ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటికి సంబంధించి అవసరమైన శిక్షణ – డి.జి.మాధవి

భూమిక పనిచేస్తున్న పది కమ్యూనిటీలలోని పేరా లీగల్‌ వాలంటీర్ల శిక్షణా కార్యక్రమం జూన్‌ ఐదవ తేదీన హోటల్‌ కినారా గ్రాండ్‌లో జరిగింది. రిసోర్స్‌ పర్సన్‌గా ట్రాన్స్‌ ఏక్టివిస్ట్‌ తాషి వచ్చారు. ఆమె ట్రాన్స్‌ వ్యక్తులకు

సంబంధించిన విషయాలు, హక్కుల గురించి పిఎల్‌విలందరికీ శిక్షణనిచ్చారు. ఆమె శిక్షణా కార్యక్రమంలో చెప్పిన విషయాలు:
ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు అనగానే ఎవరు గుర్తుకువస్తారు అని అడిగారు. దానికి గ్రూప్‌ మెంబర్లు సమాధానమిస్తూ ఒక పురుషుడు చీరలు కట్టుకుని ఉండడమని కొంతమంది, ఆడ మగ కాని వ్యక్తులు అని కొంతమంది, అలాగే హిజ్రా వ్యక్తులని కొంతమంది చెప్పారు. రోడ్డుమీద, దావత్‌లు, ఫంక్షన్లు అయినప్పుడు కనిపిస్తారు. ట్రాన్స్‌జెండర్ల గురించి మాట్లాడినపుడు, వాళ్ళ గురించి ఆలోచన వచ్చినపుడు వాళ్ళు నార్మల్‌ వ్యక్తులా లేదా నార్మల్‌ వ్యక్తులు కాదా అని అనిపిస్తుందా అని అడిగినప్పుడు నార్మల్‌ వ్యక్తులుగానే కనిపిస్తారని సమాధానమిచ్చారు. అప్పుడు రిసోర్స్‌ పర్సన్‌ మాట్లాడుతూ మన ఇళ్ళల్లో హిజ్రా వ్యక్తులు ఉంటే మనకు నార్మల్‌గానే అనిపిస్తుందా అని అడిగారు. వాళ్ళల్లో మంచివాళ్ళు కూడా ఉంటారు అని చెప్పారు. అలాగే ఆమె తనను తాషి అని పిలవాలని చెబుతూ, మీకందరికీ ఒక 30 సంవత్సరాల వయసు ఉంటుందా? 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇలాంటి ఒక మీటింగ్‌ పెట్టుకుంటామని, దానికి మీరందరూ అటెండ్‌ అవుతారని అనుకున్నారా అని అడిగారు. పార్టిసిపెంట్స్‌ అందరూ ఇప్పుడు మీటింగులకు వెళ్ళటం, పాటలు పాడుతూ రాసుకోవడం, నేర్చుకోవడం అన్నీ నార్మల్‌ అయ్యాయిÑ ఇప్పుడు మనం ఇవన్నీ నార్మల్‌ ఎలా అయ్యాయిÑ నార్మల్‌గా ఎప్పుడు తీసుకుంటున్నాం అనేది మాట్లాడుకుందాం అన్నారు. మనం రోజువారి జీవితంలో ఇది నార్మల్‌ కాదు, ఇది నార్మల్‌ అని మాట్లాడుకుందాం. మనిషి పుట్టినప్పటి నుంచి నార్మల్‌గా అనిపించేవి ఏది అని అడిగినపుడు పిల్లలను చదివించడం అని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. ఈ చదువా, ఆ చదువా అని కాకుండా ఏదైనా చదువుకోవాలిÑ పదవ తరగతి అయ్యాక