సమకాలీన సాహిత్యంలో విశిష్ట కవయిత్రి షాజహానా -డా.కోయి కోటేశ్వరరావు

తెలుగు కవులు వెంకమ్మలను, బుచ్చమ్మలను పట్టుకొని ఎంతకాలం వేళాడతారని, దేశ సౌభాగ్యమునకు మూలకారణమైన కాపు స్త్రీల కష్టములను ఎప్పుడు గ్రహిస్తారని సురవరం ప్రతాపరెడ్డి ఆరోపించాడు. ప్రాబల్య వర్గాల, మధ్యతరగతికి చెందిన స్త్రీల చుట్టూ స్త్రీవాద సాహిత్యం ప్రదక్షిణలు చేస్తోందని దళిత కవయిత్రులు ప్రశ్నించారు.

అత్యంత ప్రజాస్వామ్యబద్ధమైన ఈ ప్రశ్నలకు అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో వెలువడిన సాహిత్యం సరైన జవాబు చెప్పింది. ఈనాడు దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ వర్గాలకు చెందిన కవయిత్రులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్ధవంతంగా భర్తీ చేస్తున్నారు. వస్తు రూపాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా ముస్లిం వర్గాల నుండి వచ్చిన కవయిత్రులు తెలుగు సాహిత్యానికి కొత్త దారులు వేస్తున్నారు.
భారతదేశంలో మతాల మధ్య ఎన్నో వైరుధ్యాలున్నప్పటికీ, స్త్రీ అస్తిత్వాన్ని నియంత్రించే విషయంలో మాత్రం మౌలికంగా భావసారూప్యత ఉన్నట్లు స్పష్టమవుతుంది. కోరింధీయులకు పౌలు రాసిన మొదటి పత్రికను పరిశీలిస్తే బైబుల్‌లోని స్త్రీ వ్యతిరేక ధోరణి అర్థమవుతుంది. మత గ్రంథాలు, స్మృతులు స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఎంతగా కాలరాసాయో ఇవాళ ప్రత్యేకించి చర్చించుకోనవసరం లేదు. అన్నిటికీ మించి మత ఛాందసవాదం ముస్లిం స్త్రీల స్థితిగతుల్ని ఛిన్నాభిన్నం చేసింది. పర్సనల్‌ ‘లా’ స్త్రీల జీవితంలో నిరవధిక కర్ఫ్యూ విధించింది. ప్రపంచీకరణ యజ్ఞానికి తొలి బలి పశువులు స్త్రీలేనని, పితృస్వామ్యం అగ్నిలో ప్రపంచీకరణ ఆజ్యం పోస్తోందని ప్రొఫెసర్‌ జయంతి ఘోష్‌, జి.జి.ఫ్రాన్సెస్కో లాంటి మేధావులు వాదిస్తుంటే, ఆర్థిక మతోన్మాదమే ప్రపంచీకరణ అని స్వామి అగ్నివేష్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అటు పితృస్వామ్యం, ఇటు మతోన్మాదానికి నడుమ కుమిలిపోతున్న ముస్లిం స్త్రీల సంక్లిష్ట అస్తిత్వాన్ని పునఃసమీక్షించుకోవలసిన అవసరం ఉంది. సమకాలీన సాహిత్యంలో ఈ విధమైన సరికొత్త ఎరుకను కలిగించిన అసాధారణ కవయిత్రి షాజాహానా. ప్రజా ఉద్యమాల ఎజెండాలో సూది మోపినంత స్థానం కూడా లేని బతుకుల తీరుతెన్నుల్ని, రవిగాంచని, ‘సోకాల్డ్‌’ కవి గాంచని జీవితపు సన్నని సందుల్లోని చీకటి పార్శ్వాలను తన కవిత్వంలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్న ధిక్కార రచయిత్రి షాజాహానా. ముస్లిం సమాజాన్ని శాసిస్తున్న సాంస్కృతిక నిర్బంధాన్ని, సామాజిక దౌష్ట్యాన్ని, రాజకీయ పీడనను చీల్చి చెండాడడమే కాకుండా ముస్లిం స్త్రీలు ఎదుర్కొంటున్న విశ్వాస బానిసత్వాన్ని నిరసించి, నిరంకుశ యాజమాన్యత్వంపై