విద్యార్థుల పర్యావరణ కాంగెస్ర్లో
కలిగిందొక వింతైన అనుభూతి
బాలబాలికలే పార్లమెంటు సభ్యులు
ఓ సీతాకోక చిలుక స్పీకరమ్మ అవతారంలో
మరో చిచ్చరపిడుగు ముఖ్యమంతి వేషంలో
ఇంకో సిసిందీ పత్రిపక్ష నాయకుడి పాతల్రో
వాదోపవాదాల భేరీ భజంతీల్రు
వెల్లువెత్తిన ఉపన్యాసాల తరంగాల విన్యాసాలు
‘అధ్యక్షా! మా పాంతంలో అణువిద్యుత్ ఫ్యాక్టరీ
పెడుతున్నామంటున్నారు
పర్యావరణ పరిరక్షణకి
ఏటి సేత్తారో ఇప్పుడే సెప్పమనండి’-
శీక్రాకుళం చిన్నోడి సూటిపశ్న్ర
‘అధ్యక్షా! పోలవరం పాజ్రెక్టు కడతామంటున్నారు
అడవుల్ని నరికేసి, గిరిజనుల్ని ముంచేసి
అధికార పక్షం వారు సాధించే అభివృద్ధి ఏంటో
సమాధానం చెప్పమనండి’-
తూర్పు గోదారి యాసలో
ఓ గిరిపుతిక్ర సంధించిన బాణం
‘అధ్యక్షా! మా తెలంగాణా పాంతమంతా
ఆగమాగమైపోతోంది
నీళ్ళు లేవు నారుమళ్ళూ లేవు
అభివృద్ధి అసలే లేదు
గీ సంగతేందో గిప్పుడే తేల్చమనుండి’-
తెలంగాణా యాసలో దూసుకొచ్చిన ప్రశ్న
‘అధ్యక్షా! మా పాంతంలో వానరాలే
శెనిక్కాయ పంటకి చీడసోకింది
చీనీకాయల తోట ఎండిపోయింది
ఈ కరెంటు కోత ఎన్నాళ్ళో
అధికార పార్టీవారిని చెప్పమనండి’-
రాయలసీమ కరువు దృశ్యాన్ని
కళ్ళముందు నిలిపిన అమ్మాయి ప్రశ్న
అబ్బో! ఎన్ని యాసల సొగసులో
పిల్లల పార్లమెంటులో
పరిఢవిల్లిన భిన్నత్వ సౌందర్యం
పెద్దలంతా వదిలేసిన పర్యావరణ సమస్య
ఈ చిన్న బుర్రల్లో దూరి కూర్చుంది
ఒకటా? రెండా?
ఎన్ని సమస్యల్ని లేవనెత్తారు
‘అధ్యక్షా! చికున్ గున్యా, డెంగీల్నుంచి
రక్షించమనండి అధ్యక్షా! రక్షించమనండి’
‘వాహన కాలుష్యం ఊపిరితిత్తుల్ని
వలుచుకుని తినేస్తోంది’
‘శబ్ద కాలుష్యం చెవుల్ని బద్దలు కొట్టేస్తోంది.
ఫ్యాక్టరీల వ్యర్థాలు పొలాల్ని నాశనం చేస్తున్నాయి
ఆసుపతి వ్యర్థాలు అందరి ప్రాణాలు తీస్తున్నాయి
అధ్యక్షా! పాలకపక్షం వారిని వినమనండి
వీటన్నింటికీ సమాధానాలు చెప్పమనండి’
సీమటపాకాయల్లా పేలిన
ప్రతిపక్షాల ప్రశ్నల పరంపర
పాలకపక్షానికి చుక్కల్ని చూపించాయి
పిల్లలా వీళ్ళు! కాదు కాదు
పర్యావరణ కాపలాదార్లు
పెద్ద మనుషుల గుండెల్లోకి
ప్రశ్నల బాణాలు సంధించి వదిలారు
పర్యావరణాన్ని నాశనం చేస్తున్న
ప్రబుద్దులందరినీ తీవంగా హెచ్చరించారు
పిల్లలా వీళ్ళు! కాదు కాదు
పర్యావరణ ప్రేమికులు
ఈ పిల్లలేమీ ఖరీదైన కాన్వెంట్లల్లో
బూట్లూ, టైలూ కట్టుకుని చదువుతున్నవాళ్ళు కాదు
అరకొర సౌకర్యాలుండే సర్కారీ బళ్ళల్లో
తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న వాళ్ళు
వాళ్ళేమీ వెలుగుజిలుగుల నగరాల్నించి వచ్చినవాళ్ళు కాదు
కరెంటు కోతల్లో మగ్గే గ్రామాల నించి వచ్చారు
కార్లల్లో స్కూలుకెళ్ళే పిల్లలు కాదు వీళ్ళు
కాలినడకన కదిలి వెళ్ళే కలల వీరులు వీళ్ళు
తళతళ లాడే బూట్లేసుకునే తాహతు లేనివాళ్ళు
హవాయి చెప్పుల్లో దుమ్మూధూళిని మోసుకు తిరిగేవాళ్ళు
అయితేనేం? అవన్నీ లేకపోతేనేం?
మట్టిలో మాణిక్యాలు వీళ్ళు
మట్టితో పెనవేసుకున్నవాళ్ళు వీళ్ళు
సాన పెట్టాలే గాని ధగధగలాడిపోతారు
పిల్లలా వీళ్ళు కాదు కాదు
పర్యావరణ పరిరక్షకులు
మాక్ పార్లమెంటును నడిపినా
మూకాభినయాలు చేసినా
పాటల్తో ఆటల్తో అందరినీ అలరించినా
అందరిదీ ఒకటే లక్ష్యం
అందరిదీ ఒకటే ధ్యేయం
ప్రపంచాన్ని ప్రేమించమంటారు
పర్యావరణాన్ని రక్షించమంటారు
పిల్లలా వీళ్ళు కాదు కాదు
నగర జీవుల కళ్ళు తెరిపించిన
గ్రామీణ విద్యార్థినీ విద్యార్థులు
పచ్చదనాన్ని సృష్టించే బాల కార్మికులు
ప్రకృతిని ప్రేమించే బాల ప్రేమికులు
వనరుల్ని రక్షించే బాల సైనికులు
పిల్లలు కాదు వీళ్ళు
రేపటి భవితవ్యానికి రక్షకులు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్కోర్ విభాగంవారు విశ్వేశ్వరయ్య భవనంలో మూడు రోజులపాటు నిర్వహించిన విద్యార్థుల పర్యావరణ కాంగ్రెస్ 2006 లో అతిథిగా పాల్గొనే అవకాశం కలిగి, గ్రామీణ విద్యార్థినీ విద్యార్థులు కన్పరిచిన ప్రతిభకి ముగ్దురాలనై రాసుకున్న కవిత)
బాగుంధి
ఎంత అదృష్టమో!