కాలేజికి వచ్చాక ఏ చదువు నార్మల్‌ చదువు అని అడిగారు. పదవ తరగతి తర్వాత ఇంటర్‌ తర్వాత డిగ్రీ చేస్తే నార్మల్‌ చదువు. మన తెలుగు రాష్ట్రాలలో చూద్దాం. సాధారణంగా ఇంజనీరింగ్‌, డాక్టర్‌, బికామ్‌, బిఎస్‌సి… ఇలా చదవడం అనేది నార్మల్‌. ఇవి కాకుండా వీటి కింది స్థాయిలో ఉన్న చదువులు అయినా చదువుకుంటారు, ఏ చదువుకి ఏ స్థాయి ఉంటుంది, ఏ చదువుకి నార్మల్‌గా ఒప్పుకుంటారు అని అడిగారు. చదువు అయిపోయిన తర్వాత సంగతి ఏంటి అని అడిగారు. జాబ్‌ అని చెప్పగానే జాబేనా ఎవరూ పెళ్ళి చేసుకోరా అని అడిగారు. కొంతమంది జాబ్‌ తప్పనిసరి అని చెప్పారు. కానీ పెళ్ళయితే తప్పకుండా చేస్తారుÑ ఉద్యోగం ఉన్నా, లేకపోయినా పెళ్ళి మాత్రం తప్పకుండా చేస్తారు కదా అన్నారు తాషి. పెళ్ళిళ్ళన్నీ నార్మల్‌ పెళ్ళిళ్ళేనా, కట్నం తీసుకుంటారా, అరేంజ్డ్‌ పెళ్ళి నార్మల్‌ పెళ్ళి కదా అని అడిగినపుడు పార్టిసిపెంట్స్‌ మాట్లాడుతూ ఒకటే కులం, మతం, ఆస్తి, చదువు, ప్రాంతం ఇవన్నీ చూసి నార్మల్‌గా పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పారు. మరి రెండు వేర్వేరు మతాలు, కులాల మధ్య పెళ్ళి జరగడం లేదా? ఇద్దరు వేరే ప్రాంతాల నుండి ఉన్న వ్యక్తులు పెళ్ళి చేసుకోవడం… ఇవి నార్మల్‌ పెళ్ళిళ్ళా? అంటే ఇలాంటివి ఎక్కువగా జరగడంలేదు అని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. కాబట్టి అన్ని పెళ్ళిళ్ళు నార్మల్‌ పెళ్ళిళ్ళు కాదు. అలాగే పెళ్ళి తర్వాత ఏంటి? సంపాదించినా లేకపోయినా ఉద్యోగం ఉన్నా, లేకపోయినా తప్పనిసరిగా పిల్లల్ని మాత్రం కనాలి. వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా పిల్లల్ని కనకపోతే వారిని ఎలా అంటారు అని అడిగినపుడు పిల్లల్ని కనకపోతే గొడ్రాలని, ఏ కార్యాలకి వెళ్ళడానికి పనికిరారని అంటారని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. మరి మగవారిని ఎందుకు ఏమీ అనరు అన్నప్పుడు కష్టాలన్నీ ఆడవారికే అని పార్టిసిపెంట్స్‌ అన్నారు. మగవారికి ఏం సంబంధం ఉండదని అనుకున్నారు, ఇలాంటి ఆడవాళ్ళు మాత్రం వివక్షను ఎదుర్కొంటారు. పెళ్ళయి, పిల్లలు ఉన్న పెళ్ళి మాత్రం నార్మల్‌ పెళ్ళి. ఒకవేళ పిల్లలు లేకపోతే విడాకులివ్వడం, ఇంకో పెళ్ళి చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి.