షాజాహానా నిప్పులు కురిపించింది. ప్రముఖ ఆంగ్ల కవయిత్రి మీనా కందస్వామిలాగా అతి చిన్న వయసులోనే జాతీయస్థాయిలో ప్రామాణికమైన సృజనాకారిణిగా విశేషమైన గుర్తింపు సంపాదించుకుంది. ‘‘నా దేహానికే కాదు / నా దేశానికి బాధొచ్చినా సహించలేను’’ అంటూ ఉదాత్తమైన, అత్యంత బాధ్యతాయుతమైన సందేశాన్ని అందించటంతో పాటు ‘‘రాజ్యమొక్కటే కాదు మనసులు, మనుషులు లౌకికం కావాలి కదా’’ అంటూ ఫ్యాసిస్టుల గుండెలదిరేలా గర్జించిన షాజాహానా సమకాలీన సాహిత్యంలో ముస్లిం వాదానికి సుస్థిరమైన ఆలంబనగా నిలవటంతో పాటు కవయిత్రిగా, రచయిత్రిగా, విమర్శకురాలిగా, పరిశోధకురాలిగా బహుముఖ పాత్రలను పోషిస్తూ వర్తమాన సాహిత్యానికి కొత్త ఊపిరి పోస్తోంది.
సుప్రసిద్ధ సాహితీ వేత్త డా.దిలావర్‌, యాకూబ్‌ బీ దంపతుల అనురాగానికి ప్రతిరూపమైన ఈ కవయిత్రి పాల్వంచలో ప్రాథమిక విద్యను, కొత్తగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ, హైదరాబాద్‌ కోఠి మహిళా కళాశాలలో ఎం.ఎ. (తెలుగు) చదివి, రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠంలో ఎం.ఫిల్‌. పూర్తి చేసింది. ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ పర్యవేక్షణలో ‘‘ముస్లిం కవిత్వం వస్తురూప వైవిధ్యం’’ అనే అంశంపై సమర్పించిన ఎం.ఫిల్‌. పరిశోధనకు గాను యూనివర్శిటీ నుండి బంగారు పతకం కూడా అందుకుంది. తెలుగులో ముస్లిం సాహిత్యంపై పిహెచ్‌.డి. పూర్తి చేసింది. తన సహచరుడు, ప్రఖ్యాత సాహితీవేత్త స్కై బాబాకు షాజాహానా జీవితంలోనే కాకుండా ఉద్యమంలోనూ, సాహిత్యంలోనూ తోడునీడగా నిలుస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ముస్లిం వాదానికి వెన్నుదన్నుగా భాసిల్లే స్కై బాబా, షాజాహానాల అన్యోన్య దాంపత్యం వీరి సాహిత్యోన్నతికి ఎంతగానో తోడ్పడిరది. చిన్న వయసు నుండే తన తండ్రి డా.దిలావర్‌తో సాహిత్య సభలకు హాజరవుతూ, ఇంట్లో జరిగే కవిత్వ చర్చలను ఆలకిస్తూ, తన గుండె గొంతులో చిగురిస్తున్న సృజనాత్మక ప్రతిభకు షాజాహానా మెరుగులు దిద్దుకుంది. సామాజిక నిర్బంధాలలో, మతపరమైన ఆంక్షల సుడిగుండాలలో చిక్కుకొని స్త్రీలు మూగగా రోదిస్తున్నప్పుడు, ముక్కుపచ్చలారని చిన్నారులని కామోన్మాదులు సంతలో పశువుల్లా కొని వాడుకొని ఏ బద్మాష్‌కో నిర్దాక్షిణ్యంగా అమ్ముతున్నప్పుడు ‘‘జీవితం ప్రవహించినంత మేర / సీసా ముక్కలు పేర్చిన ఆనకట్టలు’’ ఎదురవుతున్నప్పుడు హృదయంలో పొంగి పొర్లుతున్న బాధాసరిత్సాగారాన్ని బహిర్గతం చేసే క్రమంలో అనివార్యంగా షాజాహానా కవయిత్రిగా అవతరించింది. ‘పర్దా హటాకే దేఖో’ అంటూ విశిష్ట కంఠస్వరంతో ముస్లిం కవిత్వంలోకి ఒక సృజన జలపాతంలా దూసుకువచ్చిన ఈ కవయిత్రి ఏ విధమైన ఱఅష్ట్రఱపఱ్‌ఱశీఅం లేకుండా మత, కుల, లైంగిక వివక్షలను, అందుకు కారణభూతమైన ఆధిపత్య రాజకీయాలను నిరసిస్తూ శక్తివంతమైన రచనలు చేస్తోంది.
