నీ ఇష్టం ఉన్న బట్టలు వేసుకో, కాని ఈ బట్టలు వేసుకుంటేనే నీకు బాగుంటది,
అందంగా కనిపిస్తావ్… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్న చదువు చదువుకో, కాని ఇది చదివితే నీ భవిష్యత్తు బాగుంటది…
ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్నప్పుడు పెళ్ళి చేసుకో, కాని ఈ సమయంలో చేసుకుంటే
మంచి సంబంధాలు వస్తాయ్… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్న అబ్బాయిని పెళ్ళి చేసుకో, కాని ఈ మనిషిని చేసుకుంటే
నీ కాపురం మంచిగుంటది… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్నట్టు ఉండు, కాని ఈ విధంగా ఉంటే నిన్ను మంచిది అంటారు,
లేదంటే బజారుదని… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్నవారితో మాట్లాడు, కాని మనవాళ్ళంటూ ఉంటారుగా,
బయటివాళ్ళను గుడ్డిగా నమ్మొద్దు… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
నీ ఇష్టం ఉన్న తిండి తిను, కాని ఈ తిండి తింటే సన్నగా ఉంటవ్
అట్లుంటెనే నువ్వు మనిషి… ఆ తర్వాత అంతా నీ ఇష్టం.
ఇలా అన్ని అన్ని నీ ఇష్టప్రకారమే జరుగుతున్నట్టు ఉంటది, వాటిని ఎంపిక చేసుకునే హక్కు నీ చేతిలో ఉన్నట్టే
ఉంటది.
ఆప్షన్స్ అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి అందులో ఏది ఎంపిక చేసుకోవాలో వారే చెప్పి మనతో ఓ మాట అనిపించి మనమే చెప్పినట్టుగా భ్రమపెడ్తారు. కానీ నీ చేతిలో ఏముండదే పిల్లా…
సమాజమనే పీటకి, మగతనం అనే కర్రకి నడుమ పిండి ముద్దవి నువ్వు… నలిగిపోవాల్సిందే, అన్నీ చేసి అందంగా, అనుకూలంగా, అనుకువగా ఉన్నావని వారే అంటారు. ఆ తర్వాత కాల్చుకు తింటారు. కాదని ఏదైనా అటూఇటుగా చేశావంటే మంచి మంచి పేర్లు పెడతరు.
“““
`A woman is flour lump between society named as polpat (|Ó³ / Chowki) and masculinity named as Rolling Pin (¿£çsÁ / Belan)
They Shape women physically,
They Rape women mentally,
They Roast women entirely,
If she loves or loved by someone,
If she betrays or betryaed by someone,
Whatever she do.
Finally they decide they are Masculine and Women are bitch.