చిన్ని చిన్ని ఆశ – వి. ప్రతిమ

‘‘బాలలు భావి పౌరులు…’’ అన్న మాట చిన్నప్పుడు మా బళ్ళో తరచుగా వినబడుతుండేది. పిల్లల్ని మనం సరైన దారిలో మళ్ళించగలిగితే ఒక అభ్యుదయ సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని ఆ మాటకర్ధం అని ఎదుగుతున్న క్రమంలో అర్థమైంది.

అయితే నూతన కార్మిక వర్గం ఏర్పాటు, న్యూక్లియర్‌ కాపురాల వేర్పాటు నేపథ్యంలో నుండి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు దూరమైపోయాక, కథల బంగారులోకం కరిగిపోయాక, పిల్లలు ఇంటా, బయటా మార్కుల మాయాజాలంలో ఇరుక్కుపోయాక, డబ్బు సంపాదనే ఏకైక విలువగా మారిపోయాక, పిల్లలకి జీవితపు విలువలు నేర్పించడానికి, వారిని భావి సమాజ నిర్మాతలుగా మలచడానికి ఇప్పుడిక్కడెవరికీ సమయం లేదు… చివరికి తల్లిదండ్రులకి కూడా.
ఈ నేపథ్యంలోంచి అపురూపమైన, చైతన్యపూరితమైన జాతీయ, అంతర్జాతీయ పిల్లల సినిమాలని తాను చూసి ఆనందించడమే కాకుండా ఆ సినిమాలు పిల్లల్ని ఎంతగా ఆనందింపచేస్తాయో, ఎంతగా చైతన్యపరుస్తాయో, ఎంత స్ఫూర్తినిస్తాయో చెప్తూ శివలక్ష్మి రాసిన సమీక్షల సమాహారం ‘‘చిగురంత ఆశ…’’
శివలక్ష్మి క్రమం తప్పకుండా బాలల చలన చిత్రోత్సవాలలో చూసిన సినిమాలు ఆమెను ఎంతగా ప్రభావితం చేశాయో, అటువంటి సినిమాలు చూడడం వల్ల పిల్లలు ఎంత ప్రభావితమవుతారో అర్థం చేయిస్తుంది ఈ పుస్తకం.
పిల్లల డాక్టర్‌ డా.నళిని రాసిన ముందుమాట ఈ పుస్తకానికి మణిమకుటంలా అమరింది.
… … …
బాలల హక్కుల గురించి ప్రస్తావన వచ్చినపుడు మనం జెనీవా డిక్లరేషన్‌ గురించి చెప్పుకుంటాం కానీ, నిజానికి బాలల హక్కుల గురించి పరిశోధించి, ఒక ప్రణాళికతో కృషి చేసి, కొన్ని మౌలికమైన ప్రతిపాదనలతో ఒక అంతర్జాతీయ పత్రాన్ని రూపొందించి ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది ఎగ్లాంటైన్‌ జేబ్‌… ఆ విధంగా బాలల హక్కుల ప్రప్రథమ రూపకర్త ఎగ్లాంటైన్‌ జేబ్‌ గురించిన ప్రత్యేక వ్యాసం మనని ఈ పుస్తకం లోపలికి ఆహ్వానిస్తుంది.
పిల్లల హక్కుల కోసం ఆమె ఆరాట పోరాటాలు, పిల్లల సమస్యల పట్ల ఆమె పడే తపన, ఆవేదన చూసి ఆ కాలంలో అంతా ఆమెని శ్వేతజ్వాల అని పిలిచేవారట.
‘‘మానవజాతి పిల్లలకు ఋణపడి ఉందని, ప్రపంచానికి అంతా అర్థమయ్యే అంతర్జాతీయ భాష పిల్లల ఏడుపు ఒక్కటే’’ అనే ఎగ్లాంటైన్‌ జేబ్‌ కృషికి కొనసాగింపుగా బాలల చలన చిత్రోత్సవాలు అందుబాటులోకి వచ్చాయని అర్థం చేయిస్తుంది ఈ వ్యాసం.