షాజాహానా వెలువరించిన ‘‘నఖాబ్‌’’ కవితా సంపుటి ముస్లిం సాహిత్య ప్రస్థానంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. మతఖడ్గ పరిష్వంగంలో నలిగిపోతున్న ముస్లిం స్త్రీ జీవన సంవేదనల్ని అక్షరీకరించడంలో షాజాహానా విశేషమైన ప్రతిభను కనబరిచింది. సమాజంలోని మత దురహంకారం, కుటుంబ హింస, వివాహ వ్యవస్థ, బహు భార్యత్వం, లైంగిక హింస, అధిక సంతానం, మాతృత్వం, పేదరికం, కులాధిపత్యం, అన్నింటికీ మించి పురుషాధిపత్యం తదితర అంశాల తీరుతెన్నులను, వాటి పర్యవసానాలను ఎంతో ఆవేదనతో, మరింత ఆలోచనతో ఈ కవయిత్రి తన కవిత్వంలో చర్చించింది. ‘‘షాజాహానా కవితలు చాలా పదునుగా హిందూ మతోన్మాదాన్ని ఖండిస్తాయి. ఇస్లాంలోని స్త్రీల అణచివేతను ప్రశ్నిస్తాయి. ముస్లిం స్త్రీలుగా తాము ఎదుర్కొంటున్న ప్రత్యేక అణచివేతలను కవిత్వీకరించటంలో షాజాహానా ప్రతిభ అసాధారణం. నిర్భయం, నిజాయితీ, సూటిదనం, కవిత్వంలో కలిసి పాఠకుల హృదయాలను కదిలిస్తాయి’’ (ముస్లిం స్త్రీలను మేల్కొలిపే కవిత్వం) అని ఓల్గా చెప్పినట్లుగా ముస్లిం స్త్రీల ప్రత్యేక అణచివేతను షాజహానా అసాధారణంగా సాహిత్యంలో చిత్రించింది. ‘‘కొట్టాలలో పశువులు / ఫారాల్లో కోళ్ళు / చీకటి కొట్లలో మేము / చదువు లేదు, ఏ ఇచ్ఛా ఉండకూడదు. ఎడ్ల మూతికి బుట్టలాగా / గాలి పీల్చే స్వేచ్ఛ కూడా లేకుండా నఖాబ్‌’’ (ఖౌసే ఖాజా) అంటూ ముస్లిం స్త్రీల సామాజిక ఏకాంతాన్ని, వారి జీవితం నిండా పర్చుకున్న స్వేచ్ఛా రాహిత్యాన్ని కవయిత్రి హృద్యంగా బొమ్మ కట్టించింది.
