రెండో తల్లి పోరు – ముమ్మిడి వీణా సుభాషిణి, 9వ తరగతి

అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న, కూతురు చాలా బాధపడ్డారు. ఒకరోజు తండ్రి ‘నా కూతురికి తల్లి కావాలి. అలాగయితే నేను మరో పెళ్ళి చేసుకోవాలి’ అనుకుని వెళ్ళి కూతురిని అడిగాడు. అందుకు కూతురు ‘సరే’ అని చెప్పింది.

తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు.
మొదటిలో రెండో తల్లి బాగా చూసుకుంది. కొన్నాళ్ళయ్యాక ఆవిడకి ఒక కూతురు పుట్టింది. అప్పటి నుండి రెండో తల్లి తనని అసలు పట్టించుకోకపోవడమే కాక బాగా తిట్టేది, కొట్టేది. తనూ, చెల్లీ కలిసి జిల్లా ప్రజాపరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్ళేవారు. తను చాలా బాగా చదివేది. తన చెల్లి అసలు చదివేది కాదు. అక్క పేరు మణి, చెల్లి పేరు రాణి. ఒకరోజు, ‘అమ్మా నాకు ఈ స్కూలులో అసలు చదువు రావడం లేదు. ఈ స్కూల్లో టీచర్లు చదువు బాగా చెప్పడం లేదు’ అంది రాణి.
‘అవునా తల్లీ, అలాగే. మరి నువ్వు ఏ స్కూల్లో చదువుతావు’ అడిగింది అమ్మ.
‘నేను ప్రైవేటు స్కూల్లో చదువుతాను’
‘అంత డబ్బు మన దగ్గర లేదు తల్లీ’
‘నాకు తెలియదు. నేను ప్రైవేటు స్కూల్లోనే చదువుతాను. ఇక మీ ఇష్టం’ అంది రాణి.
రెండో తల్లి మణిని ఎప్పుడూ బాగా చూసేది కాదు. స్కూలుకి వెళ్ళేటపుడు ఇంటి దగ్గర పనంతా చేసి వెళ్ళమనేది. అప్పుడు మణి ఎంతో కష్టపడి పనులు పూర్తిచేసి తర్వాత కూర్చుని చదువుకొనేది. రెండో తల్లి తన భర్తతో ఇలా చెప్పింది, ‘ఏమండీ మన కూతుర్ని ప్రైవేటు స్కూల్లో వేద్దాం’ అని. ‘అంత డబ్బు మన దగ్గర లేదుగా, ఇద్దర్నీ ఎలా చదివిస్తాం చెప్పు’ అన్నాడు నాన్న.
‘ఇద్దర్నీ ఎందుకు? రాణిని మాత్రమే ప్రైవేట్‌ స్కూలుకు పంపిద్దాం’ అంది.
అప్పుడు మణి, ‘నాన్నా నేను గవర్నమెంటు స్కూల్లోనే చదువుతాను’ అంది.
‘అలాగే తల్లీ’ అన్నాడు నాన్న. ఒకరోజు ఎఫ్‌`2 పరీక్ష పేపరు. పదవ తరగతిలో మణికి 100కి 90 మార్కులు వచ్చాయి. కానీ ప్రైవేట్‌ స్కూల్లో చదివిన రాణికి 100కి 50 మార్కులు తెచ్చుకుంది. అలా ఇద్దరూ ఇంటర్‌కి వెళ్ళారు.
ఒకరోజు రాణి, ‘అమ్మా నాకు ఈ రోజు నుండి అన్నం వద్దు’ అంది.
‘అన్నం వద్దా? మరి ఏం కావాలి చెప్పు.’
‘మా ఫ్రెండ్సందరూ పిజ్జా, బర్గర్‌ తెచ్చుకుని తింటున్నారు. మరి నేను అన్నం తింటున్నాను.’
‘నాకు అవి తయారు చేయడం రాదు కదా తల్లీ.’
‘నాకు తెలియదు. నాకు కావాలి, లేకపోతే నేను కాలేజీకి వెళ్ళను.’
‘అలాగే నేను చేస్తాను’ అని చెప్పింది అమ్మ.
పరీక్షలు వచ్చాయి. మణికి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం వచ్చింది. రాణి పాస్‌ అయింది, అంతే.
దీంతో తండ్రి, ‘చూశావా గవర్నమెంట్‌ స్కూల్‌ అంటే చులకనగా చూశావు, మీ అక్క గవర్నమెంట్‌ స్కూల్లో చదివి, గవర్నమెంట్‌ కాలేజీలో చదివి మొదటి స్థానంలో వచ్చింది’ అన్నాడు. దాంతో రాణికి అక్క మీద కోపం.
ఒకరోజు అందరూ ఇంట్లో ఉన్నారు. టీవీ చూస్తుండగా ఒక పాము వచ్చింది. అది తన రెండో తల్లిని కాటు వేయబోయింది. అప్పుడు మణి వచ్చి దాన్ని కర్రతో కొట్టి తీసుకువెళ్ళి బయటపడేసింది.
అప్పుడు రెండో తల్లి ఇలా అడిగింది, ‘మణీ, నేను నిన్ను చాలా బాధపెట్టాను కదా. మరి నువ్వు నన్ను ఎందుకు కాపాడావు? నా మీద నీకు కోపం రాలేదా?’ ‘అమ్మా నువ్వు నన్ను ఎంత బాధపెట్టినా నువ్వు నా తల్లివి. నేను నిన్ను కాపాడుకుంటాను.’
‘కానీ నేను ఎప్పుడూ నిన్ను నా కూతురువని అనుకోలేదు. నన్ను క్షమించు తల్లీ’ అంది.
అప్పటి నుండి అందరూ ఎటువంటి భేదభావాలు లేకుండా ఎంతో హాయిగా ఉన్నారు. పాలు, నీళ్ళు ఎలా కలిసి ఉంటాయో అలా అమ్మ, కూతుర్లు కలిసిపోయారు.
` ,

Share
This entry was posted in పిల్లల భూమిక. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.