ఈ బాలల చలన చిత్రోత్సవాల గురించి చిలక్కి చెప్పినట్లుగా చెప్పి నన్ను హైదరాబాద్‌ వచ్చి ఈ సినిమాలు చూడమని చాలాసార్లు ఆహ్వానించింది శివలక్ష్మి. నా పని ఒత్తిళ్ళలో పడి ఒక్కసారి కూడా తన మాట మన్నించలేకపోయాను.
శివలక్ష్మి రాసిన సినిమా సమీక్షలను అక్కడక్కడా చదివి నేనేం పోగొట్టుకున్నానో అర్థమయ్యేది.
ప్రతి సినిమానీ ఒకటికి రెండుసార్లు, మూడుసార్లు చూసి అర్థం చేసుకుని కథా సంవిధానంనీ, చిత్రీకరణనీ అవగాహనకి తెచ్చుకుని ఒక అంకితభావంతో శివలక్ష్మి చేసిన సమీక్షలు సాహితీ లోకంలో బహుధా ప్రశంసలందుకోవడం అతిశయోక్తి కాదు.
సమీక్షలు రాయడానికంటే పుస్తక రూపంలో తీసుకురావడానికి ఆమె పడిన శ్రమ, ప్రూఫ్‌ రీడిరగ్‌ విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధ అక్షర మక్షరంలో స్పష్టమవుతుంది మనకి.
అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్ట్‌లో చిత్రీకరించబడిన ‘‘తైనా’’ సినిమా ట్రయాలజీ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. తైనా పాత్ర ఎంపిక కోసం సుదీర్ఘ కాలం పాటు ఆ దర్శకురాలి అన్వేషణ మనని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
సర్వవిధాలుగా విధ్వంసానికి గురవుతోన్న ప్రకృతి పట్ల ఆందోళన చెందుతూ సమాజంలో స్థిరమైన అభివృద్ధి జరగాలన్నా, మానవ మనుగడ ప్రశాంతంగా ఉండాలన్నా మొత్తంగా ప్రకృతితో మనుషులు ఎంత సామరస్యంగా ఉండాలో అర్థం చేయిస్తుంది ఈ సినిమా. ప్రకృతి పట్ల, పర్యావరణం పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలో ఆ ముగ్గురు చిన్నారుల ద్వారా, ప్రధానంగా ఆ చిన్నారి తైనా ద్వారా అద్భుతంగా రూపొందించబడిన ఈ చిత్రం ప్రేక్షకులను తన్మయత్వానికి గురిచేస్తుంది.
కేవలం వ్యాపారదృష్టితో హడావిడిగా సినిమాలు తీసిపారేసే మన తెలుగు దర్శకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉందని పదే పదే అనిపించింది. ఈ సమీక్షలు చదువుతున్నప్పుడు విజ్ఞానంతో పాటు వినోదాన్ని కూడా అందించడం ఈ సినిమాల ప్రత్యేకత అని తెలుస్తుంది.
ఎనిమిది నిమిషాల వ్యవధిలో రూపొందించబడిన అతి చిన్న సినిమా ‘‘చింటీ’’ మానవాళికి గొప్ప సందేశాన్ని, ఎదుగుతున్న పిల్లలకు అనంతమైన స్ఫూర్తిని రగిలిస్తుందని ఆ సినిమా సమీక్ష చాలా సూక్ష్మస్థాయిలోకి వెళ్ళి అర్థం చేయిస్తుంది.
తన లక్ష్యసాధన కోసం చింటీ అన్న చిట్టి చీమ పడిన కష్టాలు ఎవరికి వాళ్ళు చూసి తీరాల్సిందే అంటుంది రచయిత్రి. రష్యన్‌ ఫెడరేషన్‌ నుంచి వచ్చిన ఈ సినిమా పండిరచిన అవార్డుల పంట కూడా చిన్నదేమీ కాదు.