స్త్రీ పురుష సంబంధాల విషయంలో మతం అవలంబించిన పక్షపాత వైఖరిని ఆమోదయోగ్యమైన వాదనా పటిమతో షాజాహానా తన కవిత్వంలో చిత్రీకరించింది. ‘‘30 సార్లు తలాక్‌లు చెప్పి / నువ్వైతే 33 సార్లు నిఖా పేరు మీద / నిఖార్సైన వ్యభిచారం బహిరంగంగా చెయ్యవచ్చు / దయామయుడైన అల్లా ఏ ఆంక్షలు విధించడు / నేను మాత్రం కలుగులో ఎలుకలా / చీకటి మహల్‌లో ఒంటరి దయ్యాన్నై / నీ సరదాల మంచానికి / నేను ఐదో కోడునై శాశ్వతంగా పాతుకు పోవాలి’’ (ఖౌసే ఖాజా) అంటూ బహుభార్యత్వాన్ని ఎండగడుతూ, మతపరమైన ఆధ్యాత్మిక హింసావాదాన్ని కవయిత్రి ఎదిరిస్తుంది. ‘‘మగ శరీర ఖడ్గాల క్రింద మాంస ఖండాలవటానికేనా మా జీవితాలు’’ అని ముస్లిం స్త్రీల పోరాట లేమిని కవయిత్రి ఎత్తి పొడుస్తుంది. అధిక సంతానం మాతృత్వం నెపంతో స్త్రీల జీవితాలను దహించి వేస్తున్న ూవఅ్‌ఱఎవఅ్‌aశ్రీ జశీఅంజూఱతీaషవ ని, రోజువారీ జీవితంలో వారు ఎదుర్కొంటున్న దుర్భరమైన కుటుంబ హింసను ‘‘తన్వీర్‌’’, ‘‘ఖబడ్దార్‌’’, ‘‘గుంగి’’ లాంటి కవితల్లో షాజాహానా ఎంతో కళాత్మకంగా అక్షరబద్ధం చేసింది. స్త్రీలను ‘‘పరదా పిరమిడ్‌లలో ప్రాణం లేని మమ్మీలు’’గా, ‘‘మాంసపు ముద్దలుగా’’, ‘‘చీకటి గబ్బిలాలు’’గా, ‘‘ఉత్పత్తి యంత్రాలు’’గా చూస్తున్న కుహనా సంప్రదాయాలను పరమ ఆగ్రహంగా సవాలు చేస్తుంది. మతం క్రూరత్వపు కత్తి మనమీద నిలుచున్న స్త్రీల మీద జరుగుతున్న పాశవిక లైంగిక దాడుల వల్ల వారిలో పెరుగుతున్న అభద్రతా భావాన్ని ఈ కవయిత్రి బలంగా అభివ్యక్తం చేసింది. నా అల్లా / నా పురుషుడు / నా మతం పెట్టే హింస అనుకుంటే నీ దేవుడు / నీ పురుషుడు / నీ మతం గుడ్డల్ని చీరి పీలకలు చేసినట్టు మా దేహాల్ని పీల్చేస్తున్నారని (ఒంటరి కఫన్‌) కవయిత్రి ఫిర్యాదు చేస్తుంది. ఇస్లాం, హిందూ మతాల్లోని వ్యవస్థీకృతమైన ఆధ్యాత్మిక ఆధిపత్యాన్ని వేలెత్తి చూపుతుంది. మిగతా ముస్లిం కవుల్లాగానే షాజాహానా కవిత్వంలో కూడా ఆత్మ విమర్శతో పాటు ఆత్మగౌరవ దృక్కోణం కూడా కనిపిస్తుంది. ‘‘అబ్‌ సౌ బార్‌ సబ్‌ కో సామ్‌ చిల్లావూంగీ… హా మై లద్దాఫ్నీ హు… లద్దాఫ్నీ హీ రహేంగీ (నేను దూదేకుల స్త్రీనని వందసార్లు