ఇంట్లో వాళ్ళ కోసమో, సమాజం కోసమో అందరూ పెళ్ళి చేసుకుంటున్నారు. పిల్లల్ని కంటున్నారు. అసలు మనల్ని పెళ్ళి చేసుకోవాలని ప్రేరేపించే వ్యవస్థ ఏ వ్యవస్థ అనేది మాట్లాడుకుందాం. ఆడవాళ్ళు పెళ్ళి చేసుకోవడం అనేది ఎవరో ఒకరు తీసుకునే నిర్ణయం అయి ఉంటుంది. అసలు పెళ్ళి వ్యక్తులుగా మనం ఎందుకు చేసుకుంటాము, ఏమి ఆశిస్తాము అని అడిగారు. కుటుంబం, సంబంధం, సెక్స్‌, డిజైర్‌ లాంటి సమాధానాలు చెప్పారు. తోడు అనేది పెళ్ళి చేసుకుంటేనే దొరుకుతుందా? పెళ్ళి చేసుకోకపోతే తోడు దొరకదా? అంటే తోడు అనేది పెళ్ళి వలనే కాకుండా చాలా రకాలుగా వస్తుంది. పెళ్ళి కాకుండా తర్వాత ఇంకా ఏమి జరుగుతుంది. మనం ఏ ఏ అంశాలయితే పెళ్ళి వలన జరుగుతాయని అనుకుంటామో అవి కాకుండా ఇంక ఏమేమి జరుగుతాయి అని అడిగారు. సమాజంలో ఉండడానికి ఒక చోటు, చెప్పుకోవడానికి ఒక రిలేషన్‌ ఉంటుందని చెప్పారు.
సమాజం ఇంత మారినా, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నా కూడా మేము పెళ్ళి చేసుకోకుండా ఉంటామని ఎందుకు చెప్పడంలేదు అనే చర్చ జరిగింది. మీరు పెళ్ళి చేసుకోవడం ప్రభుత్వానికి ముఖ్యమని మీలో ఎంతమంది నమ్ముతారు అంటే ప్రభుత్వం చదువుకోమని చెప్పడం మానేసి పెళ్ళి చేసుకుంటే రూ.50,000 ఇస్తామనిÑ ఫలానా రకమయిన పెళ్ళి మాత్రం ఎందుకు చేసుకోవాలి, ఆడ మగ ఒకే కులం, ఒకే మతం, ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు మాత్రమే ఎందుకు పెళ్ళి చేసుకోవాలిÑ కుటుంబానికి పెద్దగా కూడా మగవాళ్ళే ఉంటారు. ప్రభుత్వం ఏం చేస్తుందిÑ పరిపాలన చేస్తుంది అన్నారు. పరిపాలన చేయడమేనా, పాలసీలు చేస్తుందా అన్నప్పుడు పాలసీలు కూడా చేస్తుందన్నారు. ఇవన్నీ ఎవరికోసం చేస్తారు అన్నప్పుడు ప్రజల కోసం చేస్తుందని చెప్పారు. అసలు ఎందుకు చేస్తుందని మాట్లాడుకుందాం. పాలసీ ప్రోగ్రాం అనేది ఆడ, మగ, పిల్లలు అనే ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నవారి కోసం చేస్తారుÑ ఒక వ్యక్తిని కుటుంబంలో భాగంగా చూస్తాం. ఆ పెద్ద ఎవరు అంటే మగవారు మాత్రమే కుటుంబ పెద్దగా ఉంటారు. అందుకే ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి మాత్రమే పాలసీలు చేస్తారు. ఇప్పుడిప్పుడు భర్త చనిపోయిన మహిళలు, వృద్ధులు, ఒంటరి ఆడవాళ్ళ కోసం సంక్షేమ పథకాలు చేస్తోంది. పెళ్ళిలో ఎలాంటి అంశాలు ఇన్వాల్వ్‌ అయి ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు, డబ్బు (కట్నం) ఇన్‌వాల్వ్‌ అయి ఉంటుంది. ఇది చేతులు మారుతుంది. ఇది ఒకరి దగ్గరి నుండి ఒకరికి ఎలా పోతుందంటే, తండ్రి నుండి కొడుకులకు వెళ్తుంది. సాధారణంగా ఆడవారి పేరుమీద ఆస్తి ఉండడం లేదు. మొన్న కోవిడ్‌ వచ్చి భర్తలు చనిపోయినపుడు వారికి వారి అకౌంటులో డబ్బు ఎంత ఉందిÑ ఆస్తి ఏమైనా ఉందాÑ లాకర్‌లో ఏమైనా బంగారం ఉందా వంటి ఏ విషయాలూ తెలియదు.
