందరూ మౌలికంగా స్త్రీవాద వ్యతిరేకులు. వ్యక్తిగత జీవితంలో ఎప్పుడూ గర్భస్రావాన్ని చేయించుకోము అని నిర్ణయం తీసుకున్న వాళ్ళందరికీ కూడా స్త్రీవాద రాజకీయాలకి నిబద్ధులయినప్పుడు అందరికీ ఈ సేవలు అందుబాటులో ఉండాలని, స్త్రీలకి ఈ హక్కు ఉండాలని అడగటం అవసరం. సురక్షితమయిన గర్భస్రావ సేవలు అందుబాటులో ఉన్న కాలంలో పెరిగి పెద్దయిన యువతులకు, అవి లేనప్పుడు స్త్రీలు ఎంత నరకం అనుభవించాలో అర్థం కాదు.
పునరుత్పత్తి హక్కుల జాబితాలో ఉండే వివిధ విషయాలు, సమస్యలపై అవగాహన పెరగాలంటే, అవి ఎందుకు ప్రధానమైనవో అర్థం కావాలంటే అన్ని వయసుల స్త్రీలు, మగ స్నేహితులూ వాటి గురించి విస్తృతంగా చర్చించుకోవాలి. అలా వచ్చే అవగాహన అందరి ఆడవాళ్ళకీ పునరుత్పత్తి హక్కులని అందించే ప్రయత్నాలకు మనల్ని నిబద్ధులుగా ఉంచుతుంది. మన స్వేచ్ఛ, స్వాతంత్రాలని కాపాడుకోవాలంటే పునరుత్పత్తి హక్కులపై స్త్రీవాద దృష్టి కేంద్రీకరించటం అత్యవసరం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.