కేకేసి చెబుతాను)’’ అంటూ ముస్లింలలో దళితులైన దూదేకుల జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెపుతుంది. అగ్రవర్ణ జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెబుతుంది. అగ్రవర్ణ ముస్లింలు దూదేకుల పట్ల ప్రదర్శించే సాంస్కృతిక ఆధిపత్యాన్ని లదాఫ్ని కవితలో ఈ కవయిత్రి నిశితంగా విమర్శించింది. స్త్రీల గురించే కాకుండా ముస్లింలు ఎదుర్కొంటున్న అనేకానేక సనాతన ఆధునిక వివక్షలను, అవమానాలను, అనుమానాలను షాజాహానా తన కవిత్వంలో సీరియస్‌గా ప్రస్తావించింది. ఎప్పుడో కూల్చివేయబడ్డ దేవాలయాల బరువు ఇప్పటి ముస్లింల భుజాల మీద వేయొద్దని, బిన్‌ లాడెన్‌ అకృత్యాలతో భారతీయ ముస్లింల జీవితాలకు ముడిపెట్టవద్దని, తనపై ఐఎస్‌ఐ ముద్రలు వేసే మతవాదులకు కవయిత్రి బుద్ధి చెపుతుంది. షాజాహానా ఒక్క ముస్లిం సమస్య దగ్గరే ఆగిపోకుండా తెలంగాణ ప్రాంత అణచివేత, ప్రపంచీకరణ, అంతర్జాతీయ తీవ్రవాదం, కరవు, నీటి సమస్య, మానవ సంబంధాలు వంటి సమకాలిక సామాజిక అంశాలను, వాటి పూర్వాపరాలను స్పృశించడం వల్ల ఈమె కవిత్వంలో విభిన్నత్వంతో కూడిన వస్తు విస్తృతి కనిపిస్తుంది. ‘‘నీళ్ళొస్తయి, నీళ్ళొస్తయి అంటున్రుగని / ఏ నీళ్ళు వస్తలే / కంటి బాయిలల్ల సుత జలెండిపోయే / కటెట్ల పానం ఇంకుతున్నట్టు / భూమిల నీళ్ళింకి ఆవిరయి పోబట్టే / చెట్టు చేవ గొడ్డు గోద/ ఎండల ఒరుగులాయే / ఆల్లు మన రక్తాన్ని మన నీల్లని / స్ట్రాలేసుకుని బోండాల్తాగినట్లు తాగుతున్రు (ఎత). తెలంగాణ ప్రాంతంలోని నీటి కరువును, అందుకు కారణమైన నీటి దొంగల దోపిడీతత్వాన్ని అచ్చమైన మాండలిక నుడికారంతో ఈ కవయిత్రి సహజసిద్ధంగా కవిత్వీకరించింది. ‘‘చెయ్యనికి పన్లెక / తిన్నికి తిండిలేక సతమతమయితాంటే కంప్యూటర్‌ తొండ బతుకుల్నిక్కిరించబట్టే అంటూ కుల వృత్తులను కుళ్ళబొడుస్తున్న యాంత్రీకరణకు, బడుగు జీవుల ఉపాధిలేమికి మధ్య పెరుగుతున్న దూరాన్ని, వైరుధ్యాల్ని ఈ కవితలో మరింత ఆలోచనాత్మకంగా అక్షరీకరించింది. ప్రపంచీకరణ సునామీ ధాటికి గ్రామీణ జీవన విధానం ఏ విధంగా విచ్ఛిన్నమవుతోందో తన కవితల్లో షాజాహానా నిరూపించింది.