ఆర్థిక విషయాలు ఎక్కువగా భర్తకు మాత్రమే తెలుస్తుంది. వారసత్వ హక్కు చట్టం ఏమి చెప్పినప్పటికీ మగవారి పేరు మీదే ఆస్తి ఉంది. ఒకవేళ అతను పెళ్ళి చేసుకోకపోతే ఏమవుతుందిÑ అతను జీవితంలో సంపాదించుకున్న ఆస్తి ఎక్కడకు పోవాలి అని అడగగా అతని అన్నదమ్ముల పిల్లలకు వెళ్తుందని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. తండ్రి నుంచి కొడుకులకు, భర్త నుండి భార్యకు ఆస్తి వెళ్ళడం సాధారణం. ఒకవేళ ఇలాంటి వ్యవస్థ లేకపోతే ప్రభుత్వాలకు, కుటుంబాలకు భయంÑ ఎందుకంటే వేరే మతస్థులకు లేదా కులస్థులకు పెళ్ళి చేసుకుంటే ఆస్తి వేరే మతస్థులు, కులస్థులకు వెళ్ళిపోతుంది. అది కూడా సమస్యే కదా! వేరేవాళ్ళకు ఈ ఆస్తి పోవడం అన్నది పెద్ద విషయం. ప్రభుత్వానికి మీ పెళ్ళి ఎందుకు ముఖ్యం అంటే మీరు ప్రభుత్వంపై ఆధారపడకూడదు, కుటుంబంపై ఆధారపడి ఉండాలిÑ మీ సొమ్ము మీ కుటుంబానికి వెళ్తుందిÑ అంతేకాదు పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉన్న వాళ్ళను వృద్ధాప్యంలో ఎవరు చూస్తారుÑ వాళ్ళు ప్రభుత్వానికి భారం కాకూడదుÑ కుటుంబ వ్యవస్థపైనే భారం కావాలి. ప్రపంచంలో ఎక్కడయినా పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కంటే మాత్రమే కుటుంబం ఏర్పడుతుంది.
మరి పెట్టుబడిదారీ వ్యవస్థ… అంటే పెద్ద పెద్ద కంపెనీల (బట్టలు, బంగారం, కార్లు మొ॥) కు కూడా మీ పెళ్ళి ముఖ్యమైన విషయం. ఎందుకంటే వాళ్ళకు మార్కెట్‌ జరుగుతుందిÑ కుటుంబ వ్యవస్థలో ఉంటే ఇవన్నీ ఉపయోగించుకుంటారు కాబట్టి. వీళ్ళకు మార్కెట్‌ ముఖ్యమైనదిÑ పనిచేసే మనుషులు కావాలి. అంటే స్వీపర్లు, హౌస్‌కీపింగ్‌, వర్కర్లు మొ॥. పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలంటే ఏం చేస్తారు అని అడిగారు. ఇంట్లో పని చేసుకుని వంట చేసుకుని బాక్స్‌ తీసుకుని వెళ్తామని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. అదే మగవారు పనికి వెళ్ళాలంటే అని అడిగినపుడు, బాక్స్‌ కావాలిÑ అంటే చేసుకోవాలి అని చెప్పరు, కావాలి అంటే ఆ పని ఎవరో ఒకరు చేసిపెట్టాలి అని. పొద్దున్నే పనికి వెళ్ళాలంటే భోజనానికి అంటే… ముందు వాళ్ళను ఎవరో ఒకరు లేపి, వాళ్ళు తయారు కావడానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నారు. ఆడవాళ్ళు ఎంత చదువుకున్నప్పటికీ ఉద్యోగం చేస్తున్నప్పటి