… … …
కాటికాపరి కూతురు లూసియా’ అన్న సినిమా ప్రపంచీకరణ మూలగా వేగవంతమైపోతున్న జీవితం, మానవ సంబంధాల విచ్ఛిన్నం, సమాజాన్ని చుట్టుముడుతోన్న అనేక రకాల సమస్యలు… వీటన్నింటినీ లూసియా అన్న చిన్న పాప దృష్టి కోణం నుండి అద్భుతంగా చిత్రించి పిల్లల్ని, పెద్దల్ని కూడా చైతన్యపరుస్తుంది దర్శకురాలు.
ఇది ఎస్టోవియా అన్న చిన్న దేశం నుంచి వచ్చిన ఆలోచనాత్మకమైన సినిమా.
జర్మనీలోని జార్జియా… రష్యాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం యుద్ధ ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో నుండి ‘దాటో’ అన్న స్థానికేతర (రష్యన్‌) బాలుడికి, తల్లితో పాటు సౌత్‌ ఇబనాన్‌ నుండి శరణార్ధిగా వచ్చిన ‘తమాల్‌ అన్న బాలికకు మధ్య స్కూల్లో ఏర్పడిన విరోధ భావనలు… ఆ తర్వాత క్రమంగా వెల్లివిరిసిన స్నేహ భావనలు అద్భుతమైన వస్తురూపాలతో కూడిన చిత్రీకరణ ‘‘ఎ గర్ల్‌ ఫ్రమ్‌ గోరీ’’. జాతులకతీతంగా, ప్రాంతాలకతీతంగా, దేశాలకతీతంగా ప్రచండమైన ఆగ్రహాలను సైతం సుందరమైన స్నేహాలుగా మార్చుకోవడం పిల్లలకు మాత్రమే సాధ్యం అన్న గొప్ప సత్యాన్ని చాటి చెప్తుంది ఈ సినిమా అంటుంది సమీక్షకురాలు.
కేవలం అంతర్జాతీయ సినిమాలనే కాకుండా మన తెలుగువాడైన గోవిందరాజు మరాఠీలో తీసిన ‘‘బంగారు మామిడిపండు (గోల్డెన్‌ మ్యాంగో)’’ ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనడమే కాక ప్రతిష్టాత్మకమైన ‘గోల్డెన్‌ ఎలిఫెంట్‌’కు ఎంపికైన ఇద్దరిలో గోవిందరాజు ఒకరు కావడం తెలుగు వారందరికీ గర్వకారణం.
ఒకటా, రెండా… ప్రతి సినిమా మనం మాట్లాడుకోదగినదే. అయితే అన్నింటి గురించీ ముచ్చటించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఈ పుస్తకం ఎవరికి వాళ్ళు చదివి అనుభూతి చెందాల్సిందే. ప్రతి తల్లిదండ్రులూ తమ పిల్లలకు చేరువ చేయాల్సింది, ప్రతి లైబ్రరీలోనూ చేరాల్సింది ఈ పుస్తకం.
… … …
ఎదురయ్యే ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ప్రధాన పాత్ర గమ్యం చేరడానికి చేసే స్ఫూర్తివంతమైన ప్రయాణం, గొప్ప నాటకీయమైన మలుపులతో ప్రేక్షకులను దృష్టి మరల్చకుండా ఉంచడమే మంచి సినిమా లక్షణమని కదా సినీ విజ్ఞుల ఉవాచ. అటువంటి గొప్ప జాతీయ, అంతర్జాతీయ పిల్లల సినిమాలను ఏరుకుని (ముఖ్యంగా మహిళా దర్శకులని) సవివరమైన విమర్శతో, కథాంశంతో పలు దృశ్యీకరణ అద్భుతాలను కూడా మన కళ్ళముందుంచిన శివలక్ష్మి అభినందనీయురాలు.
నళిని చెప్పినా, శివలక్ష్మి చెప్పినా మనందరం కలిసి గొంతు విప్పినా ఒకే మాట… ఈ అంతర్జాల మాయ నుండి పిల్లల్ని కాపాడుకోవాల్సిందే. బాధ్యతాపూరితమైన, ఆచరణ పూరితమైన నైతికత వైపునకు వారిని నడిపించాలంటే ఇటువంటి విలువలతో కూడిన సినిమాలను వారికి చేరువ చేయాల్సిందే.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.