స్కై బాబాతో కలిసి షాజహానా వెలువరించిన ‘‘చాంద్‌ తారా’’ (2009) లఘు కవితల సంపుటి ఈమెలోని ప్రయోగశీలతకు నిశితమైన భావుకతకు తార్కాణంగా నిలుస్తుంది. ుశీ షతీఱ్‌వ a జూశీవఎ ఱం ్‌ష్ట్రవ ంవషతీవ్‌ శీట పతీవఙఱ్‌వ. ఉత్తమ కవిత్వాన్ని సృజించటమంటే సంక్షిప్తతా రహస్యాన్ని గ్రహించటమేనని అంటాడు రష్యన్‌ రచయిత ణవjaఅర్‌శీjaఅశీఙఱష. ఈ రకమైన కవన నైపుణ్యం చాంద్‌ తార కవితల్లో పరిమళిస్తుంది. గోరంత దీపం లాంటి కవితలో కవయిత్రి కొండంత చైతన్యాన్ని ఆవిష్కరించింది. మహావృక్షం లాంటి ఆలోచనలను చిన్న విత్తనమంత అక్షరాలలో పొందుపరచింది షాజాహానా. రెండవ కవితా సంపుటి ‘‘దర్ధీ’’ (2012) లో భావపరమైన పరిణితితో పాటు వస్తురూపాల సమన్వయంతో కూడిన మెరుగైన శిల్పదృష్టి దర్శనమిస్తుంది. ‘‘నఖాబ్‌’’ కవితా సంపుటిలో వరద గోదావరిలా పోటెత్తిన షాజాహానా సృజనవాహిని ‘‘దర్ధీ’’లో జీవనదిలా తాత్విక గాంభీర్యంతో పాఠకుల హృదయక్షేత్రాలను ఒరుసుకుంటూ ప్రవహిస్తుంది. ‘‘అన్ని చమ్కీలు చీరమీదకు చేరవు / దారితప్పి కింద పడి / ఊడ్పులో మాసి బజారులో ఎండకు మెరిసి / ఏ గాలివేగానికో మురుక్కాలువలో ఆత్మహత్య చేసుకుంటాయి’’ (చమ్కీ) అంటూ అరబ్‌ షేక్‌ల కామదాహానికి బలైపోతున్న అమాయక ముస్లిం స్త్రీల ఆక్రందనలను పాఠకుల గుండె పిండేలాగా కవయిత్రి దృశ్యమానం చేసింది. ‘‘అలిసిన మనసును ఆదుకోవడానికి ఇక్కడ స్థలం లేదు / మరో గ్రహం ఉందేమో వెతుక్కోవాలి’’ అనడం ద్వారా ముస్లిం స్త్రీల Aపఅశీతీఎaశ్రీ ూaఱఅ ను షాజహానా అత్యంత ప్రభావవంతంగా అక్షరబద్ధం చేసింది. ‘‘నువ్వు మంచివాడివి / దేవుడివి / ఉత్తమ పురుషుడివి / పాలకుడివి / అధికారివి / చాలా ఎక్కువగా భర్తవి / తండ్రివి / ప్రేమికుడివి నేను నీవు చెప్పినట్లు వినే రోబోట్‌ను అంతే’’ అంటూ అపురూపమైన వ్యంగ్య శైలితో పురుషాధిపత్యం తాలూకు కర్కశ కోణాలను షాజాహానా ఎత్తి చూపింది. సమకాలీన కవుల్లో శక్తివంతమైన కవయిత్రిగా రాణించిన షాజాహానా కథా రచయిత్రిగా కూడా విజయవంతంగా వడివడిగా మున్ముందుకు సాగిపోతోంది. లద్ధాఫ్ని (2016) కథల సంపుటి ద్వారా షాజాహానా కథాసాహిత్యంలో కూడా తనదైన ముద్రను వేసింది. ూశీర్‌ వీశీసవతీఅ యుగంలో అనునిత్యం సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న పేద ముస్లిం, బహుజన స్త్రీల జీవన స్థితిగతులను తన కథలలో షాజాహానా వాస్తవ దృష్టితో చిత్రించింది. పేదరికంలోని గాఢమైన పార్శ్వాలను, కులం తాలూకు ఇరుకు కోణాలను ఈ కవయిత్రి ఎంతో ఆలోచనాత్మకంగా తన కథలలో చిత్రించింది. గ్రామీణ ముస్లిం స్త్రీలు దుర్భరమైన పేదరికాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ వారి జీవితంలో అనునిత్యం పరిమళించే ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు, అనుబంధాలను అత్యంత రమణీయంగా తన కథలలో నిక్షిప్తం చేసింది. ఆహారానికి కూడా అంటరానితనాన్ని ఆపాదించే బ్రాహ్మణవాడ కుహానా వ్యూహాలను తన కథలలో తేటతెల్లం చేసింది.