పనులన్నీ చేసిన తర్వాత మాత్రమే ఉద్యోగానికి వెళ్తున్నారు. అదే మగవారిని అడిగినప్పుడు మేము కూడా ఇంట్లోవాళ్ళకి సహాయం చేస్తున్నామని చెప్పారు. నాకు భోజనం కావాలి అంటే, నా పనిని నేను చేసుకోవడం లేదుÑ నా పనికి నేను నీకు సహాయం చేస్తున్నాను అని మగవారు అనుకుంటారు. మనం ఎంతలా అనుకుంటామంటే చిన్న సహాయం చేసినా, కొంచెం గట్టిగా మాట్లాడకపోయినా చాలా మంచి భర్త అనుకుంటాము. అంత కిందిస్థాయిగా మనం ఉంటున్నాం. అదే ఆడవాళ్ళకు సంవత్సరానికి ఒకసారి కోపం వచ్చినా సరే చాలా గయ్యాళి గంప అన్నట్లుగా మాట్లాడతారు. కార్పొరేట్‌ వాళ్ళకు కూడా మీ పెళ్ళి కావాలిÑ ఎందుకంటే కుటుంబంలో ఆడవాళ్ళు ఒక గంట ఆలస్యంగా లేచినా మొత్తం వ్యవస్థలో జరిగే పనులన్నీ ఆగిపోతాయి. భర్త ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళడం, కంపెనీలో పనులు ఆలస్యమవడం లాంటివి. ఆడవాళ్ళు చేసే పనికి విలువ కట్టినా, కట్టకపోయినా మీ పని మాత్రం మీకే ఉంటుంది. ఇటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖ్యంగా కుటుంబమనేది అవసరంÑ కుటుంబంలోని అన్ని బాధ్యతలు నిర్వహించడం జరగాలి. కుటుంబం అనేది ఖచ్చితంగా అవసరం. వాళ్ళకు పెళ్ళిళ్ళు అందుకే ముఖ్యం.
బంగారం, బట్టలు, ఇల్లు… వీటన్నింటికీ డిస్కౌంట్లు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వం, కంపెనీలు కాకుండా ఇంకెవరికైనా మీ పెళ్ళి అంటే ఆసక్తి ఉందా అని అడిగితే పూజారులకు అని పార్టిసిపెంట్స్‌ చెప్పారు. సాధారణంగా ఎవరంతట వారు పెళ్ళి చేసుకోరు. ఇంట్లో అమ్మా నాన్న చెప్పారనో, పెద్దవాళ్ళు చెప్పారనో చేసుకుంటారుÑ అంటే ఈ వ్యవస్థ అందరినీ పెళ్ళివైపు నడిపిస్తుంది. మతం అంటే మతానికి పెళ్ళి చేసుకోమని చెబుతుంది. దీనికి కావలసిన తంతు జరగాలంటే చాలా జరగాలి. తర్వాత పెళ్ళి, పిల్లలు, ఉద్యోగం… ఇలా అన్నీ జరగడమనేది మతంకి అవసరం, అంటే ప్రభుత్వాలకి కూడా అన్నమాట. పెళ్ళి దిశగా ఒకసారి ఆలోచించి చూడండి! పెళ్ళి చేసుకుంటే రేషన్‌ కార్డులు, సంక్షేమ పథకాలు, అమ్మకాలు వంటివన్నీ పెళ్ళికి ముడిపెట్టి ఉంటున్నాయి. ఇవన్నీ పెళ్ళికి ముడిపెట్టక పోయి ఉంటే, పెళ్ళి చేసుకుంటేనే సమాజంలో గౌరవముంటుందనే కాకుండా పెళ్ళి చేసుకోకుండా కూడా సమాజంలో గౌరవంగా బతకవచ్చు అనే పరిస్థితి ఉండి ఉంటే మీరు పట్టుబట్టి పెళ్ళి చేసుకునేవాళ్ళా అని