భూమిక నా జీవితంలో ఒక భాగం
సత్యవతి గారికి,
మీ పట్టుదల, అకుంఠిత దీక్షతో ‘‘భూమిక’’ను 30 సంవత్సరాలు నడిపించారు. అప్పుడే 30 సంవత్సరాలు నిండినాయా? అనిపిస్తుంది. ఎన్నో ఆటుపోట్లు, ఒడిదుడుకులను,
ఆర్థికంగా ఎదుర్కొని నడిపించారు. కంగ్రాచ్యులేషన్స్. భూమిక నా జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. మొదటి నుంచి భూమికను చూశాను. నాకు ఎన్నో నేర్పించింది. నేను ఇప్పటికీ భూమిక సభ్యురాలిగానే భావిస్తున్నాను. భూమిక అంటే మనది, అందరిదీ అని నా అభిప్రాయం. భూమిక ఇంకా ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.
80 సంవత్సరాలకు పైబడి వయసు ఉన్న మహిళల జీవితానుభవాలను మీరు భూమికలో ప్రచురిస్తే ఈ తరం వారికి మార్గదర్శకంగా ఉంటుంది. మనలాంటి వారికి వారి అనుభవాలు ఒక పాఠం అవుతుందని నా అభిప్రాయం. ఆలోచించండి.
` ప్రసన్నకుమారి