ముస్లిం సాహిత్యం మీద పరిశోధన చేయడం వలన ఈ సాహిత్య పరిమితులను, ఇందులో మిగిలిపోయిన ఖాళీలను షాజాహానా సునిశితంగా పరిశీలించి ఈ పరిమితులను అధిగమించే విధంగా, మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసే విధంగా తన సాహిత్య ప్రస్థానాన్ని డిజైన్‌ చేసుకుంది. ముస్లిం వాద సాహిత్య పరణామక్రమాన్ని వేగవంతం చేయడమే కాకుండా ముస్లిం సాహిత్య పరిశోధనకు షాజాహానా కొత్త దారులు వేసింది. ‘‘అస్మితా, షాహిన్‌ లాంటి ప్రభుత్వేతర సంస్థల్లో విధులు నిర్వహించడం వలన సమాజంలో విభిన్న సామాజిక శ్రేణులకు చెందిన స్త్రీల సమస్యల తారతమ్యాన్ని లోతుగా అర్థం చేసుకుని వాటి స్వరూప స్వభావాలను తన సాహిత్యంలోకి తర్జుమా చేసింది.’’
ఆధునిక కవిత్వంలో ఎంతోమంది సాహిత్య విదుషీమణులు ఇంటిలోని లోటుపాట్లను సవరించుకోకుండా వీథిలోని సమస్యల గురించి అంతు తెలియని ఆవేశంతో గొంతు చించుకొని కావ్యాలు, నవలలు రాసిపారేశారు. కానీ, షాజాహానా మాత్రం ముందు తన ఇంట్లో బూజు దులుపుకుంటూనే యుగయుగాలుగా వీథిలో పేరుకుపోయిన సనాతన చెత్తాచెదారాన్ని సమూలంగా ఊడ్చివేస్తుంది. ఇంటిచుట్టూ, వీథి చుట్టూ ఆక్రమించిన అనేకానేక రాజకీయాల లోగుట్టును షాజాహానా తన రచనల ద్వారా బట్టబయలు చేస్తుంది. ఇస్లాంతో పాటు హిందూ మత ఛాందసవాదం మీద షాజాహానా అక్షరాలా ఆటంబాంబులు కురిపిస్తుంది. మత సామ్రాజ్యవాదం దగ్గరే ఆగిపోకుండా ‘‘భూషాడ గో బ్యాక్‌’’ అమెరికన్‌ సామ్రాజ్యవాదంపై కూడా షాజాహానా అక్షరయుద్ధం ప్రకటిస్తుంది. ఎంతో తాత్విక పరిణతి కలిగిన షాజాహానా కవిత్వం హిందీ, ఇంగ్లీష్‌, జర్మనీ భాషల్లో కూడా అనువదింపబడిరది. ‘నఖాబ్‌’ కవిత్వం కన్నడంలోకి అనువాదమై అక్కడ పాఠక జనామోదాన్ని సాధించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌, సాహిత్య అకాడమీ లాంటి జాతీయ, అంతర్జాతీయ సాహిత్య సంకలనాలలో ప్రచురించబడిన షాజాహానా కవితలపై విస్తృత చర్చ కూడా జరిగింది. ఫ్రాంక్‌ఫర్డ్‌ బుక్‌ ఫెయిర్‌ (జర్మనీ, 2006), మాస్కో బుక్‌ ఫెయిర్‌ (రష్యా, 2009) లాంటి అంతర్జాతీయ సాహిత్య వేదికలపై గళమెత్తి, కలమెత్తి కవితాగానం చేసి తెలుగు సాహిత్య కీర్తి పతాకాన్ని విదేశాలలో కూడా ఎగురవేసింది షాజాహానా. ప్రఖ్యాత శ్రీలంక రచయిత్రి అమీనా హుస్సేన్‌ రచనల్లోని ఆర్ద్రత, కన్నడ కవయిత్రి సారా అబూబకర్‌ల సాహిత్యంలో కనిపించే తీవ్రత, తమిళ కవయిత్రి భామ రచనల్లో ఎగసిపడే సృజనాత్మకత, తెగింపు, తాత్విక గాఢత షాజాహానా రచనల్లో తొణికిసలాడుతుంది.
