– రేష్మ, డి.జి.టి మొదటి సంవత్సరం
పెదవులు కలుసుకున్న పత్రిసారీ గుర్తుకొచ్చేది నువ్వే…
కనురెప్పలు మూసుకున్న పత్రిసారీ వినిపించేది నీ జోలపాటలే…
శ్వాసపీల్చుకున్న పత్రిసారీ శాంతతనిచ్చేది నీ కమ్మని మాటలే…
నిజం తెలుసా అమ్మ!
నువ్వు గుర్తుకువచ్చినపుడల్లా ఎన్నో జ్ఞాపకాలు,
పత్రి క్షణమూ నిన్నే స్మరించుకుంటాను నా గుండె చప్పుడై…
నువ్వు తినిపించిన గోరుముద్దలకు అంత రుచి ఎక్కడిది?
నువ్వు నేర్పిన ఓనమాలే నా ఆకాంక్షకు పునాదులయ్యాయి…
నువ్వు నేర్పించిన తప్పటడుగులే నా భవితకు బంగారు బాట చేసుకుంట
ఎప్పటికి మర్చిపోలేని మధురస్మృతుల జ్ఞాపకం మన బంధం…
జన్మజన్మలకీ వుంటాను నీకే ఋణపడి.
నా వ్యక్తిత్వానికి “దీపశిఖి” మా అమ్మేనని.
నాలోకి అడుగిడితే ఎన్నెన్నో భావాలు
సముద్రపు ఉప్పెనలు చెప్తాయి నా అలజడులు పక్రృతి సోయగాలికేనని,
పురివిప్పిన నెమలి చెప్తుంది నా అందం చిరుజల్లుకేనని,
గొంతు విప్పిన కోయిలమ్మ చెప్తుంది నా రాగం వసంతానికేనని,
వికసించే పువ్వు చెప్తుంది నా పరిమళం తుమ్మెద కోసమేనని,
సరిహద్దులోని సైనికుడు చెప్తాడు నా జీవితం దేశానికే అర్పిస్తానని,
భావి భారత పౌరుడు చెప్తాడు నేను దేశానికి ఋణపడి వుంటానని,
రాలిపోయే ఆకు చెప్తుంది నా జీవితం శాశ్వతం కాదని,
నా కవితలోని భావం చెప్తుంది జీవితానికి ఒక సార్ధకతను నిలుపుకొమ్మని