ట్రైనర్‌ అడిగారు. కొంతమంది ఒక వయసు వచ్చాక నచ్చినవాళ్ళను, అర్థం చేసుకునే వాళ్ళను చూసి చేసుకునే వాళ్ళం అని సమాధానమిచ్చారు. పెళ్ళి అంటే పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత చేసుకునేదాన్ని అని పిసి చెప్పారు. చిన్నతనం బాగుందిÑ ఇప్పుడీ బాధ్యతలేంటి అనిపిస్తుందిÑ అర్థం చేసుకుని పెళ్ళి చేసుకున్నవాళ్ళు కూడా కొన్నిరోజులయ్యాక విడిపోతున్నారు అని పార్టిసిపెంట్స్‌ అన్నారు. ఉన్నన్ని రోజులు మంచిగా ఉంటున్నారుగా, మరి విడిపోతే ఏంటి అన్నారు. రోజూ అదే హింసను భరించడంకన్నా విడిపోతే ఏమవుతుందని కొంతమంది మాట్లాడారు. తెలిసీ తెలియని వయసులో బాధ్యతలు మీదపడటం వలన, హింసను భరించాల్సి రావడం వలన పెళ్ళి అంటే కొంతమందికి వ్యతిరేక భావన ఉన్నట్లు మట్లాడారు. ట్రైనర్‌ మాట్లాడుతూ పెళ్ళనేది ప్రతి ఒక్కరి జీవితంలో తప్పించుకోలేని, దాటవేయలేని అంశంగా భావిస్తారు. మన చుట్టూ 99 మంది పెళ్ళిచేసుకున్నవాళ్ళే ఉంటారు. చాలా తక్కువమంది 30`40 ఏళ్ళు దాటినా పెళ్ళి చేసుకోరు. మనం పెళ్ళిలో ఎంత హింసను అనుభవిస్తున్నా అలాంటి వాళ్ళు మనకు కనబడగానే వీళ్ళు ఇంకా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అన్నట్లు చూస్తాం. అటువంటి సమాజం, వ్యవస్థ, ఆలోచనలను మనం ప్రేరేపిస్తున్నాం. ఈ వ్యవస్థలో ఉన్న మనం మన జీవితాల గురించి భిన్నంగా ఆలోచించేవాళ్ళమా? అని అడిగారు. మనుషులు, జంతువులకు తేడా ఏంటి అని అడిగి, మనుషులకు ఆలోచించే స్థాయి, సామర్ధ్యం ఉంటాయిÑ కానీ జంతువులకు అలా ఉండదు అన్నారు.
మనం మన భవిష్యత్తు గురించి మంచిగా ప్లాన్‌ చేసుకుంటున్నాం. పార్టిసిపెంట్స్‌ మాట్లాడుతూ పెళ్ళిలో ఉన్న ఇబ్బందులు, భర్త చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు వాళ్ళ బాధ్యతలను పూర్తి చేయడం, కొడుకుల నుండి ఎదుర్కొంటున్న హింస గురించి అందరితో పంచుకున్నారు. ఇంతకుమించి విభిన్నంగా ఆలోచించే అవకాశం ఇచ్చే సమాజంలో మనం లేము. మరోలా ఊహించుకునే స్వేచ్ఛ కూడా వ్యవస్థ ఇవ్వదు. అలా ఆలోచించాలన్నా, పోరాటం చేయాలన్నా సహకారం అందించే ఒక వ్యవస్థ, భూమిక లాంటి సంస్థ కావాలి అన్నారు. పెళ్ళితోనే భద్రత, సహకారం, స్వేచ్ఛ వస్తుందనేది లేదు కాబట్టి పెళ్ళి బయట అలాంటి సపోర్టు ఇచ్చే వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోగలగాలి.
