30 సంవత్సరాల పుట్టినరోజు జరుపుకుంటున్న భూమిక పత్రికకు ఒక ప్రత్యేకత ఉంది. అది స్త్రీవాద పత్రిక అంట. అది కేవలం స్త్రీలు చదువుకునే పత్రిక కాదు, అది అందరూ చదవలగలిగిన పత్రిక. కానీ దానిలో ప్రచురించబడే రచనలు మాత్రం స్త్రీలకు సంబంధించినవి మాత్రమే. స్త్రీల
సమస్యలను చిత్రించే రచనలను ముద్రించేది. ఇటువంటి రచనలు ముద్రించే పత్రికలు, స్త్రీవాదం ఉద్భవించిన కాలంలో కొన్ని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వచ్చాయి. కానీ అవి ఎక్కువకాలం పాఠకులు లేక పోవడం వల్లనో, ఆర్థిక సమస్యల వల్లనో, ఏవో ఇతర సమస్యల వల్లనో అవి ఎక్కువ కాలం నడవలేదు. తెలుగులో ప్రచురించబడిన భూమిక మాత్రమే ఇప్పుడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకన్న నవయువతిగా ఇంకా పృష్టిగా నడుస్తోంది. కాగితం లోటు, ఆర్థిక సమస్యలు, కరోనా వంటి దుర్దినాలు చాలా అలవోకగా దాటి, భూమిక మునుపటి రూపంతో పాఠకులకు దర్శనం ఇస్తూనే ఉంది. భూమిక హైదరాబాద్‌లో స్త్రీ వాదం గణనీయంగా తలెత్తినప్పుడు పుట్టింది. స్త్రీవాద సమస్యలను అన్ని కోణాల నుంచి చిత్రిస్తున్న రచనలను భూమిక ప్రచురిస్తోంది. భూమిక అంటేనే రచన అని అర్థం. అటువంటి భూమిక ఎన్నో విధాలైన వ్యాసాలు, కథలు, నవలలు, కవితలు మొదలైన రచనలను, ఎన్నో ప్రక్రియలలో స్త్రీలు రచించినవి, పురుషులు రచించినవి, విదేశాల్లో రచించినవి, విదేశీ పాఠకులు అభిమానిస్తూ రాసిన లేఖలు, ఇక్కడ పాఠకులు అభినందిస్తూ, అభిమానిస్తూ రాసిన లేఖలను పాఠకులకు అందిస్తోంది. ఇది కేవలం అలరింపచేసేది కాదు, కేవలం పొద్దుపుచ్చేది కాదు. ఈ భూమిక రచన విజ్ఞానాన్ని అందించేది, మనసులను పదును పెట్టేది, ఉద్యమాలకు ప్రేరణనిచ్చేది, స్త్రీలను తమ సమస్యలను ఆలోచింపచేసేది, మంచి కార్యానికి ప్రేరేపించేది. అందుకే ఇన్నాళ్ళుగా తలెత్తుకొని నిరాటంకంగా ముందుకు నడుస్తోంది.
`ముదిగంటి సుజాతారెడ