మనువాదులే మహానాయకులుగా ఊరేగుతున్న ప్రస్తుత రాజ్యంలో ఎంతో సాహసోపేతంగా బహుజన దృక్పథంతో ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృషిస్తూ సమకాలీన కవిత్వంలో అగ్రగామి కవయిత్రిగా షాజాహానా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది.
తెలంగాణ ప్రాంతంలోని దూదేకుల కులానికి చెందిన దిగువ మధ్య తరగతి ముస్లిం స్త్రీ గుర్తింపు చైతన్యం నుండి ఈ కవయిత్రి మాట్లాడటం మూలంగా ప్రాంతం, కులం, మతం, జెండర్‌, నిర్దిష్టతలకు సంబంధించిన ఉమ్మడి అణచివేతలోని తీవ్రతను, విస్తృతిని షాజాహానా తన కవిత్వంలో ఎంతో అద్భుతంగా చిత్రించింది. నిజానికి ఇందువల్లనే ఈమె సాహిత్యంలో విలక్షణత, విశిష్టత పడుగుపేకల్లా కలిసిపోయాయి. అందువల్లనే షాజాహానా కవిత్వంలో వీబశ్ర్‌ీఱ ణఱఎవఅంఱశీఅaశ్రీ ూశీవ్‌ఱష ణవఅంఱ్‌వ కనిపిస్తుంది. భావదారను పరిపుష్టం చేసే సజీవ పోలికలను వాడటం, వస్తు సంబంధ వాతావరణంలో నుండి పత్రికల్ని ఏరుకోవడం, అవసరమైన చోట ఖతీసబ ణఱష్‌ఱశీఅ ప్రయోగించటం మొదలగు శిల్పగత అంశాలను సమర్ధవంతంగా సమన్వయం చేయడం వల్ల షాజాహానా రచనల్లో అపురూపమైన జీవన వాస్తవికత కనిపిస్తుంది. ముఖ్యంగా రాజీలేని సృజనాత్మక ప్రతిఘటన ఈ కవయిత్రిలో ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. అందుకే తన సహచరుడు స్కై బాబా రాసిన ‘గుజ్రా’ కవితను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ధూత్కాల్‌ అనే బలమైన కవితను రాయగలిగింది.
మతంలోని పురుష కేంద్రక దృష్టిని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, మత దృక్పథంలోని కాపలాతో కూడిన నియంత్రణని, మతాచారాల్లోని సాధికారత సంక్షోభాన్ని నిశితంగా విమర్శించడం కారణంగా షాజాహానా వీర మతవాదుల ఆగ్రహానికి గురి కావలసి వచ్చింది. ‘‘నా ఖబడ్దార్‌ పోయం ను నా ముందే ఒక ముస్లిం టీచర్‌ ముక్కలుగా చింపాడు’’ (షాజాహానా ఇంటర్వ్యూ ` దర్పణం ` ప్రజాశక్తి ప్రత్యేక సాహిత్య సంచిక). షాజాహానా కవయిత్రిగా సక్సెస్‌ అయిందని చెప్పటానికి ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. షాజాహానా సాహిత్యంలో కనిపించే నిర్మొహమాటానికి, నిజాయితీకి ముస్లిం టీచర్‌ ఆగ్రహమే తార్కాణమని చెప్పవచ్చు. ‘‘ఎందుకు రాస్తార్రా కవిత్వాన్ని? నిషేధించడానికి అర్హత లేని కవిత్వాన్ని’’ అంటాడు సౌదా. ఎంతో ప్రతిభావంతంగా, ఎంతో సాహసోపేతంగా ఈ విధమైన సాహిత్యం సృష్టిస్తున్న షాజాహానాకు షుక్రియా… ముబారక్‌… సలామ్వాలేకుమ్‌.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.