మధ్యాహ్నం సెషన్‌ను ప్రారంభిస్తూ ఆడ, మగ, సహజం, అసహజం గురించి గుర్తు చేస్తూ, పుట్టినప్పుడు ఆడ, మగ ఎలా గుర్తిస్తాముÑ క్రోమోజోమ్స్‌ నిర్మాణాల గురించి వివరించారు. శరీర నిర్మాణం, పనితీరును బట్టి జెండర్‌ అసమానతలు, వివక్షలను సమాజంలో చూస్తున్నాం. దీన్ని జెండర్‌ యొక్క సామాజికీకరణ అంటారు. సెక్స్‌, సెక్సువాలిటీ, జెండర్‌… సెక్స్‌ అంటే ఆడ, మగ. అంటే ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని శరీరానికి సంబంధించి వేటిని ఆధారం చేసుకుని నిర్ధారిస్తాం అని ప్రశ్నించగా శారీరక అంగాలు, జననాంగాలు అని ఎక్కువమంది సమాధానమిచ్చారు. పునరుత్పత్తి అవయవాలు, హార్మోన్స్‌ (క్రోమోజోన్స్‌)ల గురించి వివరించారు. శారీరకంగా భిన్న లైంగిక లక్షణాలు ఉన్న వ్యక్తులను ఇంటర్‌సెక్స్‌ వ్యక్తులు అంటారు. ఖచ్చితంగా ఫిమేల్‌ ఆర్గన్స్‌, మేల్‌ ఆర్గన్స్‌, క్రోమోజోమ్స్‌ మరియు హార్మోన్స్‌ అనేవి భిన్నంగా ఉంటాయి ఇలాంటి వ్యక్తులలో. ఇది వింతగా ఉన్నప్పటికీ ప్రకృతిలో సహజంÑ అలాగే వీరు కూడా ప్రకృతిలో భాగమే అని చెప్పారు.
సెక్స్‌ అనేది ఆడ, మగలే కాక ఇంటర్‌సెక్స్‌ కూడా ఉంటుందనేది వివరించారు. చాలామంది ఇంర్‌ సెక్స్‌ వారిలో వారికి బయటకు కనిపించే జననాంగాలను ఉంచి మిగిలినదాన్ని ఆపరేషన్‌ చేసి తొలగిస్తారు. ఇదే సాధారణంగా మన దేశంలో జరిగేది. జెండర్‌, సెక్స్‌ అనేది రెండూ ఒకటే అంశమా అని అడిగారు. రెండూ ఒకటి కాదు ఎందుకు కాదు పార్టిసిపెంట్స్‌ జెండర్‌ పాత్రలు, నిబంధనల గురించి చెప్పారు. సెక్స్‌ అనేది శరీరానికి సంబంధించిన అంశంÑ జెండర్‌ అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక అంశం. ఆ వ్యక్తి తనను తాను ఎలా గుర్తుంచుకుంటారు అనేది జెండర్‌ అని వివరించారు. పుట్టినప్పుడు ఏ జననాంగంతో పుడతామో పెద్దయ్యాక కూడా అదే సెక్స్‌గా గుర్తించబడే వారిని జఱంస్త్రవఅసవతీ వ్యక్తులు అంటారు. సెక్స్‌ మరియు జెండర్‌ మధ్య ఒకే గుర్తింపు ఉండడం. పుట్టినప్పుడు ఆడపిల్లగా జెండర్‌ ఆపాదించబడి ఎదిగేకొద్దీ వాళ్ళను మగవాళ్ళుగా గుర్తించుకునేవారిని ట్రాన్స్‌ మెన్‌ అని, పుట్టినప్పుడు అబ్బాయిగా ఉండి ఎదిగేకొద్దీ వారిని వారు ఆడవారిగా గుర్తించుకుంటే వారిని ట్రాన్స్‌ మహిళ అని అంటారు. వీరికి ఒక వ్యవస్థ అంటూ ఉంది. అందువల్ల వీరు సమాజంలో ఏదో ఒకచోట తిరుగుతూ, బిచ్చమెత్తుకుంటూ కాలం గడుపుతున్నారు. కానీ ట్రాన్స్‌మెన్‌ ఎక్కువగా కనపడరు. ఎందుకంటే వారిని వారు మగవారిగా గుర్తించుకుంటారుÑ సమాజం కూడా వారిని మగవారిగా చూడాలని అనుకుంటారు. కానీ వీరు బయొలాజికల్‌గా పురుషులు కాదని తెలిసినపుడు వీరిపైన హింస, లైంగిక దాడి జరుగుతుంది. మొదటిసారిగా ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులను పౌరులుగా గుర్తిస్తూ 2014లో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చిన ఆరేళ్ళ తర్వాత చట్టం తీసుకుని వచ్చారు. ఏ వ్యక్తయినా వారియొక్క లింగాన్ని వారే స్వీయ నిర్ధారణ చేసుకునే హక్కు ఉంటుంది. ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు సాధారణంగా సర్జరీలు చేయించుకుంటారు. కానీ అందరూ చేయించుకోవాలని లేదు. అలా సర్జరీలు చేయించుకోని వ్యక్తులు ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులుగా గుర్తించరు అని అర్థం కాదు. సర్జరీలకు, వ్యక్తిగత జెండర్‌కి సంబంధం లేదు.
2019లో కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల పరిరక్షణ చట్టం తీసుకుని వచ్చింది. మీ అందరికీ ఒక డిపార్ట్‌మెంట్‌ అంటే డబ్ల్యుసిడి ఉన్నట్లు ట్రాన్స్‌జెండర్‌కి అలా లేదు. జనాభా లెక్కల్లో కూడా మేము ఉండము అన్నారు. ఈ చట్టం వ్యక్తులకు గుర్తింపు కార్డులు ఎలా తెచ్చుకోవాలో చెబుతుంది. ఈ విషయం మీకు తెలిసినవారికి చెప్పండి. వారితో మంచిగా మాట్లాడటం, మనుషులుగా గుర్తించడం వంటివి ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు సమాజం నుండి ఆశిస్తున్నారు. దీన్ని మీరు కూడా గుర్తించి ఆ విధంగా వారితో ప్రవర్తించాలి. కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ పోర్టల్‌ అనేదాన్ని ప్రారంభించింది. ఇందులో రిజిస్టర్‌ చేసుకుని గుర్తింపు కార్డుల కోసం అప్లై చేసుకోవాలి. 2020లో దీనికి సంబంధించి నియమాలను తీసుకువచ్చారు. ఇది డ్రాఫ్ట్‌ రూపంలో ఉంది. ఇందులో ఏమి ఉండాలి అని తేల్చుకుని చెప్పమన్నారు. అసలే ఎలాంటి వెసులుబాటు లేని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోమంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది. చాలామందికి ఇలాంటి విషయాలలో ఎలాంటి పరిజ్ఞానం ఉండదు. గుర్తింపు కార్డు ఎలా ఉపయోగపడుతుంది అని అడిగినపుడు ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు వర్తిస్తాయిÑ ఈ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మూడు సంవత్సరాలలో ఇంతవరకు ఎంతమందికి వచ్చి ఉంటాయో చెప్పగలరా అని అడిగారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల సంక్షేమం కోసం మొదటిసారి రెండు కోట్ల రూపాయలు, తర్వాత రెండుసార్లు కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఎంతమంది ట్రాన్స్‌ వ్యక్తులు ఉన్నారుÑ ఎలా సరిపోతుంది అనేది మనం తెలుసుకోగలం. ఈ చట్టంలోని లోపాలు విద్య, ఉపాధి అవకాశాలలో ట్రాన్స్‌ వ్యక్తుల గురించి ఈ చట్టంలో ఉండదు. కానీ ఈ చట్టం ద్వారా ఎవరైనా ట్రాన్స్‌ వ్యక్తులపై లైంగిక హింస జరిగినపుడు ఆరు నెలల నుండి రెండు సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అదే ఒక సాధారణ మహిళపై లైంగిక హింస జరిగితే ఏడు నుండి 20 సంవత్సరాల వరకు శిక్ష ఉంటుంది. అంటే ఈ చట్టంలో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై జరిగిన హింసకు తక్కువ శిక్ష విధించడం కూడా ఒకరకంగా నేరం చేసేవారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ఇటీవల ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులపై జరిగిన దాడులను గురించి చర్చించారు. వారిని ఎలా అర్థం చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చెప్పి శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.